Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Telangana SIR Process Voter Deletions: తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?

    11 hours ago

    SIR Voter Deletions: తెలంగాణ SIR ప్రాసెస్ లో భారీగా ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. కొడంగల్ లో కుట్రలపై రేవంత్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య ఈసీ కూడా గడువు పెంచింది.

    Telangana SIR Deadline Extension ECI:   తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ   SIR  రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. 2002 నాటి ఓటర్ల డేటాబేస్, జీహెచ్‌ఎంసీ డోర్ నంబర్లు, ఆధార్ ఆధారిత మ్యాపింగ్ ప్రక్రియలో చోటుచేసుకున్న వ్యత్యాసాల కారణంగా దాదాపు 10 శాతం మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఫారమ్‌ల డిజిటైజేషన్ మందకొడిగా సాగుతుండటం, అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా లక్షలాది మందికి బిఎల్వోల  ద్వారా నోటీసులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.       

    ఫ్యామిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ప్రభుత్వం

    ఈ డేటా క్రోడీకరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చివరి క్షణంలో  ఫ్యామిలీ సర్టిఫికెట్లు,  వారసత్వ ధ్రువీకరణలను వేగంగా జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ ఐటీ , రెవెన్యూ యంత్రాంగం ద్వారా మీ-సేవ కేంద్రాల్లో ఈ సర్టిఫికెట్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, దరఖాస్తు చేసుకున్న ఓటర్లు ప్రాసెస్ పూర్తి కాక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యధికంగా ఓట్ల తొలగింపు నోటీసులు రావడం, డిజిటైజేషన్ నమోదు కేవలం 56 శాతానికే పరిమితం కావడం నగర జనాభాను తీవ్ర అయోమయంలోకి నెట్టింది.

    కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకోలేదా? 

    ఈ తీవ్ర విమర్శలు మరియు క్షేత్రస్థాయి విఫలతలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లు బూత్ లెవెల్ ఏజెంట్లతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ఓటర్ల ఓట్లను సక్రమంగా నమోదయ్యేలా చూడటంలో పర్యవేక్షణ లోపించిందని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్ల హక్కులకు భంగం కలగడం సరికాదని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ,  నాయకుల పనితీరుపై హైకమాండ్ క్లాస్ తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు కొన్ని కీలక నియోజకవర్గాల్లో పక్కా వ్యూహంతో కుట్రలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలమున్న సాంప్రదాయ ఓటర్లను, బహుజన, మైనారిటీ ,  నిరుపేద ఓటర్లను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు,  కొన్ని వర్గాలు కుట్రపూరితంగా పేర్లు తొలగించేలా బిఎల్వోల స్థాయిలోనే తప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని, ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా పోకుండా కాపాడుకోవాలని ఆదేశించారు.

    గడువు పొడిగించిన ఎన్నికల సంఘం

    రాష్ట్రంలో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులు, హైదరాబాద్ నగరంలో నత్తనడకన సాగుతున్న ప్రాసెస్,  క్షేత్రస్థాయి ఫిర్యాదులతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తెలంగాణలో సర్  ఎన్యూమరేషన్ ఫారమ్‌ల సేకరణ డెడ్‌లైన్‌ను ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక షెడ్యూల్‌ను సవరించింది. కేంద్ర సీఈవో కార్యదర్శి నవీన్ కుమార్ స్వయంగా హైదరాబాద్ వచ్చి డోర్-టు-డోర్ సర్వేను, నియోజకవర్గాల వారీ డేటాను రీ-వెరిఫై చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ  ఓటర్ల డేటా సమరం తెలంగాణ రాజకీయంలో కాంగ్రెస్ ,  ప్రతిపక్షాల మధ్య సరికొత్త వేడిని రగిల్చింది. ప్రభుత్వం అందిస్తున్న ఫ్యామిలీ సర్టిఫికెట్ల సహాయంతో తొలగించిన ఓటర్లు తమ హక్కును తిరిగి పొందుతారా లేదా ముసాయిదా జాబితా నాటికి భారీ స్థాయిలో ఓట్ల కోత తప్పదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

    Click here to Read More
    Previous Article
    AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment