Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

    1 hour ago

    AP Rains News | బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

    Rains In Telangana | అమరావతి: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి తోడు కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు ప్రస్తుతం ద్రోణి విస్తరించి ఉంది. ఈ మార్పుల ప్రభావంతో శుక్రవారం ఏపీ వ్యాప్తంగా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. గంటకు 40- 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వర్షం కురుస్తున్నప్పుడు, ఉరుములు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని,  తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

    పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
    బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

    ఉత్తర, మధ్య తెలంగాణలో పలు చోట్ల వర్షాలు

    ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో శుక్రవారం నాడు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

    వర్షాకాలంలోనూ మండుతున్న నిజామాబాద్

    మరోవైపు, తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్ష సూచన ఉన్నప్పటికీ పలు జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్‌లో గరిష్టంగా 35.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈ సమయంలో సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికమని తెలిసిందే.

     

    Click here to Read More
    Previous Article
    Chandrababu Naidu Cases: పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?
    Next Article
    US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment