Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి

    3 hours ago

    Express Hari House Warming Ceremony: ఈటీవీ షోస్ 'పటాస్', 'జబర్దస్త్'తో వెలుగులోకి వచ్చిన కమెడియన్ హరి... ఎక్స్‌ప్రెస్ హరి. ఇప్పుడు స్టార్ మా షోస్ చేస్తున్నాడు. ఆయన కొత్త ఇంట్లో అడుగుపెట్టారు.

    హరి పేరు చెబితే తెలుగు బుల్లితెర వీక్షకులు గుర్తు పట్టడం కష్టం కావచ్చు. కానీ, ఎక్స్‌ప్రెస్ హరి (Express Hari) అని చెబితే ఠక్కున గుర్తు పడతారు. తెలుగు టీవీ వీక్షకులకు అతడు సుపరిచితుడు. టీవీ షోస్ 'పటాస్'తో కెరీర్‌ను ప్రారంభించిన హరి... కామెడీ స్కిట్స్, తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు స్టార్ మా టీవీలో షోస్ చేస్తున్నారు. ఇప్పుడీ బుల్లితెర కమెడియన్ ఓ ఇంటివాడు అయ్యారు. కొత్త ఇంటిలో అడుగు పెట్టారు.

    నాలుగు పునాదులు... మూడు గదులు కాదు...
    కష్టానికి ఫలితం... నా జీవితానికి ఉన్న చిరునామా!
    ''నా సొంత ఇల్లు'' అంటూ సోషల్ మీడియాలో గృహప్రవేశం చేసిన ఫోటోలను హరి షేర్ చేశారు. అంతే కాదు... ఆ ఫోటోలను ఆయన ఇచ్చిన క్యాప్షన్ నెటిజనులు ఎంతో ఆకట్టుకుంటోంది. 
    ''ఇది నాలుగు పునాదుల మీద కట్టిన, మూడు గదుల ఇల్లు మాత్రమే కాదు... ఒక మధ్య తరగతి వాడి ఎన్నో ఆశలతో నిండిన కల... దాచుకున్న ప్రతి రూపాయికి ,పడిన ప్రతి కష్టానికి ఫలితం... నాది అని చెప్పుకోవడానికి, వాడి (హరి) జీవితానికి ఉన్న చిరునామా... సాధించాం అనే సంతోషం , సంపాదించుకున్న గౌరవం... ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మారిందే సొంతిల్లు... అది ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది. ఈ ఇంట్లో పడిన ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారింది... నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అభిమానం, ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను'' అని హరి పేర్కొన్నారు.

    Click here to Read More
    Previous Article
    God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
    Next Article
    Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment