Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం

    2 hours ago

    US Iran Crisis | అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ చర్చలను తిరస్కరించగా, చమురు సరఫరాపై పలు దేశాల్లో ఆందోళన నెలకొంది.

    US Iran War Updates | వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులను కొనసాగిస్తుండగా, ఇరాన్ సైతం తన ప్రత్యర్థులు, అమెరికా మిత్రదేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపే ఆలోచన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు, సౌదీ అరేబియాను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో 6 నౌకలను అడ్డుకున్నారు. దాంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ ఎగబాకుతాయని ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

    అమెరికా సెంట్రల్ కమాండ్ మంగళవారం నాడు ఇరాన్ మిలిటరీ కమాండ్ కేంద్రాలు, మిస్సైల్, డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లు, నేవీ, ఎయిర్ ఫోర్స్ బేస్ వ్యవస్థలే ప్రధాన లక్ష్యాలుగా దాడి చేసింది. ఈ భీకర దాడుల కారణంగా ఇరాన్‌లోని ఫార్స్, హర్మోజ్‌గన్, సిస్తాన్, ఇలామ్, కెర్మన్ వంటి పలు ప్రావిన్సులలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

    అమెరికా దాడులకు ప్రతికారంగా ఇరాన్ కూడా సమీప దేశాలపై తన దాడులను పెంచింది. వరుసగా నాలుగో రోజు కువైట్‌లోని విద్యుత్, అణు ప్లాంట్లపై విరుచుకుపడటంతో పాటు బహ్రెయిన్ వైపు క్షిపణులను ప్రయోగించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఒక చమురు ట్యాంకర్ నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) దాడి చేసింది. మరోవైపు తమ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశాయని జోర్డాన్ సైన్యం ప్రకటించింది.

    ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో మాట్లాడారు. అమెరికా దాడులకు ఇరాన్ తీవ్రంగా దెబ్బతింటోందని, అందువల్ల తమ ప్రతినిధులు భేటీ కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు ముగించాలని ఇరాన్ చర్చలకు సిద్ధమైతే తప్ప, ప్రస్తుతం వారితో సమావేశమయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

    మరోవైపు ఇరాన్ హోంమంత్రి ఇస్కందర్ మొమెనీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్థాన్‌లో పర్యటించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌లతో చర్చలు జరిపింది. పరిస్థితి చేయిదాటిపోకుండా అమెరికా, ఇరాన్ సంయమనం పాటించాలని షెహబాజ్ షరీఫ్ కోరారు. భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ యువరాజు అబ్దులజీజ్ బిన్ సల్మాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, పశ్చిమాసియా పరిస్థితులపై కీలకంగా చర్చించారు. 

    ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టనుంది: ఇజ్రాయెల్

    ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని (న్యూక్లియర్ ప్రోగ్రామ్) కొనసాగించడానికి సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ గత ఏడాది తన యురేనియం సమృద్ధి కోసం ఉపయోగించే సెంట్రిఫ్యూజ్‌లను పిక్‌యాక్స్ మౌంటెన్ అనే సురక్షితమైన భూగర్భ హాల్‌లోకి తరలించిందని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ భావిస్తోంది. భవిష్యత్తులో ఇరాన్ ఇక్కడి నుంచే తన అణు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంది.

    అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అణు కార్యక్రమం మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాలేదని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం వాటిని ఖండిస్తూ వస్తోంది. 

    Click here to Read More
    Previous Article
    TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment