Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్

    1 hour ago

    భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రధాని నరేంద్ర మోదీ విజన్, ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనకు నిదర్శనమని నారా లోకేష్ అన్నారు. ఇది ఉత్తరాంధ్రలో ఉద్యోగాలు, పరిశ్రమలు, టూరిజం అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌లా మారుతుందన్నారు.

    Bhogapuram Airport Inauguration | భోగాపురం: "ఒకప్పుడు ఎర్రబస్సు కూడా సరిగ్గా రాని ప్రదేశానికి ఈరోజు ఏకంగా ఎయిర్‌బస్ వచ్చింది, ఆ ఎయిర్‌బస్‌లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు" అని ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తక్కువగా అంచనా వేసిన ప్రతి ఒక్కరికీ ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక సమాధానమని స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ప్రధాని మోదీ ఆశయమైన 'వికసిత్ భారత్', ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రత్యక్ష రూపమని, ఉత్తరాంధ్ర ప్రజల కలలకు మోదీ సరికొత్త రెక్కలు తొడిగారని కొనియాడారు. రైతుల త్యాగాలు, కార్మికుల కష్టం, చంద్రబాబు దూరదృష్టి, మోదీ విజన్ కలయికతో వికసిత్ ఉత్తరాంధ్ర లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్
    భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర సమగ్ర పురోగతికి సరికొత్త గ్రోత్ ఇంజన్ గా మారుతుందని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇది కేవలం విమానాశ్రయంగానే కాకుండా ఒక భారీ ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా, అలానే ఎగుమతులు,  దిగుమతుల హబ్‌గా విస్తరిస్తుందన్నారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలను అనుసంధానించే వారధిగా ఎయిర్‌పోర్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు. రోడ్డు, రైలు, విమాన, జలరవాణా అనుసంధానత (కనెక్టివిటీ) తో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోందని, ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఉద్యోగాలు, సువర్ణ భవిష్యత్తుకు వేదికగా మారనుందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర యువత విమానాలెక్కి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆ అవకాశాలే విమానాల్లో ఇక్కడికే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

    ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. అభివృద్ధికి ఊతం 

    గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ విజయాన్ని అందించి ఉత్తరాంధ్ర ప్రాంతం ఎన్డీఏ కూటమికి కంచుకోటగా నిలిచిందని, అందువల్ల ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ బాధ్యతని మంత్రి లోకేష్ అన్నారు. ‘ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం కాదు.. ఈస్ట్ కోస్ట్ ఇండియా యుగం’ అని పేర్కొంటూ, సుందర్‌బన్ నుంచి శ్రీహరికోట వరకు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గుర్తుచేశారు. సంక్షేమం మరియు అభివృద్ధి అనేవి ప్రజా ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని, రాష్ట్ర పురోగతికి ప్రభుత్వ కొనసాగింపు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయాన్ని అద్భుతంగా నిర్మించిన జీఎంఆర్ గ్రూప్‌ను ప్రశంసించడమే కాకుండా, భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో జీఎంఆర్ తమ జన్మభూమి రుణం తీర్చుకున్నారని అభినందించారు.

    ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్ నాయుడు

    ఉత్తరాంధ్ర ప్రజలకు భోగాపురం ఎయిర్ పోర్ట్ సింహద్వారం లాంటిదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆనాడు ఎర్ర బస్సు రాని ప్రాంతం అని కొందరు అవహేళన చేసిన ఉత్తరాంధ్రకు ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చిందన్నారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు, ఈ ప్రాంత అభివృద్ధికి సింహద్వారం లాంటిదన్నారు. యుగానికి ఒక్కసారి జరిగే కార్యక్రమం, ఏపీ అభివృద్ధికి ఉత్తరద్వారంలా ఈ ఎయిర్ పోర్ట్ మారుతుందని రామ్మోహన్ నాయుడు దీమా వ్యక్తం చేశారు.

    Click here to Read More
    Previous Article
    Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment