Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Home Loan : హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకు ఇల్లు స్వాధీనం చేసుకుంటుందా? పూర్తి వివరాలివే

    1 month ago

    Borrower’s Death & Bank Rights : హోజ్​ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. మిగిలిన రుణం ఎవరు చెల్లిస్తారు? చాలా తక్కువ మందికి తెలిసిన ఈ హోమ్ లోన్ నియమం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

    ఇంటిలోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంక్ ఏమి చేస్తుంది
    రుణం తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత బ్యాంకు ఇంటిని స్వాధీనం చేసుకుంటుందా? గృహ రుణాలు, జాయింట్ లోన్లలో సహ-దరఖాస్తుదారుని పేరు ఉంటుంది. అయితే అలాంటి సమయంలో బ్యాంకు నేరుగా కుటుంబ సభ్యుల నుంచి ఇంటిని లాక్కోవడానికి రాకుండా మొదట సహ-దరఖాస్తుదారుని సంప్రదిస్తుంది.
    ఒకవేళ సహ-దరఖాస్తుదారుడు రుణం చెల్లించలేకపోతే.. బ్యాంకు హామీదారుడిని సంప్రదిస్తుంది. అవసరమైనప్పుడు చెల్లిస్తానని హామీదారుడు పత్రాలలో బాధ్యత తీసుకుంటాడు. హామీదారుడు కూడా చెల్లించలేకపోతే.. బ్యాంకు మరణించిన వ్యక్తి చట్టపరమైన వారసులను.. అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులను సంప్రదిస్తుంది.
    ఒకవేళ సహ-దరఖాస్తుదారుడు.. పూచీకత్తుదారుడు, చట్టపరమైన వారసులలో ఎవరూ రుణం చెల్లించడానికి సిద్ధంగా లేకపోయినా లేదా అసమర్థులైనా.. అప్పుడు బ్యాంకు ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కును కలిగి ఉంటుంది. గృహ రుణంలో ఇల్లు, ఆటో రుణంలో వాహనం, వ్యక్తిగత రుణంలో మరణించిన వ్యక్తి ఇతర ఆస్తులను వేలం వేయవచ్చు.
    అయితే ఒక రోజులో బ్యాంకు నేరుగా స్వాధీనం చేసుకోలేదు. మొదట నోటీసు ఇస్తారు. అవకాశం ఇస్తారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా చెల్లింపు చేయకపోతే.. అప్పుడు బ్యాంకు ఇంటిని సీజ్ చేసి వేలం వేస్తుంది. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో రుణం వసూలు చేస్తారు. మిగిలిన డబ్బును వారసులకు అందజేస్తారు.
    ఒకవేళ లోన్ తీసుకునే సమయంలో వ్యక్తి లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అటువంటి సందర్భంలో లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత బీమా కంపెనీ మొత్తం బకాయిని చెల్లిస్తుంది. కుటుంబంపై EMI భారం పడదు. బ్యాంకు ఆస్తిని జప్తు చేయవలసిన అవసరం ఉండదు.
    చట్టం ప్రకారం ఒక వారసుడు మరణించిన వ్యక్తి ఆస్తిని స్వీకరించకపోతే.. అతను అప్పులు తీర్చడానికి బాధ్యత వహించడు. అయితే అతను ఇల్లు లేదా ఇతర ఆస్తిని తన పేరు మీద తీసుకుంటే ఆ ఆస్తి పరిమితి వరకు రుణం తీర్చడం అతని బాధ్యత అవుతుంది.

    Click here to Read More
    Previous Article
    WPL 2026 Live Stream: డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ జరుగుతాయి? లైవ్ ఎక్కడ చూడొచ్చు? కేవలం ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు!
    Next Article
    Boiled Eggs : ఉడికించిన గుడ్డును ఎన్ని రోజులు వరకు తినవచ్చు.. ఎప్పుడు చెడిపోతుందంటే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment