Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    రామ్ చరణ్ 'పెద్ది' మూవీ వాయిదా..?

    1 month ago

    మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన 'చికిరి చికిరి' సాంగ్​ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ఈ పాటకు యూట్యూబ్ లో 110 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా చికిరి చికిరి పాటనే వినిపిస్తోంది. రామ్ చరణ్ గ్రేస్, ఎనర్జిటిక్ డ్యాన్స్, లుక్స్ ఆడియెన్స్​కు తెగ నచ్చేశాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

    అయితే రామ్ చరణ్- బుచ్చి బాబు సానా కాంబోలో వస్తున్న పెద్ది మూవీకి సంబంధించి ఓ షాకింగ్ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్నుంచీ అనుకున్నట్టుగానే ఈ సినిమా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నప్పటికీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

    దీనికి గల కారణం పెద్ది సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ సోలో రిలీజ్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరిలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్, నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ, అలాగే రణ్ వీర్ సింగ్ దురంధర్ 2, అడివి శేష్ డెకాయిట్.. తదితర పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో పెద్ది మూవీ సోలో రిలీజ్ కోసం వేసవికి షిఫ్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


    ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రానుందీ చిత్రం. ఇక ఈ మూవీకి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. బుచ్చిబాబు తొలి చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.


    Click here to Read More
    Previous Article
    ‘అఖండ2’ను వెంటాడుతున్న ‘రాజకీయం’
    Next Article
    రోహిత్, కొహ్లీకి బీసీసీఐ బిగ్ షాక్..! తలో రెండు కోట్లు కట్ ?

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment