Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Manipur President Rule: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత! MHA నోటిఫికేషన్ జారీ!

    6 days ago

    Manipur President Rule: మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమ్నం ఖేమ్‌చంద్‌ సింగ్‌ ఎన్నికైన ఒక రోజు తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వ పునరుద్ధరణకు మార్గం సుగమం అయింది. 

    Manipur President Rule: దాదాపు ఏడాది తర్వాత బుధవారం (ఫిబ్రవరి 4, 2025) మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుంచి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, 60 మంది సభ్యుల శాసనసభను తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ పదవీకాలం 2027లో ముగుస్తుంది. కొత్తగా నియమితులైన బిజెపి శాసనసభా పక్ష నాయకుడు యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అభ్యర్థన పెట్టుకున్నారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  

    ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఖేమ్‌చంద్ 

    బిజెపికి చెందిన 37 మంది ఎమ్మెల్యేలలో 35 మంది, పార్టీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్, ఈశాన్య ఇన్‌ఛార్జ్ సంబిత్ పాత్రా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఎ. శారదా దేవి సమక్షంలో వై. ఖేమ్‌చంద్ సింగ్ మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఖేమ్‌చంద్ సింగ్ మరికొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.   

    మణిపూర్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

    మణిపూర్‌లో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 32 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. జేడీయూ ఆరు సీట్లు గెలుచుకుంది, వారిలో ఐదుగురు బీజేపీలో చేరారు. మిగిలిన ఎమ్మెల్యేలు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నుంచి ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, కుకి పీపుల్స్ అలయన్స్ నుంచి ఇద్దరు, జేడీయూ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్రులు.

    అనేక సమావేశాల తర్వాత బిజెపి నిర్ణయం

    గత కొన్ని నెలలుగా, బిజెపి కేంద్ర నాయకత్వం దాని మెయిటీ, కుకి ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలు NPF, NPP, కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ పరిస్థితి అనుకూలంగా ఉందో లేదో అంచనా వేయడానికి అనేక రౌండ్ల భేటీలు జరిగాయి. ఫిబ్రవరి 9, 2025న ముఖ్యమంత్రి పదవికి ఎన్. బిరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మెయిటీ, కుకి వర్గాల మధ్య నెలల తరబడి ఘర్షణ పూరిత వాతావరణ నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతూ వచ్చింది.  

    యమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఎవరు?

    మాజీ తైక్వాండో అథ్లెట్ అయిన ఖేమ్‌చంద్ సింగ్ 2017, 2022లో సింగ్జమేయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా మణిపూర్ శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన 2017 నుంచి 2022 వరకు మణిపూర్ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. 2022లో బిరేన్ సింగ్ రెండో ప్రభుత్వంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు.

    Click here to Read More
    Previous Article
    Ice Cream History : ఐస్ క్రీం ఎలా పుట్టింది? వేయేళ్ల క్రితం మొదలైన స్వీట్ కథ.. మొదట్లో ఎలా ఉండేదంటే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment