Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

    2 hours ago

    సినిమా షూటింగ్‌లో మోకాలికి గాయమై హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

    Chandrababu Visits Balakrishna at Hospital | హైదరాబాద్‌: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి స్వయంగా వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డాక్టర్లను అడిగి తన వియ్యంకుడు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు, కోలుకోవడానికి పట్టనున్న సమయం గురించి డాక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు.

    సర్జరీ సక్సెస్ అయిందని, ఏ ఇబ్బంది లేదని డాక్టర్లు చంద్రబాబుకు తెలిపారు. గాయం, సర్జరీ నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని బాలకృష్ణకు సూచించారు. కొన్ని రోజులపాటు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు.. వేగంగా కోలుకుని బాలకృష్ణ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం చంద్రబాబు రాత్రి 8:40కి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.

    షూటింగ్ సమయంలో గాయపడిన నటుడు బాలకృష్ణ

    కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ఎడమ మోకాలి భాగంలో తీవ్రమైన వాపు రావడం, మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడాన్ని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని సూచించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మోకాలి కండరాల్లో ఏమైనా చిన్నపాటి చీలిక ఏర్పడి ఉండవచ్చని భావించిన డాక్టర్ల టీమ్, గత కొన్ని రోజులుగా బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు చేసిన సర్జరీ సైతం సక్సెస్ అయినట్లు తెలియడంతో కుటుంబసభ్యులు, నందమూరి ఫ్యాన్స్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.

     

    Click here to Read More
    Previous Article
    GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
    Next Article
    This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment