Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !

    2 hours ago

    AP Nethanna Bharosa Scheme: నేతన్నలకు ఏడాదికి పాతిక వేలు అందించే పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మూడు వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

    CM Chandrababu Naidu Cabinet Meeting:  ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక,   నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా దాదాపు 25కు పైగా అజెండా అంశాలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో యువత, చేనేత కార్మికులు, దివ్యాంగులు, వ్యవసాయ రంగానికి లబ్ధి చేకూర్చే పరిపాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

     3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ  

    ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నిర్ణయం నిరుద్యోగులకు సంబంధించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,168 ప్రభుత్వ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ,  ఇతర రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో నోటిఫికేషన్ల విడుదలకు మార్గం సుగమమైంది. దీనితో పాటు చేనేత కార్మికుల ఆర్థిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ  నేతన్న భరోసా పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

    గోదావరి పుష్కరాల  బందోబస్తు ఏర్పాట్లకు నిధులు

    రాష్ట్రంలో మౌలిక వసతులు,  మౌలిక ప్రాజెక్టుల పురోగతిపై కేబినెట్ లోతుగా చర్చించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల వేగం, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అలాగే రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం 50 కోట్ల నిధులను మంజూరు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో పాటు రైతాంగానికి మద్దతుగా ఏపీ మార్క్‌ఫెడ్ సేకరించే 300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిశ్చయించింది.

    వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీకాలేజీ

     

    సామాజిక బాధ్యత , దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా కేబినెట్ మరో అరుదైన నిర్ణయం తీసుకుంది. బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అత్యవసర సేవల సమర్థతను పెంచేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించి అగ్నిమాపక శాఖకు నూతన వాహనాలు, ఆధునిక యంత్ర పరికరాలు సమకూర్చాలని తీర్మానించారు. విశాఖపట్నంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఎండాడ వద్ద ఏఐజీ  ఆసుపత్రులకు భూ కేటాయింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచారం.  

    రైతులకు సాగునీటి  కొరత లేకుండా చర్యలు

    మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఎల్ నినో ప్రభావం వల్ల ఎదురవుతున్న దుర్భిక్ష పరిణామాలను గమనిస్తూ, రైతులకు సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధి, నూతన పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలమైన విధానాలను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పొగాకు రైతులకుసాయం  చేయడానికి మూడు అంశాలపై మంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 

    Click here to Read More
    Previous Article
    Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా!
    Next Article
    Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment