Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    TG | రాజస్థాన్ టు హైదరాబాద్ @ఏటీఎం చోరీలు !

    1 month ago

    నాగోల్, (ఆంధ్రప్రభ) : రాజస్థాన్ నుంచి వచ్చి హైదరాబాదులో రెక్కీ నిర్వహించి ఏటీఎంలను కొల్లగొడుతున్న పదిమందీ ఉన్న ముఠాను ఆదిభట్ల రాచకొండ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల నగదు గ్యాస్ సిలిండర్ కట్టర్స్, స్విఫ్ట్ కారు, ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

    రాచకొండ సిపి సుధీర్ బాబు ఆ చోరీలకు సంబంధించి వివరాలను సిపి క్యాంప్ కార్యాలయం ఎల్బీనగర్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన రాహుల్ ఖాన్, ముస్తాకిం, సరుకు బషీర్ ఖాన్, సబ్థిన్ ఖాన్, రఫీ ఖాన్, ఈ ఐదుగురు ముఠాలో కీలక సభ్యులు గా ఉన్నారు.

    వీరికి తోడు జహుల్ బదన్ ఖాన్, వాహిద్ ఖాన్, షకీల్ ఖాన్, పర్వేజ్, మహమ్మద్ సర్ఫరాజ్, సహాయకులుగా పనిచేస్తారు. ఈ క్రమంలో వీరు దేశంలో పలుచోట్ల ఏటీఎంల చోరీలకు పాల్పడుతున్నారు. వీరు ఒరిస్సా, బీహార్ ,తదితర రాష్ట్రాలలో చోరీలకు పాల్పడి జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చారు.

    వీరు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. జల్సాలకు అలవాటు పడి ఈ చోరీలు చేస్తున్నట్లు విచారణ ఒప్పుకున్నారని సిపి తెలిపారు. అదేవిధంగా మరో చోరికి తెలంగాణలోని హైదరాబాదును వీరు ఎంచుకొని నెలరోజులు రిక్కి నిర్వహించారు. ఈ క్రమంలో వీరు రావిరాల లోని ఎస్బిఐ ఎటిఎం ను ఎంచుకున్నారు.

    ఈనెల 2న ఉదయం 1 గంటల 55 నిమిషాలకు గ్యాంగ్ లోని ఐదుగురు దుండగులు రావిరాల ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ వద్దకు చేరుకొని ఏటీఎంలోని సీసీ కెమెరాలకు నల్లని స్ప్రే చల్లారు. అనంతరం ఏటీఎం చెస్ట్ భాగాన్ని గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దానిలోని రూ.29,69,900/-నగదును దోచుకొని వెళ్లారు.

    అదే రోజు ఉదయం కొర్రె శ్రీవాణి డిప్యూటీ మేనేజర్ ఎస్బిఐ బ్యాంక్ రవిరాల వారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఏటీఎంలోని నగదు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. ఐదు టీములుగా ఏర్పడిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

    దీనిలో భాగంగా నేరానికి ఉపయోగించిన కారు టోల్గేట్ ల వద్ద ఎంటరింగ్, ఎగ్జిట్ ల ఆధారంగా కేసు పురోగతి సాధించింది. దాని ఆధారంగా వీరు రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల వారిగా గుర్తించారు. ఆ కారు పటాన్చెరువు కు తరచుగా వస్తుండేదని వారికి రాజస్థాన్ వాసులైన పటాన్చెరువు లో ఉన్న వాహిబ్ ఖాన్, షకీల్ ఇంకా గుర్తించారు.

    వారిని విచారించగా నేరము కు ఉపయోగించిన కారు రాజస్థాన్ కు చెందిన జాహుల్ ఖాన్ దిగా ఒప్పుకున్నారు. ఈనెల 24న అదేకారులు రాజస్థాన్ నుంచి ఆ ముఠా మళ్ళీ హైదరాబాద్కు వచ్చి కొంగరకలాన్ ఏరియాలో తిరుగుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారంతో రాఘవేందర్ రెడ్డి నిగా పెట్టారు.

    ఈ క్రమంలో ఈ నెల 25న కొంగరకలాన్ లో ఉన్నారని తెలుసుకున్న రాఘవేందర్ రెడ్డి బృందం వెళ్లి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని విచారించగా మళ్లీ రాజస్థాన్ నుంచి ఏదైనా ఏటీఎం దొంగలించడానికి నగరానికి వచ్చినట్టు విచారణ ఒప్పుకున్నారు.

    అన్ని శాస్త్రీయ ఆధారాల ఆధారంగా వారే చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిరూపించారు. దీంతో పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు పూర్తి నగదును రికవరీ చేసినట్లు సి పి సుధీర్ బాబు పేర్కొన్నారు. వీరు ఇలానే దేశంలో చాలా చోట్ల ఏటీఎం చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.

    ఈ కేసును చేదించిన ఆదిభట్ల సిఐ రాఘవేందర్ రెడ్డిని అలాగే మహేశ్వరం డిసిపి సునీత రెడ్డిని సిపి సుధీర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

    Click here to Read More
    Previous Article
    LSG vs PBKS | ఐదోవ‌ర్ల‌కే మూడు వికెట్లు కోల్పోయిన ల‌క్నో
    Next Article
    Corona Pandemic: కర్ఫ్యూ కట్టుబాట్లు.. కరోనా ఇబ్బందులు.. ఉత్తరప్రదేశ్ లో బ్యాంకుల పనివేళల కుదింపు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment