Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Vizag Boat Accident: ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!

    2 hours ago

    ప్రాణాలు కాపాడే లైఫ్‌జాకెట్లు తీసుకెళ్లలేదు. ప్రాణాపాయం గురించి తెలియజేసే ట్రాన్స్‌పాండర్‌ను ఆన్‌ చేయలేదు. మన ఉదాశీనత.. అజాగ్రత్త ఎలా ప్రాణాల మీదకు తెస్తుందో విశాఖ బోటు ఉదంతం తెలియ జేస్తుంది. 

    Vizag Boat Accident: కడలి అలలపై సాగే పయనంలో వారికి ప్రతీ క్షణం ప్రమాదమే... అణుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రమాదకరమైన మత్స్యకారుల జీవితాన్ని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అత్యవసర సమయంలో ప్రాణాలను నిలబెట్టే లైఫ్‌ జాకెట్లు.. తమ పడవ ప్రమాదంలో చిక్కుకుంటే గ్రౌండ్‌కు సమాచారం అందించే ట్రాన్స్‌పాండర్లు వారి వద్ద ఉన్నాయి. కానీ విశాఖ బోటు గల్లంతు ఉదంతంలో ఇవేమీ వాడకపోవడంతో ఆరుగుర వ్యక్తుల ప్రాణాలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మూడు రోజులు అవ్వడంతో వీరు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపు లేనట్లే. ఆ పరికరాలను వాడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. 


    సముద్రం ఉగ్రరూపం దాల్చితే ప్రాణాలు దక్కడం అద్భుతమే. కానీ, చేతిలోనే ప్రాణాలను కాపాడే ఆయుధాలు ఉండి కూడా.. వాడకుండా సముద్ర గర్భంలో కలిసిపోతే అంతకంటే ఘోరమైన దారుణం మరొకటి ఉండదు. సరిగ్గా ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు వైజాగ్ తీరంలో ఆరుగురు మత్స్యాకారుల ప్రాణాలను ముంచేసింది. వేటకు వెళ్లిన బోటు మునిగిపోయి ఆరుగురు ఫిషర్‌మెన్ గల్లంతైన ఘటన వెనుక.. ప్రకృతి వైపరీత్యం తో పాటు మనవ తప్పిదం కూడా ఎక్కువగా కనిపిస్తోంది.

    సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు.. తుపాను హెచ్చరికలు ఉన్నప్పుడు అసలు సమద్రంలోకి వెళ్లడమే మొదటి తప్పు. వాతావరణం బాగా లేదని వాతావరణ శాఖ హెచ్చరికలు  జారీ అవుతున్నా కూడా వీళ్లు బోటుతో లోపలకు వెళ్లారు. 

    ప్రాణాధారాన్ని వదిలేశారు...

    ప్రమాదం జరిగినప్పుడు సముద్రం నడిబొడ్డు నుంచి శాటిలైట్ ద్వారా తీరానికి ఆర్తనాదం పంపే అద్భుతమైన పరికరం..ట్రాన్స్‌పాండర్' (Transponder). బోటు మునిగిపోతున్నా, ఇంజన్ ఫెయిల్ అయినా ఈ ట్రాన్స్‌పాండర్ బటన్ నొక్కితే చాలు.. క్షణాల మీద కోస్ట్‌గార్డ్‌కు లొకేషన్‌తో సహా అలర్ట్ వెళ్తుంది. కానీ, వైజాగ్ ప్రమాదంలో అసలు ఆ లింకే కట్ అయింది. వైజాగ్ బోటు ప్రమాదం గురించి మత్స్యకారుల నుంచి అలాంటి సమాచారం గ్రౌండ్ స్టేషన్‌కు రాలేదు.

    గల్లంతైన వారిలో ప్రాణాలతో బయటపడిన కర్రి చిన్న

    95ాశాతం మంది ట్రాన్స్‌పాండర్ వాడటం లేదు. (Transponder Not Using)

    ఈ ట్రాన్స్‌పాండర్లను ప్రభుత్వమే సరఫరా చేసి ప్రతీ బోటుకు అమర్చారు. అయితే నూటికి 95శాతం ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేస్తున్నారని... నార్త్ ఆంధ్రా కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టీ చెబుతున్నారు " ఈ ట్రాన్స్‌పాండర్లను వాడటంలో ఫిషర్‌మెన్‌లలో విముఖత ఉంది. దీనిని అనవసరం అని భావిస్తున్నవాళ్లు కొందరైతే.. దానితో బోటులోని ఎనర్జీ ఖర్చు అవుతుందనుకునేవాళ్లు మరొకొంతమంది. వాస్తవానికి ట్రాన్స్‌పాండర్ రన్ చేయడానికి పెద్దగా ఇంధనం ఖర్చవదు. ట్రాన్స్‌పాండర్‌ను ఆన్ చేస్తే.. తమ కదలికలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుందని.. కంట్రోల్ మొత్తం వారి చేతుల్లోకి వెళుతుందనే అపోహ కూడా ఉంది." అని  గోపీనాథ్ చెప్పారు. 

    లైఫ్ జాకెట్ ఉందా? ఉంటే ఎందుకు వేసుకోలేదు?

    మరో ప్రధాన అనుమానం ఏంటంటే.. అసలు బోటులో **లైఫ్ జాకెట్లు** ఉన్నాయా? ఒకవేళ ఉన్నా, వాటిని మత్స్యకారులు ఎందుకు వేసుకోలేదు..? సముద్రంలో ఈత వచ్చిన వాళ్లకైనా సరే, ప్రమాద సమయంలో అలల ఉధృతికి తట్టుకోవాలంటే లైఫ్ జాకెట్ తప్పనిసరి. కానీ వీళ్లు వాటిని వాడినట్లు లేదు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కరి శ్రీను.. ఒక్కడే ఈదుకుంటూ రాగలిగాడు.. మిగిలిన వాళ్లు ప్రకృతి తలొంచారు. 

    బోటులో ఉన్న ట్రాన్స్‌పాండర్ స్విచ్ ఆన్ చేయడానికి అయ్యే సమయం కేవలం ఒక్క సెకను. కానీ ఆ ఒక్క సెకను నిర్లక్ష్యం.. ఇవాళ ఆరుగురి కుటుంబాల్లో తీరని నిశ్శబ్దాన్ని మిగిల్చింది. 

    ఇది మిగిలిన వారికి ఓ పాఠం  కావాలి. ట్రాన్స్‌పాండర్లను వాడటం, లైఫ్ జాకెట్లు ధరించడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. 
     ఇకపై వేటకు వెళ్లే ప్రతి బోటులో లైఫ్ జాకెట్లు ధరించడం, ట్రాన్స్‌పాండర్లు ఆన్ చేయడం మ్యాండేటరీ చేయాలి. రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్ రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.

    Click here to Read More
    Previous Article
    Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
    Next Article
    తల్లికి వందనం అర్హుల లిస్ట్ విడుదల: అకౌంట్లలోకి నిధులు జమ అయ్యే తేదీలు ఇవే..

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment