Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Dry Clothes : చలికాలంలో డ్రెస్​లు త్వరగా ఆరాలంటే ఈ 6 ట్రిక్స్ ట్రై చేయండి.. ఈజీగా డ్రై అయిపోతాయి

    1 month ago

    Winter Tips to Dry Clothes Faster : చలికాలంలో తడి బట్టలతో ఇబ్బంది పడుతున్నారా? త్వరగా ఆరబెట్టడానికి, వాసన రాకుండా, సమయం ఆదా చేయడానికి 6 చిట్కాలు ఫాలో అయిపోండి.

    Simple Ways to Dry Clothes Quickly : చలికాలంలో దుస్తులు ఆరవేయడం కాస్త ఇబ్బందితో కూడిన విషయమే. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు, అధిక తేమ, తక్కువ సూర్యరశ్మి కారణంగా డ్రెస్​లు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. సరిగ్గా ఆరకుంటే దుర్వాసన వస్తూ అసౌకర్యంగా ఉంటుంది. కానీ కొన్ని ఉపాయాలు, ఇంటి చిట్కాలు ఫాలో అయితే.. మీరు శీతాకాలంలో కూడా బట్టలు త్వరగా ఆరబెట్టుకోవచ్చు. బట్టలు ఆరబెట్టే విధానాన్ని సర్దుబాటు చేయడం నుంచి.. సాధారణ వస్తువులను సృజనాత్మక మార్గాల్లో ఉపయోగించడం వరకు.. ఆరు చిట్కాలు ఫాలో అయితే చలికాలంలో కూడా ఈజీగా దుస్తులు ఆరబెట్టుకోవచ్చు. 

    చాలా మంది వాషింగ్ మిషన్​లో స్పిన్నింగ్ శక్తిని తక్కువ అంచనా వేస్తారు. ఉతికిన తర్వాత అదనపు స్పిన్ సైకిల్ లేదా స్పిన్ డ్రైయర్ ఉపయోగించడం వల్ల మీ బట్టల నుంచి ఎక్కువ శాతంలో నీరు తొలగిపోతుంది. ఇది ఆరబెట్టే సమయాన్ని గంటల కొద్దీ తగ్గిస్తుంది. స్వెటర్లు, తువ్వాళ్లు, జీన్స్ వంటి బరువైన వస్తువులు ఆరబెట్టడానికి సులభమైన మార్గం ఇది. దీనివల్ల బయట ఆరబెట్టే సమయం తగ్గడమే కాకుండా.. తేమ, వాసనలు రాకుండా నిరోధిస్తాయి. 

    ఇంట్లోనే ఆరేస్తే..

    మీకు డ్రెస్​లు ఇంటిబయట ఆరవేయలేని పరిస్థితి ఉంటే.. ఇంట్లోకి సహజంగా సూర్యకాంతి లేదా వెచ్చని గాలి వచ్చే ప్రదేశాల్లో ఆరవేయవచ్చు. కిటికీల దగ్గర లేదా వెంట్‌ల కింద ఆరబెట్టే రాక్‌లు ఉంచండి. గుంపుగా వేలాడదీయకుండా గ్యాప్ ఉండేలా.. గాలి ప్రసరణ వెళ్లేలా ఆరేసుకోవాలి. దీనివల్ల ప్రతి భాగం సమానంగా ఆరుతుంది. కోట్లు లేదా దుప్పట్లు వంటి బరువైన వాటిని విడిగా, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో వేసుకోవాలి.

    హెయిర్ డ్రైయర్ 

    త్వరగా ఆరిపోవాలనుకునే డ్రెస్​ల కోసం హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. ఇది ఒక లైఫ్‌సేవర్. కాలర్‌లు, కఫ్‌లు వంటి తడి ప్రదేశాలపై దృష్టి పెట్టండి. ఫ్యాబ్రిక్‌లకు నష్టం జరగకుండా, వేడెక్కకుండా ఉండటానికి సురక్షితమైన దూరంంలో ఉంచి డ్రైయర్‌ను మధ్యస్థ వేడిలో ఉంచి డ్రై చేసుకోండి. అదనంగా హెయిర్ డ్రైయర్‌లు మడతలు నుంచి తేమను తొలగించి దుర్వాసన రాకుండా సహాయపడతాయి.

    టవల్ రోల్ చిట్కా

    అధిక తేమను తీసేయడానికి పొడి టవల్ ఉపయోగించడం ఒక క్లాసిక్ చిట్కా. మీ తడి దుస్తులను చదునుగా ఉంచండి. పైన పొడి టవల్ ఉంచండి. సుషీ రోల్ లాగా చుట్టండి. టవల్ వీలైనంత ఎక్కువ నీటిని పీల్చుకునేలా చుట్టేటప్పుడు గట్టిగా నొక్కండి. ఈ పద్ధతి స్వెటర్లు, సున్నితమైన దుస్తులు, బరువైన వాటికి బాగా పనిచేస్తుంది. విప్పిన తర్వాత వెంటనే ఆరబెట్టండి. ఈ చిట్కా ఆరబెట్టడాన్ని వేగవంతం చేయడమే కాకుండా.. ఎక్కువ కాలం వేలాడదీయడం వల్ల కలిగే సాగదీయడం, ముడుచుకోవడం వంటివాటిని నివారిస్తుంది.

    డీహ్యూమిడిఫైయర్ లేదా హీటర్‌

    శీతాకాలపు గాలి తరచుగా తేమగా ఉంటుంది. ఇది డ్రెస్ల్​లు ఆరే సమయాన్ని పెంచుతుంది. కాబట్టి మీ లాండ్రీ ఏరియాలో డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించడం వల్ల గాలిలోని అదనపు తేమ తొలగిపోతుంది. ఇది మీ బట్టలు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. బూజు, దుర్వాసన వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డీహ్యూమిడిఫైయర్ లేకపోతే సురక్షితమైన హీటర్ లేదా రేడియేటర్ దగ్గర బట్టలు ఉంచండి. వెచ్చని గాలి ప్రసరణ తేమను తగ్గిస్తుంది. ఫాబ్రిక్ నష్టం లేదా అగ్ని ప్రమాదాలను నివారించడానికి సురక్షితమైన దూరంలో హీటర్ ఉంచాలి. 



     

     

     

    Click here to Read More
    Previous Article
    KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
    Next Article
    WPL 2026 Live Stream: డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ జరుగుతాయి? లైవ్ ఎక్కడ చూడొచ్చు? కేవలం ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు!

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment