Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి

    1 month ago

    Hyderabad Crime News: తెలంగాణలోని హైదరాబాద్ మల్కాజ్‌గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. పీరియడ్స్ రావడంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థినికి అసహ్యకరమైన ప్రశ్నలు అడిగి వేధించారు.

    Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విషాదకరమైన ఘటన వెలుగు చూసింది.ఇది గురువు-శిష్యుల పవిత్ర సంబంధం, విద్యా వ్యవస్థ సున్నితత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. క్రమశిక్షణ పేరుతో చేసిన 'మానసిక హింస'కు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని వర్షిణి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 

    ఆరోపణ ఏమిటంటే, కళాశాలలోని ఇద్దరు మహిళా లెక్చరర్లు విద్యార్థిని గోప్యతకు సంబంధించిన అత్యంత అభ్యంతరకరమైన, అవమానకరమైన ప్రశ్నలు అడిగారు. వాటితో ఆమె షాక్‌కి గురై తట్టుకోలేకోపోయింది.  

    మానసిక వేధింపులకు గురైనట్టు బంధువుల ఆరోపణలు

    బంధువుల ఆరోపణల ప్రకారం, వర్షిణి ఏదో కారణంతో ఒక రోజు కళాశాలకు ఆలస్యంగా వచ్చింది. కేవలం కొన్ని నిమిషాల ఆలస్యం కావడంతో, కళాశాల లెక్చరర్లు శ్రీ లక్ష్మి, మధురిమ ఆమెను మందలించడానికి బదులుగా, ఆమెను తోటి విద్యార్థులందరి ముందు నిలబెట్టి, ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించారు. 

    ప్రత్యక్ష సాక్షులు, బంధువుల వాదనల ప్రకారం, లెక్చరర్లు అన్ని పరిమితులను దాటి, విద్యార్థినిని అవమానకరమైన ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. 'ఎందుకు ఆలస్యమైంది? నీకు పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు కట్టిపెట్టు, నిజంగానే పీరియడ్స్ వస్తే మాకు ప్రూఫ్‌ చూపించు.' అని అందరి ముందు అవమానిస్తూ మాట్లాడారని బంధువులు చెబుతున్నారు. తరగతి గదిలో ఇలాంటి అసభ్యకరమైన, వ్యక్తిగత దాడులు విద్యార్థిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి.

    కళాశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, వర్షిణి మానసిక స్థితి పూర్తిగా క్షీణించింది. ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లింది. అదే అవమానకరమైన ప్రవర్తనను పదేపదే గుర్తుచేసుకుంది. సాయంత్రానికి ఆమె అకస్మాత్తుగా ఇంట్లో స్పృహ కోల్పోయి పడిపోయింది. భయపడిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కాని దురదృష్టవశాత్తు వైద్యులు ఆమెను మరణించినట్లు ప్రకటించారు. వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం, విద్యార్థిని అధిక మానసిక ఒత్తిడి కారణంగా మరణించింది, అయితే పూర్తి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

    విద్యార్థి సంఘాలు మరియు బంధువుల ఆగ్రహం

    ఈ విషాదకర ఘటన తరువాత, విద్యార్థి సంఘాలు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మల్కాజ్‌గిరి ప్రభుత్వ కళాశాల వెలుపల పెద్ద సంఖ్యలో నిరసనకారులు నినాదాలు చేశారు. లెక్చరర్లు శ్రీ లక్ష్మి, మధురిమపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

    టీచర్ల ప్రవర్తన అనైతికం మాత్రమే కాదు, నేరం కూడా అని నిరసనకారులు అంటున్నారు. పోలీసులు కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

    మారేడ్‌పల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ, పోస్టుమార్టం నివేదికలో విద్యార్థిని మరణానికి కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని తేలిందని, ఈ ఘటన ఇంట్లో జరిగిందని చెప్పారు. ఇది సహజ మరణం. కళాశాల యాజమాన్యానికి ఇందులో ఎలాంటి సంబంధం లేదు, అయినప్పటికీ బంధువుల ఫిర్యాదు మేరకు లెక్చరర్‌పై బీఎన్‌ఎస్ 194 కింద ఫిర్యాదు నమోదు చేశామన్నారు. 

    Click here to Read More
    Previous Article
    Pawan Kalyan:"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
    Next Article
    EV Charging Tips : విద్యుత్ కారును ఛార్జ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు!లేకపోతే భారీగా నష్టపోతారు!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment