Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా

    3 hours ago

    NTR Trivikram Movie Controversy: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలోని 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై మొదలైన వివాదం తమిళనాట ఇంకా చల్లారలేదు. రాజకీయ చర్చకు దారి తీసింది.

    ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో ఇంతకు ముందు 'అరవింద సమేత వీరరాఘవ' వచ్చింది. విజయం సాధించింది. అది తెలుగు సినిమా అయితే... ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'గాడ్ ఆఫ్ వార్' (God of War)ను అనౌన్స్ చేశారు. కుమారస్వామి కథతో తెరకెక్కించనున్నారు. అయితే... ఈ సినిమా ప్రకటన కొంత మంది తమిళ తంబీలకు నచ్చలేదు. అసలు వివాదం ఏమిటి? ఆ వివాదంలో లేటెస్ట్ అప్డేట్ ఏమిటి? అనేది చూస్తే...

    మురుగన్ మావాడు... ఉత్తరాది అంటారేంటి?
    ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలోని 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్ చేసినప్పుడు... ''ఉత్తరాది (నార్త్)లో జన్మించాడు'' అని నిర్మాత నాగవంశీ సూర్యదేవర (Suryadevara Naga Vamsi) తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ మాట తమిళులు కొందరికి నచ్చలేదు. 

    తమిళ ప్రజల మనోభావాలను నాగవంశీ ట్వీట్ తీవ్రంగా దెబ్బ తీసింది. మురుగన్ తమిళనాడులో జన్మించాడని, ఆయన తమ సంస్కృతి, తమ అస్తిత్వంలో భాగం అని, ఆయన తమ తమిళ దేవుడు అని వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాను తమిళనాడులో ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ కొంత మంది ట్వీట్లు చేశారు. ఇప్పుడీ అంశం రాజకీయాలకు పాకింది. పొలిటికల్ హీట్ పెంచుతోంది.

    చరిత్రను వక్రీకరిస్తున్నారు - శ్రీమాన్ విమర్శలు!
    ప్రదీప్ రంగనాథన్ హీరోగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చూశారా? అందులో హీరో తండ్రిగా నటించిన వ్యక్తి గుర్తు ఉన్నారా? ఆయన పేరు సీమాన్ (Tamil Actor Politician Seeman). సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లారు. పెద్దగా ప్రభావం చూపించలేదు అనుకోండి. కానీ, ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' మీద విమర్శలు చేస్తున్నారు.

    'గాడ్ ఆఫ్ వార్' ప్రకటనపై తమిళ నటుడు, రాజకీయ నాయకుడు సీమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగన్‌ (కుమారస్వామి)ని ఉత్తరాదిలో జన్మించినట్లు పేర్కొనడం షాకింగ్ విషయమని ఆయన మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించడమే అని ఆయన పేర్కొన్నారు. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో చరిత్రను, సంస్కృతిని మార్చి తెరపై చుపిస్తామంటే అటువంటి ప్రయత్నాలను తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని సీమాన్ హెచ్చరించారు.

    మురుగన్ ఎక్కడివాడు? తమిళనాడులో జన్మించారా? ఉత్తరాదిన జన్మించారా? ఈ అంశంపై వివాదం చెలరేగడంతో తమిళ ప్రజల్లో సినిమాకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. కొబ్బరికాయ కొట్టకముందు నుంచి వార్తల్లో ఉంటోందీ సినిమా.

    Click here to Read More
    Previous Article
    Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
    Next Article
    Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment