Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్

    1 month ago

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనని వైఎస్‌ జగన్ అన్నారు. భూసేకరణ నుంచి ఫ్లైట్ ఎప్పుడు ఎగురుతుందో అని ప్లాన్ చేసే వరకు అన్నింటినీ తామే చేశామన్నారు.

    YS Jagan on Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్‌లో మరో క్రెడిట్ చోరీకి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ధ్వజమెత్తారు.  భోగాపురం ఎయిర్‌పోర్టులో కీలక భూమిక పోషించింది తామేనని అన్నారు. దానిలో కుంభకోణం చేద్దామని చంద్రబాబు చూశారని ఆరోపించారు. టీడీపీకి చెందిన ఎంపీ అశోక్‌గజపతి రాజు ఏవియేషన్ మంత్రిగా ఉన్నాసరే దానికి కావాల్సిన అనుమతులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రతి అనుమతి తీసుకురావడంలో తామే కృషి చేశామన్నారు. పలుమార్లు ప్రధానమంత్రితో సమావేశమై ఈ విషయంపై ఫోకస్డ్‌గా పని చేశామన్నారు. భూసేకరణ విషయంలో కూడా వేల ఎకరాలు అంటూ ఊదరగొట్టి కోర్టుల్లో కేసులు పడేలా చేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి ప్రజలను ఒప్పించి పునరావాసం కల్పించి భూసేకరణ సజావుగా సాగేలా చేశామన్నారు.  మొదటి ప్లైట్ 2026లో ల్యాండ్ చేస్తామని చెప్పి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేశామన్నారు జగన్. అదే ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తోందని వివరించారు. 

    భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలుత 15వేల ఎకరాలు కావాలని ప్రచారం చేశారని దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఐదు వేలకు తగ్గించారని అన్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 130 కేసులు కోర్టుల్లో వేశారని అన్నారు. అన్నింటినీ డీల్ చేసి పోర్టుకు శంకుస్థాపన చేశామని కేంద్రప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు త్వరగా వచ్చేలా చేశామన్నారు. భూసేకరణకు 960 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని తెలిపారు. నిర్వాసితులకు కాలనీలు కట్టి తరలించామని వివరించారు. కోవిడ్ సమయంలో కూడా దీనిపై ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు.  2026 నాటికి తొలి విమానం ల్యాండింగ్ చేస్తామని నాడే చెప్పామని వివరించారు. 

    పరిశ్రమల ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ హయాంలో భారీగా పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారని చంద్రబాబుతోపాటు మీడియా తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. కానీ ఇప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు కప్పాలు కట్టలేక వెళ్లిపోతున్నారని అన్నారు. భారతీ సిమెంట్స్, మైహోమ్ కంపెనీ, జిందాల్‌ స్టీల్స్, ఇలా చాలా కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో సరికొత్త ప్రచారం చేస్తున్నారని అన్నారు. పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పబ్లిసిటీ పీక్‌లో ఉందని గ్రౌండ్ అయినవి లేనేలేవని అన్నారు. వంట మనుషులకు కూడా కోట్‌లు వేసి ఒప్పందాలు చేసుకుంటున్నారని అన్నారు. మొన్నీ మధ్య కేసీఆర్ కూడా చంద్రబాబుపై మాట్లాడుతూ ఇవే కామెంట్స్ చేశారు. ఇప్పుడు జగన్ కూడా ఇవే కామెంట్స్ చేశారు. 

    అప్పుల విషయంలో కూడా నాడు దుష్ప్రచారం చేశారని ఇప్పుడు అంతకు మించి రుణాలు తీసుకుంటారని అన్నారు జగన్. అయితే తమ హయాంలో తీసుకున్న అప్పులను ప్రజలకు పంచినట్టు అధికారిక లెక్కలు ఉన్నాయని మరి ఇప్పుడు చేస్తున్న అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. తమ సొంత జేబుల్లోకి చేరుతున్నారని ఆరోపించారు. అప్పుల చేస్తూ ప్రజలకు మేలు చేయకపోగా వారిపై భారం మోపుతున్నారని అన్నారు. ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు రెండేళ్లలోనే విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారని మండిపడ్డారు. తాగునీటికి ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని అన్నారు. ప్రజలను పిండుతున్న ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు తక్కువ రేటుకు భూములు దారాదత్తం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    Click here to Read More
    Previous Article
    Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌v
    Next Article
    Donald Trump: భారత్‌పై 500 శాతం సుంకాలు ! ఏర్పాట్లు పూర్తి చేసిన ట్రంప్‌, వచ్చే వారం పార్లమెంటులో బిల్లు!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment