Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Donald Trump On Hormuz: మళ్లీ ఇరాన్ దిగ్బంధం.. హర్మూజ్ బాధ్యత మాదే, 20 శాతం టోల్ విధింపు: డొనాల్డ్ ట్రంప్

    1 hour ago

    Strait of Hormuz | ఇరాన్‌తో సంబంధం లేకుండా హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. జలసంధి నుంచి వెళ్లే నౌకలపై 20 శాతం టోల్ విధిస్తామని ప్రకటించారు.

    వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం హర్మూజ్ విషయంలో యుద్ధం మొదలైంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ చర్యలు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలను పెంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ గురించి ఒక ప్రకటన చేశారు.  తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పక్కనబెట్టి, ఇరాన్‌ను అమెరికా నౌకాదళంతో మళ్లీ దిగ్బంధించబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

    హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల సరకు విలువపై 20 శాతం టోల్ వసూలు చేస్తామని, ఇరాన్ నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటన ఇరాన్‌కు పెద్ద సవాల్ లాంటిది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌తో సంబంధం లేకుండా కూడా హర్మూజ్ తెరిచే ఉంది.. తెరిచే ఉంటుందన్నారు. తాం ఇరాన్‌ను మరోసారి దిగ్బంధనం (Iranian Blockade)ను తిరిగి అమలు చేస్తామన్నారు. 

    ఇరాన్ మినహా అన్ని దేశాలు వెళ్తాయి 

    ట్రంప్ తన తాజా ప్రకటనలో, ఇరాన్ బ్లాకేడ్ అని ఎందుకు అన్నారంటే.. ఇది కేవలం ఇరాన్ నౌకలను, వారి కస్టమర్‌లను రాకపోకలు సాగించకుండా నిరోధిస్తుంది. మిగిలిన దేశాలు హర్మూజ్‌ను ఉపయోగించుకోవచ్చు అని స్పష్టం చేశారు.

    హర్మూజ్ సంరక్షకులుగా అమెరికా

    ఇకపై అమెరికానే హర్మూజ్ జలసంధికి సంరక్షకుడిగా ఉంటుంది. అంటే, గార్డియన్ ఆఫ్ ది హర్మూజ్ స్ట్రెయిట్ అని ట్రంప్ ప్రకటించారు. ఈ సున్నితమైన ప్రాంతంలో నిష్పక్షపాతంగా భద్రత, రక్షణ పనుల కోసం అయ్యే అన్ని అవసరమైన ఖర్చుల కోసం వాణిజ్య నౌకలపై 20 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని తెలిపారు.

    ట్రంప్ ప్రకటనతో ఇరాన్ ఆగ్రహం

    హర్మూజ్ జలసంధితో పాటు తమ దేశం బ్లాకేడ్ ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మూజ్ నిర్వహణలో అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని, అమెరికా జోక్యం చేసుకుంటే గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించింది. ఈ విషయంలో ఏ దేశమైనా అమెరికాకు మద్దతు ఇస్తే, వారు కూడా యుద్ధంలో భాగమైనట్లుగా భావించి చర్యలు తీసుకుంటామని ఇరాన్ ఇతర దేశాలను హెచ్చరించింది.

    గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్ విధ్వంసం

    ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అలాగే, పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్‌ను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో కువైట్‌లోని 2 ఎయిర్‌బేస్‌లలోని పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఫ్యూయల్ ట్యాంకులు, ఒక US వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. కంటికి కన్ను (Eye for An Eye) అనే పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

     

    Click here to Read More
    Previous Article
    Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
    Next Article
    Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment