Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!

    2 hours ago

    Amara Raja Giga Corridor: దివిటిపల్లిలో అమరరాజా ప్లాంట్ ప్రారంభంతో ఏపీ రాజకీయాల్లో రచ్చ. జగన్ రెడ్డి కక్షసాధింపుతోనే రూ.9500 కోట్ల ప్రాజెక్ట్ తెలంగాణకు వెళ్లిందంటూ టీడీపీ విమర్శలు ప్రారంభించింది.

    Jagan Government Driven Away Amara Raja:   తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి గిగా కారిడార్‌లో   అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్  విజయవంతంగా ప్రారంభమవ్వడం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. నాలుగు దశాబ్దాలుగా చిత్తూరు నేలను కేంద్రంగా చేసుకుని ఎదిగిన ఒక స్వదేశీ దిగ్గజ సంస్థ, ఏకంగా  9,500 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించే లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ ప్రాజెక్టును పొరుగు రాష్ట్రానికి తరలించాల్సి రావడంపై ఏపీలో రాజకీయం ప్రారంభమయింది.  ఈ పరిణామాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగానికి జరిగిన తీరని లోటుగా అభివర్ణిస్తూ, తెలుగుదేశం పార్టీ గతాన్ని తవ్వి తీస్తూ వైఎస్సార్‌సీపీపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది.
     
    గల్లా జయదేవ్‌కు లోకేష్ క్షమాపణ

    ఈ ప్రారంభోత్సవం వెనువెంటనే ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమరరాజా సంస్థపై సాగిన రాజకీయ కక్షసాధింపు చర్యలు, వేధింపుల కారణంగానే రాష్ట్రం ఒక చారిత్రక పారిశ్రామిక అవకాశాన్ని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరరాజా ఛైర్మన్ గల్లా జయదేవ్ కుటుంబానికి ఏపీ సమాజం క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చిపెట్టిందని, నాటి జగన్ రెడ్డి సర్కార్ అవలంబించిన  విధ్వంసకర విధానాలే ఈ ప్రాజెక్ట్ తెలంగాణ పాలమూరు రంగానికి వెళ్లడానికి కారణమని లోకేష్ తో పాటు టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు ప్రారంభించాయి. 

    జగన్ హయాంలో అమరరాజాకు ఇబ్బందులు

     వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమరరాజా గ్రూప్‌ను రాజకీయ లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలుఉన్నాయి. గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉండటంతో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్   ద్వారా ప్లాంట్ల మూసివేత నోటీసులు ఇవ్వడం, విద్యుత్ ,  నీటి సరఫరాను అడ్డుకోవడం, కేటాయించిన 253 ఎకరాల పారిశ్రామిక భూములను రద్దు చేసేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయి. ఈ తీవ్ర ఒత్తిళ్లు, అనిశ్చితి వాతావరణాన్ని తట్టుకోలేకనే అమరరాజా తన భవిష్యత్ విస్తరణ అయిన లిథియం-అయాన్ ఈవీ బ్యాటరీ క్లస్టర్‌ను తెలంగాణకు తరలించాల్సి వచ్చిందని పారిశ్రామిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.

    తెలంగాణకు మార్చుకున్న అమరరాజా

    ఈ మొత్తం వ్యవహారంలో ఒకరి నష్టం మరొకరికి లాభంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ యువతకు రావాల్సిన వేలాది ఉద్యోగాలు, రాష్ట్రానికి దక్కాల్సిన కోట్ల రూపాయల పన్ను ఆదాయం నేడు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం సమకూర్చిన అనుకూల వాతావరణంతో దివిటిపల్లి వద్ద అమరరాజా తన ఆసియాలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీల్లో ఒకదానిని సాకారం చేసుకుంటోంది. చిత్తూరు ప్రాంతంలో ఉపాధి ఆశలు అడుగంటిపోగా, పొరుగు రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారడంపై రాయలసీమ ప్రజల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. 

    వైసీపీపై తీవ్రవిమర్శలు

    ప్రస్తుతం ఏపీలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని ఒక పదునైన కేస్ స్టడీగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహం సిద్ధం చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవలంబించిన  కక్షసాధింపు పారిశ్రామిక విధానాలు ఎవరికీ శ్రేయస్కరం కావని, దాంతో రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా దెబ్బతిన్నదో వివరించడానికి జిల్లాల వారీగా ప్రచారానికి సిద్ధమవుతోంది.   గతం గడిచిపోయినా.. అమరరాజా గ్రూప్ ఏపీలో చేపట్టబోయే ఏ ఇతర నూతన విస్తరణ ప్రాజెక్టులకైనా తమ ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తుందని, పూర్తి సహకారాన్ని అందిస్తుందని నారా లోకేష్ పునరుద్ఘాటించారు. కేవలం ఒక్క అమరరాజాయే కాకుండా, గతంలో రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోయిన సుజలాన్, ఫాక్స్‌కాన్ అసెంబ్లీ యూనిట్లు, ఇతర చిన్న-తరహా పరిశ్రమల నిర్వాహకులకు మళ్లీ భరోసా కల్పిస్తూ ఏపీలో పారిశ్రామిక పునరుజ్జీవనానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది 'జగన్ మార్క్ పాలనా వైఫల్యం'పై పోరాటానికి టీడీపీకి దొరికిన బలమైన ఆయుధంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పారిశ్రామిక రాజకీయం ఏపీలో మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

     

     

    Click here to Read More
    Previous Article
    Manasaagadhe Song Lyrics: మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్
    Next Article
    US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment