Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Nandamuri Deepika: ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు

    3 hours ago

    Nandamuri Deepika JanakiRam: దివంగత నందమూరి హరికృష్ణ పెద్ద కోడలు, జానకిరామ్ భార్య ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు. భర్త పేరు మీద సేవా కార్యక్రమాలు ప్రారంభించారు నందమూరి దీపిక.

    ఎన్టీఆర్ (Jr NTR) వదిన రాజకీయాల్లోకి వస్తారా? - ఇప్పుడీ సందేహం కొంత మంది రాజకీయ శ్రేణులు - ప్రజల్లో కలగడం సహజం. ఎందుకంటే... ఇటీవల 'ఊరూ వాడ' అంటూ ఆయన అభిమాన సంఘం 'రా ఎన్టీఆర్' చేపట్టిన సేవా కార్యక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం కోసమే అభిమానులతో సేవ చేయిస్తున్నారని ప్రచారం జరిగింది. 'రా ఎన్టీఆర్'తో తమకు సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీసు నుంచి ప్రకటన వచ్చింది. ఈ తరుణంలో ఎన్టీఆర్ వదిన, హరికృష్ణ పెద్ద కోడలు దీపిక చేపట్టిన సేవా కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

    సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
    నందమూరి దీపిక... ఇప్పటి వరకు తెలుగు ప్రజలకు ఈ పేరు పెద్దగా తెలిసింది లేదు. కొన్ని రోజుల క్రితం వరకు ప్రజాక్షేత్రంలోకి ఆవిడ అడుగు పెట్టింది లేదు. దివంగత రాజకీయ నేత - కథానాయకుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ తెలుసు కదా! ఆయన భార్యే నందమూరి దీపిక.
    జానకిరామ్ జీవించి ఉన్నప్పుడు, ఆయన మరణం తర్వాత నందమూరి దీపిక అటు రాజకీయాలు, ఇటు సినిమా కార్యక్రమాల్లో కనిపించినది తక్కువ. కూకట్‌పల్లి నియోజకవర్గంలో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు ఆమె తరఫున ప్రచారం చేశారంతే. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తనయుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ ముని మనవడికి ఆయన పేరు పెట్టారు) హీరోగా పరిచయమయ్యే సినిమా ప్రారంభోత్సవంలో ఆమె మీద తొలిసారి ఫోకస్ పడింది. ఇప్పుడు భర్త జానకిరామ్ పేరు మీద నందమూరి దీపిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. హరికృష్ణ పెద్ద కొసలు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు.

     

    Click here to Read More
    Previous Article
    Telangana BJP Internal Rifts: తెలంగాణ బీజేపీలో గాడిన పడని బండి - లంచ్ డిప్లమసీ ఓకే.. మరి అసలు పంచాయితీ తేలేనా?
    Next Article
    Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment