Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    US Green Cards: అమెరికాలో గ్రీన్ కార్డు నిబంధనలు మరింత కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం, వారికి కష్టమే

    1 month ago

    Green cards in America | వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులను అమెరికా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. వివాహం నిజమైనదా కాదా, వాళ్లు నిజంగానే కలిసున్నారా అని అధికారులు నిర్ధారిస్తున్నారు.

    అమెరికాలో శాశ్వత నివాస అనుమతిని ఇచ్చే గ్రీన్ కార్డు (Green cards in America) విషయంలో ట్రంప్ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. గ్రీన్ కార్డు హోల్డర్లు అమెరికా పౌరులతో సమానం కానప్పటికీ, వారికి అనేక సమాన హక్కులు లభిస్తాయని తెలిసిందే. గ్రీన్ కార్డు పొందడానికి ఒక సులువైన మార్గంగా అమెరికా పౌరులని వివాహం చేసుకునేవారు. ఈ క్రమంలో అమెరికా పౌరుడిని వివాహం చేసుకోవడం మాత్రమే గ్రీన్ కార్డు పొందడానికి హామీ కాదని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీలు హెచ్చరించారు.

    గ్రీన్ కార్డు విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు కఠినతరం

    వివాహ ఆధారిత గ్రీన్ కార్డు దరఖాస్తులను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత నిశితంగా పరిశీలిస్తోంది. అధికారులు కేవలం కాగితాలపై చట్టబద్ధంగా ఉండటమే కుండా, వివాహం నిజమైనదా కాదా అనే దానిపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వం డైవర్సిటీ వీసా (DV) లాటరీని నిలిపివేసింది. ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బర్న్‌స్టీన్ మాట్లాడుతూ.. కేవలం రిలేషన్‌లో ఉండటం వల్ల గ్రీన్ కార్డు రాదని, కలిసి జీవించడం వల్ల వస్తుందని అన్నారు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో నివసించకపోతే, కేవలం మ్యారేజీ మాత్రమే చేసుకున్నట్లు గుర్తిస్తే వారి గ్రీన్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

    భార్యాభర్తలు కలిసి జీవించడం ముఖ్యం

    ఫేస్‌బుక్‌లో ఒక వీడియో విడుదల చేశారు. వివాహ సంబంధిత కేసులలో, మీరు ఎందుకు విడిగా ఉంటున్నారనే దానితో ఇమ్మిగ్రేషన్ అధికారులకు సంబంధం లేదని, అది ఉద్యోగం, చదువు, డబ్బు, సౌలభ్యం కోసమైనా పట్టించుకోరని బ్రాడ్ బర్న్ స్టీన్ అన్నారు. అమెరికా అధికారులకు కేవలం మీరు నిజంగా భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నారా లేదా అనే దానిపైనే ఆసక్తి ఉంటుందని ఆయన తెలిపారు.

    ఇమ్మిగ్రేషన్ అటార్నీ బూన్ ఇంకా ఏమన్నారంటే.. 'భార్యాభర్తలు రెగ్యూలర్‌గా ఒకే ఇంట్లో నివసించకపోతే, ఇమ్మిగ్రేషన్ విభాగం వివాహంపై విచారణ ప్రారంభిస్తుంది. విచారణ ప్రారంభమైన తర్వాత, అధికారులు గ్రీన్ కార్డు ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంది. కనుక మీరు గ్రీన్ కార్డు కోరుకుంటే కేవలం వివాహం మాత్రమే చేసుకోవడమే కాదు, ఆపై కలిసి జీవించాలి' అన్నారు. అమెరికన్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కేవలం చిరునామాలను మాత్రమే కాకుండా, వారి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ నిజనిజాలను కూడా పరిశీలించిన తరువాతే వారికి గ్రీన్ కార్డు ఇస్తుందని పేర్కొన్నారు. 

    Click here to Read More
    Previous Article
    Rohit Sharma Kohli Records: 2026లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బద్దలుకొట్టనున్న 5 పెద్ద రికార్డులు
    Next Article
    Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment