Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

    1 hour ago

    Iran US Conflict: దక్షిణ ఇరాన్‌పై అమెరికా బలగాలు వరుసగా ఆరోరోజు భీకర దాడులు చేస్తున్నాయి. దాంతో బందర్ అబ్బాస్, పరిసర ప్రాంతాలలో విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి.

    Iran US Conflict: అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ.. వాటిని పక్కనపెట్టి, సీజ్ ఫైర్ రద్దుచేసుకుని మరీ దాడులకు దిగాయి. దాంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. దక్షిణ ఇరాన్‌పై అమెరికా మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ క్షిపణి దాడుల తర్వాత అనేక కీలక ప్రాంతాలలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి పరిసరాల్లో వరుసగా రెండో రోజు కూడా దాడులు కొనసాగాయి. మరోవైపు బహ్రెయిన్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. అక్కడ ఉన్న అమెరికా బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది.

    దక్షిణ ఇరాన్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేత
    ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, అమెరికా తాజా దాడుల్లో బందర్ అబ్బాస్, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. కొన్నిచోట్ల పరిస్థితి సాధారణ స్థితికి వస్తోంది. నోబోన్యాద్-1 ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, ఆ తర్వాత లైన్ క్లియర్ చేసినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. పీక్ అవర్స్‌లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని దక్షిణ ఇరాన్ ప్రజలను అధికారులు కోరారు.

    బహ్రెయిన్‌లో ఎయిర్ రైడ్ సైరన్.. ఇరాన్ కీలక ప్రకటన

     ఎయిర్ రైడ్ సైరన్లు మోగిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ 'తస్నీమ్' వార్తా సంస్థ ప్రకారం, బహ్రెయిన్‌లోని సాఖిర్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా హెలికాప్టర్లు, నిఘా విమానాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది.

    హర్మూజ్ పరిసరాల్లో వరుస దాడులు
    హర్మూజ్ జలసంధిని పర్యవేక్షిస్తున్న అత్యంత కీలకమైన సిరిక్ నగరంలో రెండో రోజు కూడా అమెరికా వైమానిక దాడులు కొనసాగాయి. బుషెహర్‌లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఖామిర్ రేవు సమీపంలోని 2 వంతెనలను లక్ష్యంగా చేసుకోగా, ఇద్దరు వ్యక్తులు మరణించగా, నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

    బందర్ అబ్బాస్, రైల్వే వ్యవస్థపై సైతం దాడులు
    బందర్ అబ్బాస్‌లోని అల్లాహో అక్బర్ ప్రాంతంలో కూడా అమెరికా దాడులు కొనసాగిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఒక నివాస ప్రాంతంపై జరిగిన దాడిలో ఒకరు చనిపోగా, ఎనిమిది మంది గాయపడ్డారు. బందర్ అబ్బాస్ సమీపంలోని రైల్వే వ్యవస్థను అమెరికా ఆర్మీ లక్ష్యంగా చేసుకుని చేపట్టిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పరస్పర దాడుల సమయంలో ఇరాన్‌లోని ఇరాన్‌షహర్ ఎయిర్‌పోర్టును కూడా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఎయిర్‌పోర్టు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు.

    100 మంది అమెరికా సైనికుల్ని కిడ్నాప్ చేయండి !

    పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై భూతల దాడులు జరిపి, కనీసం 100 మంది US సైనికులను కిడ్నాప్ చేసి ఇరాన్‌కు తరలించాలని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు మనుచెహర్‌ మొత్తకి పిలుపునిచ్చారు. అమెరికాతో కుదుర్చుకునే ఏ అవగాహన ఒప్పందమైనా కేవలం ఒక మోసపూరిత ప్రణాళిక మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మొత్తకి, తమ దేశ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా సైనిక స్థావరాలను ఆక్రమించడమే ఏకైక లక్ష్యంగా ఇరాన్ సైన్యం తక్షణమే దాడులకు దిగాలని ఆయన కోరినట్లు స్థానిక మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి.

    Click here to Read More
    Previous Article
    Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
    Next Article
    Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment