Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    రేపు రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

    1 month ago

    ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న కొత్త పాన్ ఇండియా సినిమా ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, హారర్ ఫాంటసీ కలిసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ముగ్గురు కథానాయికలు ఉండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

    Read Also: Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన ‘రివాల్వర్ రీటా’

    ‘ది రాజాసాబ్’ మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

    ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వివరాలను చిత్ర బృందం ప్రకటించింది. ‘ది రాజాసాబ్’ మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ ను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    Prabhas: The Raja Saab movie pre-release event is tomorrow
    Prabhas: The Raja Saab movie pre-release event is tomorrow

    హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఎంతో గ్రాండ్ గా ఈ ఈవెంట్ నిర్వహిస్తామని, అన్ని దారులు ఈ అతిపెద్ద వేడుకకే దారితీస్తాయని పేర్కొన్నారు. మాములుగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లను విడుదలకు రెండు లేదా మూడు రోజుల ముందు నిర్వహించడం మనం చూస్తున్నాం. అయితే ప్రభాస్ (Prabhas) సినిమా ఈవెంట్ ని 13 రోజుల ముందుగానే ప్లాన్ చేస్తుండటం గమనార్హం.

    Click here to Read More
    Previous Article
    Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
    Next Article
    నిమ్మకూరులో ఆస్పత్రి నిర్మాణానికి నారా భువనేశ్వరి గారు శంకుస్థాపన చేసారు.

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment