Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

    1 hour ago

    Mirabai Chanu Wins Gold at CWG 2026 | కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్ లభించింది. వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను మరోసారి దేశానికి స్వర్ణం సాధించింది.

    India Gold Medal in Commonwealth Games 2026 | గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ లభించింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి పతకం గెలవడం ఇది వరుసగా నాలుగోసారి. గ్లాస్గోలో జరుగుతున్న క్రీడల్లో 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. 

    మీరాబాయి చాను వరుసగా ఇదివరకే మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. పవర్ లిఫ్టర్ మీరాబాయి చాను 2018, 2022, ఇప్పుడు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా గోల్డ్‌ను కైవసం చేసుకుంది. 2014 ఈవెంట్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిసిందే.

    190 కిలోల బరువు ఎత్తిన వెయిట్ లిఫ్టర్

    భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్నాచ్, క్లీన్ అండ్ జర్క్‌లో మొత్తం 190 కిలోల బరువులు ఎత్తింది. మీరాబాయి ఈ విజయం అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండో స్థానంలో నిలిచిన నైజీరియాకు చెందిన రూత్ న్యోంగ్ కంటే ఏకంగా 22 కిలోల ఎక్కువ బరువు ఎత్తడంవిశేషం.

    స్నాచ్ రౌండ్‌లో 85 కిలోల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆమె క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో 105 కిలోల బరువు ఎత్తింది. ఈ విధంగా ఆమె మొత్తం 190 కిలోల బరువు ఎత్తి గోల్డ్ మెడల్‌ను కొల్లగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలిచిన రెండో మెడల్ ఇది. ఆమెకు ముందు పురుషుల 60 కిలోల విభాగంలో రిషికాంత్ సింగ్ రజత పతకం నెగ్గాడు. 

    తొలి ప్రయత్నంలో విఫలం

     మీరాబాయి చాను క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 105 కిలోల బరువు ఎత్తడానికి ప్రయత్నించింది. కానీ విఫలమైంది. రెండో ప్రయత్నంలో ఆమె అంతే బరువు ఎత్తి గోల్డ్‌ మెడల్ ఖాయం చేసుకుంది.

    ఈ మెడల్‌ను గెలిచి భారత్ పతకాల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటివరకు ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు మీరాబాయి చాను (గోల్డ్), రిషికాంత్ సింగ్ (సిల్వర్), పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఝండు కుమార్ కాంస్య పతకం దక్కించుకున్నారు. 

     

    Click here to Read More
    Previous Article
    Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    Related స్పోర్ట్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment