Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Long Island City

    -0.79°C

    Stormy
    4.12 km/h
    60%
    0.2h

    Latest

    Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన

    Eluru News | ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ ప్రభుత్వ హాస్టల్‌లో దుప్పటి అడిగినందుకు ఓ విద్యార్థినిపై వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి ఆ చిన్నారిని బలవంతంగా ఇంటికి పంపించి వేశారు. Chintalapudi SC Girls Hostel | చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడిలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో అమానవీయ ఘటన జరిగింది. రాత్రి వేళ పడుకునే ముందు, చలిగా ఉందని.. తనకు దుప్పటి ఇవ్వాలని అడిగినందుకు.. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిని రాత్రి 10 గంటల సమయంలో వార్డెన్ హాస్టల్ నుంచి బయటికి పంపించేశారు. బాధ్యతగా ఉండాల్సింది పోయి, విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించిన వార్డెన్ తీరుపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత బాలిక అక్షయ మాట్లాడుతూ.. దుప్పటి అడిగినందుకు నన్ను హాస్టల్ ఖాళీ చేయమన్నారు. వార్డెన్ స్వప్న మేడం మమ్మల్ని తిడుతుంది. హాస్టల్ ఇంకా ఖాళీ చేయలని చెబితే రాత్రికి రాత్రి అమ్మతో కలిసి ఇంటికి వెళ్లిపోయానని తెలిపింది. అసలేం జరిగిందంటే...బాధిత బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన అక్షయ ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ, స్థానిక బాలికల జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి పడుకునే ముందు తనకు దుప్పటి ఇవ్వలేదని ఆ విద్యార్థిని హాస్టల్ వార్డెన్ స్వప్నకు తెలిపింది. దీనికి వార్డెన్ తీవ్రంగా ఆగ్రహించి, వెంటనే హాస్టల్ సిబ్బందితో విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేయించారు. హాస్టల్‌లో మీ అమ్మాయికి సీటు లేదు, వెంటనే వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పారు. రాత్రిపూట ఫోన్ రావడంతో ఆందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు రాత్రికి రాత్రే హాస్టల్‌కు చేరుకుని, అసలు ఏం జరిగిందని ఆరా తీశారు. తమ కుమార్తెను హాస్టల్‌లోనే ఉండేలా చూడాలని, ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు వార్డెన్‌ను ఎంతగానో వేడుకున్నారు. అయినప్పటికీ వార్డెన్ ఏమాత్రం కనికరించకుండా, రాత్రి వేళ ఆ విద్యార్థినిని తల్లిదండ్రులతో పాటు ఇంటికి పంపించేశారు.  దీనిపై బాలిక తల్లితండ్రులు మాట్లాడుతూ.. మా అమ్మాయి 3 ఏళ్లుగా ఇదే వసతిగృహంలో ఉంటూ చదువుతోంది. ఫిబ్రవరిలో చెయ్యి విరగడంతో ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాం. కోలుకున్నాక కొన్నిరోజుల కిందట తిరిగి హాస్టల్‌కు తీసుకొచ్చాం. కానీ హాస్టల్ లో సీటు లేదంటూ రాత్రిపూట అని కూడా చూడకుండా ఇంటికి పంపించివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి, బాధ్యులైన హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. హాస్టల్ ఖాళీ చేయాలని రెండు రోజుల కిందటే చెప్పాం. ఇంకా ఎక్కడే ఎందుకు ఉన్నావు మీ నాన్నకు ఫోన్ చేయలేదా అంటూ కూతురిపై హాస్టల్ వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం ఫోన్లు చేస్తే హాస్టల్ లోపల ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 10 గంటల వరకు హాస్టల్ గేట్ వద్దే ఉన్నాం. వేరే పిల్లలు వచ్చి గేట్ వద్ద వదిలివెళ్లారు. నేను, నా భార్య వెళ్లి పాపను తీసుకొచ్చాం. - బాలిక తండ్రి ఫోన్ చేశారని హాస్టల్‌కు వెళ్లాం. హాస్టల్ వార్డెన్ పిల్లలతో బ్యాగ్ ఇచ్చి బయటకు పంపింది. కానీ ఆమె బయటకు రాలేదు. మేం ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. ఏం జరిగిందని అడిగితే. దుప్పటి అడిగితే హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పింది. రాత్రి పది వరకు అక్కడే ఎదురుచూసినా హాస్టల్ సిబ్బంది ఎవరూ వచ్చి మాతో మాట్లాడలేదు. చేసేదేమీ లేక పాపను ఇంటికి తీసుకొచ్చాం - బాలిక తల్లి

    Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

    నాలుగేళ్ల కిందట జరిగిన ధరావత్ నిఖిల్ పరువు హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. యువతి కుటుంబసభ్యులు నిఖిల్ ను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. Honor Killing Case | హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ పరువు హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు తెలంగాణ హైకోర్టు సిబిఐ (CBI) విచారణకు ఆదేశించింది. లా డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిఖిల్.. బర్త్‌డే పార్టీకి వెళ్లగా, ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. యువతి కుటుంబసభ్యులే హత్య చేశారు: నిఖిల్ తల్లిదండ్రుల ఆరోపణలుబాధితుడు నిఖిల్ తల్లిదండ్రుల తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ కారణంగా ఆ యువతి తల్లిదండ్రులే పక్కా ప్రణాళికతో నిఖిల్‌ను కిడ్నాప్ చేసి, ఉరివేసి దారుణంగా హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రోజున ఇంట్లోనే ఉన్న నిఖిల్‌ను బర్త్‌డే పార్టీ ఉందంటూ కొందరు వచ్చి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నిఖిల్ కనిపించకుండా పోవడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో తాము కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిఖిల్ కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత, చిలుకూరు సమీపంలోని ఒక కాలువలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులుఈ కేసు తీవ్రతను బట్టి గతంలోనే ప్రభుత్వం దీనిపై సిఐడి (CID) విచారణకు ఆదేశించింది. అయితే, అటు స్థానిక పోలీసుల దర్యాప్తులోనూ, ఇటు సిఐడి విచారణలోనూ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడి మరణానికి కారణమైన అసలైన నిందితులను కాపాడుతున్నారని నిఖిల్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం, స్థానిక పోలీసులు, సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. నిఖిల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలను వెలికి తీసేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సోమవారం నాడు (జూన్ 29న) సంచలన తీర్పునిచ్చింది. 2022 అక్టోబర్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువలో సూర్యాపేటకు చెందిన 22 ఏళ్ల లా పట్టభద్రుడు ధరావత్ నిఖిల్ మృతదేహం లభించింది. అయితే అగ్రకులానికి చెందిన యువతితో ఇంటర్మీడియట్ నుంచి ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.  నిఖిల్ గిరిజనుడు కావడంతో అమ్మాయి కుటుంబం, బంధువులు తమ కుమారుడ్ని పరువు హత్య చేశారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. 

    Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

    Using Phone Right After Waking Up : నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే మీ రోజూవారీ అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపానికి కారణం ఇదే కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే.. Staying Away From Your Phone After Waking Up : ఉదయం నిద్రలేవగానే చాలా మంది చేసే మొదటి పని ఏంటంటే.. మొబైల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా, న్యూస్ లేదా ఇమెయిల్స్ చెక్ చేస్తారు. ఈ అలవాటు సాధారణంగా కనిపించినా.. ఇది రోజంతా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిద్రలేవగానే ఫోన్ ఎందుకు చూడకూడదంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రలేవగానే మన మెదడు పూర్తిగా యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లదు. ఆ సమయంలో మెదడు నెమ్మదిగా విశ్రాంతి స్థితి నుంచి మేల్కొనే ప్రక్రియలో ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఫోన్‌లో నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ చూడడం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఎక్కువ సమాచారం పడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది.  ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మెదడులో డోపమైన్ అనే రసాయనం ఒక్కసారిగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫోన్‌ను పదేపదే చెక్ చేయాలనే అలవాటు పెరగడంతో పాటు, రోజంతా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. తలనొప్పి, అలసటకు ఇదే కారణమా? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్‌ను ఉదయం ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కొందరిలో తలనొప్పి, కళ్లపై ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే ఇవి ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండవు. స్క్రీన్‌ను ఎంతసేపు చూస్తున్నారు? నిద్ర ఎంత బాగా పట్టింది.. వంటి అంశాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.

    Maa Inti Bangaram Collections Day 10 : మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ - అరుంధతి రికార్డును దాటేసిన సమంత

    Maa Inti Bangaram Box Office Collection Day 10 : పది రోజులైనా సమంత మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద అదే జోష్‌ కంటిన్యూ చేస్తోంది. 10 రోజుల్లో అనుష్క అరుంధతి మూవీ రికార్డును అధిగమించింది. Samantha's Maa Inti Bangaram Box Office Day 10 Collections : సమంత మా ఇంటి బంగారం పది రోజులైనా బాక్సాఫీస్ వద్ద అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. సెకండ్ వీకెండ్ ఆదివారం మంచి నెంబర్స్ నమోదు చేసింది. స్టార్ హీరోయిన్ అనుష్క అరుంధతి మూవీ వరల్డ్ వైడ్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ రికార్డును అధిగమించింది.  10 రోజుల కలెక్షన్స్ ఈ మూవీ పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.78.71 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఒక్క ఆదివారమే ఇండియావ్యాప్తంగా రూ.5.30 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆదివారం ఒక్క రోజే ఇండియావ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ.6.14 కోట్లు నమోదు చేశాయి. మొత్తం పది రోజుల్లో రూ.48.25 కోట్ల నెట్ కలెక్షన్స్... రూ.55.86 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అటు... ఓవర్సీస్‌లోనూ అదే జోష్ కంటిన్యూ చేసింది. ఆదివారం ఒక్క రోజే ఓవర్సీస్‌లో రూ.కోటి వసూళ్లు కాగా... టోటల్ గ్రాస్ కలెక్షన్స్ రూ.22.85 కోట్లకు చేరుకున్నాయి. తెలుగు వెర్షన్... సూపర్ ఆక్యుపెన్సీ  తెలుగు వెర్షన్ మొత్తం మీద 46.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తమిళ వెర్షన్ మొత్తం మీద 40.21 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇండియావ్యాప్తంగా నెట్ వసూళ్లలో ఆదివారం ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ.4.50 కోట్లు, కర్ణాటక రూ.1.10 కోట్లు. తమిళనాడు రూ.41 లక్షలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.12 లక్షల వసూళ్లు సాధించాయి.   సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ఇప్పటివరకూ దాదాపు నాలుగు రెట్ల వసూళ్లు సాధించింది. సమంత కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేయడం సహా హిట్ మూవీగా నిలిచింది. కలెక్షన్స్ వివరాలు ఇలా... 10 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ - రూ.78.71 కోట్లు ఇండియావ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ - రూ.55.86 కోట్లు ఇండియావ్యాప్తంగా నెట్ కలెక్షన్స్ - రూ.48.25 కోట్లు ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ - రూ.22.85 కోట్లు ఆదివారం ఇండియా గ్రాస్ కలెక్షన్స్ - రూ.6.14 కోట్లు ఆదివారం ఇండియా నెట్ కలెక్షన్స్ - రూ.5.30 కోట్లు దాదాపు మూడేళ్ల తర్వాత సమంత లీడ్ రోల్‌లో మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటనకు, యాక్షన్ సీక్వెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీకి సమంత ఫ్రెండ్, ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... సమంత భర్త రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, మంజుషా, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.

    Ambati Arjun: బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు

    Ambati Arjun: బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు దక్కించుకున్న మరో నటుడు అంబటి అర్జున్. దేవత సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న అర్జున్... బ్లాక్ బస్టర్ పెద్ది సినిమాలో నటించాడు. Ambati Arjun: తెలుగు బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7'తో మరింత పాపులర్ అయిన యాక్టర్ అంబటి అర్జున్ అలియాస్ నాగార్జున రెడ్డి అంబటి. అతడి వ్యక్తిగత జీవితం, సీరియల్ కెరీర్, రెమ్యూనరేషన్, ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం.  రియల్ లైఫ్   అర్జున్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్. చదువు పూర్తయిన తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అర్జున్‌కు సురేఖ అనే మహిళతో వివాహం జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆయన భార్య సీమంతం వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం వీరికి ఒక కుమార్తె ఉంది. సీరియల్ కెరీర్   అర్జున్ తెలుగు టెలివిజన్ రంగంలో లీడ్ యాక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ చేశాడు. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు ఛానెల్స్‌లో ప్రసారమైన అగ్నిసాక్షి, దేవత, ఎవరికి వారే యమునా తీరే వంటి సీరియల్స్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా 'దేవత' సీరియల్‌లో ఆయన పోషించిన పాత్ర బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్, హీరోగా కూడా చిన్న చిత్రాల్లో నటించాడు.   బిగ్ బాస్, సోషల్ మీడియా బిగ్ బాస్ సీజన్ 7లో అర్జున్ 5వ వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఎలాంటి వివాదాలకు పోకుండా హుందాగా, సమయస్ఫూర్తితో ఆడటం ఆయన ప్లస్ పాయింట్ అయింది. టాస్క్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తూ సీజన్ 7లో మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. చివరకు టాప్-6 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత అర్జున్ సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్) ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తన భార్య, కూతురితో కలిసి చేసే రీల్స్, ఫ్యామిలీ ఫొటోలు, షూటింగ్ అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటాడు.  రెమ్యూనరేషన్   ఇండస్ట్రీ టాక్ ప్రకారం, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందుకు అర్జున్‌కు వారానికి సుమారు రూ. 4.5 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఆయన హౌస్‌లో మొత్తం 10 వారాలు ఉన్నాడు. ఆ లెక్కన బిగ్ బాస్ ద్వారా దాదాపు రూ. 45 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడని అంచనా. ఇది ఆ సీజన్ విన్నర్ ప్రైజ్ మనీతో సమానమైన మొత్తం కావడం విశేషం. ప్రస్తుతం ఆయన సీరియల్స్ లేదా ప్రాజెక్ట్‌లకు రోజువారీ కాల్‌షీట్ లేదా నెలవారీ ప్యాకేజీల ప్రాతిపదికన మంచి పారితోషికమే అందుకుంటున్నాడు. సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఆసక్తికర విషయాలు అర్జున్ బాడీ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలో మోటివేషనల్ వీడియోలు పెడుతుంటాడు. బిగ్ బాస్ క్రేజ్ తర్వాత అర్జున్‌కు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.  హౌస్‌లో ఉన్నప్పుడు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, టాస్కులను మైండ్ గేమ్‌తో గెలవడం ద్వారా "మిస్టర్ పర్ఫెక్ట్" అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆహా ప్రసారమవుతున్న 'పోచమ్మ' వెబ్ సిరీస్‌లో చేస్తున్నారు. అలాగే పెద్ది సినిమాలో కీలక పాత్రలో అర్జున్ నటించాడు.

    Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?

    Rahul Gandhi Telangana:ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షిరాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక కోవర్టుల హస్తం ఉందని హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. అందుకే రాహుల్ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. Congress Covert MLA Hyderabad Court Case:  మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ అనూహ్యంగా తిరస్కరణకు  గురికావడం.. ఇప్పుడు జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ కోర్టులో ఉన్న ఒక పాత కేసుకు సంబంధించిన సమాచారాన్ని నామినేషన్ అఫిడవిట్‌లో దాచారనే నెపంతో ఆమె ఫామ్‌ను తిరస్కరించడం, దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యానికి నిరాకరించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద షాక్. అయితే, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ పొలిటికల్ డ్రామా వెనుక.. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కొందరు  కోవర్టుల హస్తం ఉందనే సమాచారం వెలుగులోకి రావడం ఇప్పుడు రాహుల్ గాంధీ ఆగ్రహానికి కారణమైంది.  మధ్యప్రదేశ్‌లో నామినేషన్ రిజెక్షన్.. కదిలిన తెలంగాణ లింక్!  రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్‌ను మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అయితే, ఆమె నామినేషన్‌పై బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణలోని హైదరాబాద్ కోర్టులో ఉన్న ఒక ప్రైవేట్ కంప్లైంట్  వివరాలను అఫిడవిట్‌లో దాచారని రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ 9న ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే, అసలు మధ్యప్రదేశ్‌లో ఉన్న బీజేపీ నేతలకు.. తెలంగాణ కోర్టులో మీనాక్షి నటరాజన్‌పై  ఆమె ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కాలానికి సంబంధించి  ఉన్న కేసు వివరాలు, నోటీసుల కాపీలు ఎలా దొరికాయనే దానిపై దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అంతర్గత కుట్ర.. లీక్ చేసింది సొంత పార్టీ నేతలేనా?  ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ సైతం  కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాల వల్లే తెలంగాణ నుండి సమాచారం లీక్ అయింది అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ అనుమానాలకు బలమిచ్చింది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా వచ్చిన తర్వాత పార్టీలోని కొందరు సీనియర్ల ఏకపక్ష నిర్ణయాలకు, గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలో ఆమెపై కక్ష పెంచుకున్న తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఒక గ్రూపు.. ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా దెబ్బతీయడానికి, హైదరాబాద్ కోర్టు డాక్యుమెంట్లను నేరుగా మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు చేరవేసి  కోవర్టు  రాజకీయం నడిపినట్లు ఏఐసీసీ వర్గాలు గుర్తించాయి.  రంగంలోకి హైకమాండ్ విచారణ కమిటీ.. ఒక ఫస్ట్-టైమ్ ఎమ్మెల్యేదే తప్పు!  ఈ ద్రోహంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఏఐసీసీ తక్షణమే ఒక అంతర్గత విచారణ కమిటీని నియమించింది. సోషల్ మీడియా,  అంతర్గత నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ కమిటీ ప్రాథమిక విచారణను పూర్తి చేసింది. తెలంగాణకు చెందిన ఒక కీలకమైన  ఫస్ట్-టైమ్ ఎమ్మెల్యే  ఈ డాక్యుమెంట్ల లీకేజీలో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీకి సమాచారం అందించి, ఏకంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్ నామినేషన్‌నే కొంపముంచిన సదరు ఎమ్మెల్యే వ్యవహారంపై హైకమాండ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.  తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు తప్పవా?  మీనాక్షి నటరాజన్ ఇష్యూలో సదరు ఫస్ట్-టైమ్ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన వెనుక ఉండి నడిపించిన ఒక సీనియర్ నేతపై కూడా అధిష్ఠానం నజర్ పెట్టింది. ఈ కుట్ర వల్ల కాంగ్రెస్ ఒక విలువైన రాజ్యసభ స్థానాన్ని చేజేతులా కోల్పోవాల్సి వచ్చింది. దీనికి బాధ్యుడిగా తేలిన ఆ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయడమా లేక షోకాజ్ నోటీసులు ఇచ్చి పక్కన పెట్టడమా అనే దానిపై కసరత్తు జరుగుతోంది. కేవలం ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాకుండా, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో  విమర్శలు ఎదుర్కొంటున్న మరికొందరు నేతలను కూడా పదవుల నుండి తొలగించే అవకాశం ఉందని, త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన  ఖాయమని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది.  సమూల ప్రక్షాళనకు రాహుల్ గాంధీ నిర్ణయం.. చరమగీతం పాడాల్సిందే!  ఇలాంటి కోవర్టు, బ్లాక్‌మెయిల్  రాజకీయాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని రాహుల్ గాంధీ గట్టిగా భావిస్తున్నారు. పార్టీ లైన్ దాటిన వారు ఎంతటి వారైనా సరే.. సహించేది లేదనే బలమైన సంకేతాన్ని ఇవ్వడమే రాహుల్ గాంధీ ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అంతర్గత కుమ్ములాటలు జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మీనాక్షి నటరాజన్ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకు జరిగిన ఈ అన్యాయంపై కఠినంగా వ్యవహరించకపోతే క్యాడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే ఈసారి ప్రక్షాళన  సమూలంగా, కఠినంగా  ఉండబోతోందని భావిస్తున్నారు. 

    Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

    Green Tea Daily Intake : గ్రీన్ టీ ఆరోగ్యానికి ఉపయోగకరమైన పానీయమే అయినా.. దీన్ని తాగేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఏ సమయంలో తాగకూడదో.. ఎప్పుడు మంచిదో చూసేద్దాం.  Green Tea And Health : ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న చాలామంది గ్రీన్ టీ తీసుకుంటారు. కొందరిలో ఇది రోజువారీ అలవాటుగా మారిపోయింది. రుచి చేదుగా ఉన్నా.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కచ్చితంగా డైట్లో చేర్చుకునేవారు కొందరు. మరి ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? లేక కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలా? నిపుణులు చెప్తోన్న సూచనలు ఇవే. గ్రీన్ టీ గ్రీన్ టీ అనేది Camellia sinensis అనే మొక్క ఆకుల నుంచి తయారవుతుంది. సాధారణ టీతో పోలిస్తే దీనిని తక్కువగా ప్రాసెస్ చేస్తారు. అందువల్ల ఇందులో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మరి దీనిని ప్రతిరోజూ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దాం.  ఫ్రీ రాడికల్స్ నష్టం  గ్రీన్ టీలో ఉండే క్యాటెకిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో కణాల నష్టం తగ్గి మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణ గ్రీన్ టీలోని కొన్ని సమ్మేళనాలు మెటబాలిజాన్ని కొంత మేర పెంచి కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడవచ్చు. అయితే కేవలం గ్రీన్ టీతోనే బరువు తగ్గరు.  మెదడు పనితీరుకై గ్రీన్ టీలో కెఫిన్‌తో పాటు ఎల్-థియానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఏకాగ్రత, అప్రమత్తత, మానసిక ప్రశాంతతను పెంచడంలో సహాయపడవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం తాగవచ్చు. రోగనిరోధక శక్తి గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలపరచడంలో కొంతవరకు ఉపయోగపడతాయి. ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.  గ్రీన్ టీ తాగేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  రోజుకు 2–3 కప్పులు సురక్షితంగా భావిస్తారు. అయితే అధికంగా తాగితే కెఫిన్ ప్రభావం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు రావచ్చు. కొంతమందిలో ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఎసిడిటీ, వికారం లేదా కడుపు అసౌకర్యం కలగవచ్చు. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే ఆహారంలో ఉండే ఐరన్ శరీరానికి పూర్తిగా అందకుండా చేసే అవకాశం ఉంది. అందుకే భోజనం తర్వాత కనీసం గంట గ్యాప్ ఇవ్వడం మంచిది. రక్తాన్ని పలుచన చేసే మందులు లేదా కొన్ని ఇతర ఔషధాలు తీసుకునేవారు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం  ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో తాగడం మంచిది. రాత్రి నిద్రకు దగ్గరగా తాగితే కెఫిన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు రోజుకు 2–3 కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. 

    జులై 3వ వారంలో తల్లికి వందనం నిధుల విడుదల…

    Thalliki Vandanam Latest News: ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం అమలుపై తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ పథకానికి సంబంధించి మంత్రి లోకేశ్ ఈరోజు విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేలా చూడాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. మరోవైపు, లబ్ధిదారులకు సంబంధించిన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని సమీక్షలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు మంత్రికి వివరించారు. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే, జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి స్పష్టం చేశారు.

    దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం | AP Indradhanusu Free Bus Scheme 2026

    ఏపీ దివ్యాంగులకు గుడ్‌న్యూస్: ‘ఇంద్రధనుస్సు’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల (Persons with Disabilities) సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో “ఇంద్రధనుస్సు” (Indradhanusu Scheme) అనే నూతన పథకానికి అధికారికంగా ఆమోదం లభించింది. ఈ పథకం కింద అర్హులైన దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఎటువంటి టికెట్ ఖర్చు లేకుండా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. త్వరలోనే రవాణా శాఖ (Transport Department) నుండి దీనికి సంబంధించిన అధికారిక జీవో (G.O.) విడుదల కానుంది. ఇంద్రధనుస్సు పథకం – ముఖ్యాంశాలు (Key Highlights) ఈ పథకానికి సంబంధించిన అర్హతలు మరియు ప్రయాణ నిబంధనలు క్రింది పట్టికలో స్పష్టంగా వివరించబడ్డాయి: అంశం (Category) వివరాలు (Details) పథకం పేరు ఇంద్రధనుస్సు (Indradhanusu Scheme) లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులు కనీస అర్హత 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి అవసరమైన పత్రాలు సదరం సర్టిఫికెట్ (SADAREM) & ఒరిజినల్ ఐడీ కార్డు పూర్తి ఉచితం (100% Free) పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల బస్సులు పాక్షిక రాయితీ (50% Off) నాన్-స్టాప్, అల్ట్రా డీలక్స్ వంటి ప్రీమియం సర్వీసులు ఏయే బస్సుల్లో ఉచితం? (Free Travel Categories) దివ్యాంగులు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వెళ్లేందుకు వీలుగా, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే 5 రకాల బస్సు సర్వీసుల్లో ప్రభుత్వం 100% ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది: పల్లెవెలుగు (Pallevelugu) అల్ట్రా పల్లెవెలుగు (Ultra Pallevelugu) మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express) సాధారణ ఎక్స్‌ప్రెస్ (Express) సిటీ ఆర్డినరీ (City Ordinary) ప్రీమియం బస్సుల్లో రాయితీ వివరాలు (Concession in Premium Buses) దూర ప్రాంతాలకు ప్రయాణించే లగ్జరీ మరియు ప్రీమియం బస్సుల్లో పూర్తి ఉచితం కాకుండా, 50% టికెట్ రాయితీ (Half Ticket Discount) అమలులో ఉంటుంది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (Saptagiri Express) – 50% రాయితీ అల్ట్రా డీలక్స్ (Ultra Deluxe) – 50% రాయితీ నాన్-స్టాప్ సర్వీసులు (Non-Stop Services) – 50% రాయితీ అంతర్రాష్ట్ర బస్సులు (Inter-State Buses) – 50% రాయితీ ముఖ్య గమనిక ఉచిత ప్రయాణం లేదా రాయితీ పొందాలంటే దివ్యాంగులు విధిగా ప్రభుత్వం జారీ చేసిన సదరం సర్టిఫికెట్ (SADAREM Certificate) మరియు ఆధార్ వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును ప్రయాణ సమయంలో తమ వెంట ఉంచుకోవాలి. జిరాక్స్ కాపీలు లేదా డిజిటల్ కాపీలను కండక్టర్లు అనుమతించకపోవచ్చు. ముగింపు ఈ “ఇంద్రధనుస్సు” పథకం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు మరియు వైద్య సహాయం కోసం ఆసుపత్రులకు వెళ్లే వేలాది మంది దివ్యాంగులకు ఆర్థిక భారం కలగకుండా రవాణా సదుపాయం లభిస్తుంది. అధికారిక మార్గదర్శకాలు (Guidelines) విడుదలైన వెంటనే దరఖాస్తు లేదా ఐడీ కార్డ్ రెన్యువల్ ప్రక్రియపై మరింత స్పష్టత వస్తుంది. ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? అయితే మీ సమీప ఆర్టీసీ డిపో లేదా గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.

    ఏపీ గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్ 2026

    ఏపీ గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్: ఇకపై లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు – తాజా మార్గదర్శకాలు ఇవే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఆస్తి యజమానులకు రెవెన్యూ శాఖ (Revenue Department) చారిత్రాత్మక ఊరటనిచ్చింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ‘గ్రామకంఠం’ (Grama Kantham) భూముల రిజిస్ట్రేషన్ల చిక్కుముడులను తొలగిస్తూ ప్రభుత్వం సరికొత్త అధికారిక మార్గదర్శకాలను జారీ చేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం, ఇకపై గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్‌కు పాత లింకు డాక్యుమెంట్లు (Link Documents) తప్పనిసరి కాదు. కేవలం స్థానిక సంస్థలు (పంచాయతీ/మున్సిపాలిటీ) జారీ చేసిన పన్ను రశీదుల ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి భారీ ఉపశమనం లభించనుంది. గ్రామకంఠం రిజిస్ట్రేషన్ నూతన మార్గదర్శకాలు ఆస్తి రకం (Property Type) అవసరమైన పత్రం (Required Document) ముఖ్యమైన నిబంధన (Key Rule) నివాస గృహం ఉన్న స్థలం ఇంటిపన్ను రశీదు (House Tax Receipt) పాత లింకు డాక్యుమెంట్లు అడగకూడదు పట్టణ వంశపారంపర్య ఖాళీ స్థలం ఖాళీ స్థల పన్ను రశీదు (VLT Receipt) 2023 మార్చి 21 నాటి సర్క్యులర్ పరిశీలన గ్రామీణ వంశపారంపర్య ఖాళీ స్థలం స్వయం ధ్రువీకరణ (Self-Declaration) వీఆర్వో/తహశీల్దార్ సర్టిఫికెట్ అవసరం లేదు లింకు డాక్యుమెంట్లు ఉన్న ఆస్తులు పాత లింకు పత్రాలు (Link Deeds) వెబ్‌ల్యాండ్ రికార్డు చెక్ చేసి తక్షణ రిజిస్ట్రేషన్ 22ఏ నిషేధిత జాబితా (22A Prohibited List) అడ్డంకుల తొలగింపు సాధారణంగా గ్రామంలోని నివాస ప్రాంతాలను గ్రామకంఠం అంటారు. ప్రభుత్వ, సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూములను మినహాయించి, మిగిలిన గ్రామకంఠం భూములను ప్రభుత్వం 2015లోనే నిషేధిత జాబితా నుంచి తొలగించింది. కానీ, వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో (Webland Records) సర్వే నంబర్ల సబ్-డివిజన్ జరగకపోవడం వల్ల అవి 22A జాబితాలోనే చూపిస్తూ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తాజా రూల్స్ ప్రకారం, వెబ్‌ల్యాండ్ రికార్డులో సర్వే నంబర్ ‘గ్రామకంఠం’ అని నమోదై ఉంటే చాలు, అది 22A నిషేధిత జాబితాలో ఉన్నా సరే కచ్చితంగా సబ్-రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. పన్ను రశీదులతోనే రిజిస్ట్రేషన్ (Registration with Tax Receipts) గృహాలు (House Properties): ఇల్లు ఉన్న స్థలాలకు పాత పత్రాలు లేకపోయినా, స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటిపన్ను రశీదును రిజిస్ట్రేషన్‌కు ప్రామాణికంగా తీసుకుంటారు. పట్టణ ఖాళీ స్థలాలు (Urban Vacant Lands): మున్సిపల్ పరిధిలో ఉండే ఖాళీ స్థలాలకు లింక్ పత్రాలు లేనప్పుడు, ఖాళీ స్థల పన్ను రశీదు (Vacant Land Tax – VLT) తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాలకు ‘స్వయం ధ్రువీకరణ’ (Self Declaration Rule) గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వంశపారంపర్య ఖాళీ స్థలాలకు (Rural Ancestral Vacant Lands) పన్ను రశీదులు లేదా లింకు పత్రాలు ఉండవు. ఇలాంటి ఆస్తుల కోసం రిజిస్ట్రేషన్ పత్రంలోనే ‘స్వయం ధ్రువీకరణ’ (Self Declaration Form) చేర్చితే సరిపోతుంది. ఇందులో ఆస్తి వారసత్వ వివరాలు, తమకున్న హక్కును వెల్లడించాలి.ముఖ్య గమనిక (Important Note):ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం తహశీల్దార్ (MRO) లేదా వీఆర్వోల (VRO) చుట్టూ తిరిగి రెవెన్యూ సర్టిఫికెట్లు తీసుకురావాలని రిజిస్ట్రేషన్ అధికారులు ప్రజలపై ఎటువంటి ఒత్తిడి చేయకూడదు. మధ్యవర్తుల మాటలు నమ్మి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దు. నేరుగా మీ పరిధిలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించండి.ముగింపు (Conclusion)గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం తీసుకున్న ఈ నూతన సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేయనున్నాయి. ఫిబ్రవరి 2026 నాటి ఈ తాజా మార్గదర్శకాలను రిజిస్ట్రేషన్ శాఖ తక్షణమే అమలు చేయనుంది. అధికారిక జీవో (GO) మరియు పూర్తి వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.  

    అలర్ట్ ఆన్‌లైన్‌లో ఆధార్‌తో స్టేటస్ చెక్ చేసుకోండిలా | AP Thalliki Vandanam Status Online Verification

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ఉద్దేశించిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా ఈ నగదు పంపిణీ జరగనుంది. ఈ కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో (Online Verification) సులభంగా చెక్ చేసుకునే సదుపాయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ​ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు (Government Schools) మరియు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా విద్యార్థుల డేటా సేకరణ, ధృవీకరణ (Verification Process) అత్యంత వేగంగా కొనసాగుతోంది. అధికారిక మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా, అర్హత ప్రమాణాలు నెరవేర్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి వందనం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానం ​లబ్ధిదారులైన తల్లులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అప్లికేషన్ అర్హత జాబితాను (Beneficiary List Verification) కింది దశలను అనుసరించి సులభంగా పరిశీలించుకోవచ్చు: ​ముందుగా ప్రభుత్వం కేటాయించిన తల్లికి వందనం పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్ (Official Web Portal) ను ఓపెన్ చేయాలి. ​హోమ్‌పేజీలో కనిపించే ‘స్కీమ్ ఎలిజిబిలిటీ’ (Scheme Eligibility) లేదా ‘అప్లికేషన్ స్టేటస్’ (Application Status Search) విభాగాన్ని ఎంచుకోవాలి. ​తదుపరి పేజీలో, లబ్ధిదారురాలైన తల్లి యొక్క ఆధార్ నంబర్‌ను (Aadhaar Number Input) ఖచ్చితంగా నమోదు చేయాలి. ​డ్రాప్‌డౌన్ మెనూ నుండి ప్రస్తుత పథకం పేరు మరియు విద్యా సంవత్సరాన్ని (Academic Year) ఎంపిక చేసుకోవాలి. ​అన్నీ సరిచూసుకున్న తర్వాత, కింద ఉన్న ‘Get Details’ బటన్‌పై క్లిక్ చేయాలి. ​వెంటనే మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది, దానిని నిర్దేశిత గడిలో నమోదు చేయాలి. ​OTP ధృవీకరణ పూర్తయిన వెంటనే, స్క్రీన్‌పై మీ అర్హత (Eligibility Status) మరియు దరఖాస్తు ప్రస్తుత స్థితి స్పష్టంగా కనిపిస్తాయి. ​స్టేటస్‌లో తప్పులు ఉంటే ఏం చేయాలి? ​ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్థితిని తనిఖీ చేసినప్పుడు అందులో ఏవైనా సమాచార లోపాలు లేదా పొరపాట్లు (Data Inaccuracies) కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు (Grievance Redressal Mechanism) లబ్ధిదారులు వెంటనే తమ సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ (Welfare Assistant) ను నేరుగా సంప్రదించవచ్చు. ప్రత్యామ్నాయంగా, పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని (School Headmaster) కలిసి కూడా రికార్డులను సవరించుకునే అవకాశం ఉంది. ​ముఖ్య గమనిక (Important Note): పథకానికి అత్యంత కీలకమైన ఈ-కేవైసీ (e-KYC Process) పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు అందే నిధులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ (DBT) చేయబడతాయి కాబట్టి, ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ మరియు NPCI మ్యాపింగ్ (NPCI Mapping Status) తప్పనిసరిగా సక్రియంగా (Active) ఉందో లేదో ముందస్తుగా సరిచూసుకోవాలి. ఇవి పూర్తయితేనే నిధుల విడుదలలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా నేరుగా అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ​ముగింపు (Conclusion) పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ శాతాన్ని (School Dropouts) తగ్గించడం, మరియు హాజరు శాతాన్ని (School Attendance Percentage) పెంచడమే ప్రామాణికంగా ఈ పథకం కొనసాగుతోంది. కాబట్టి, విద్యార్థుల తల్లులు తక్షణమే అధికారిక పోర్టల్ ద్వారా తమ స్టేటస్ చెక్ చేసుకోవడంతో పాటు, బ్యాంక్ NPCI మ్యాపింగ్ పూర్తయిందని నిర్ధారించుకోవాలి. ఎలాంటి సాంకేతిక సమస్యలకైనా వెంటనే మీ స్థానిక స్వర్ణ గ్రామం సిబ్బందిని లేదా పాఠశాల హెచ్‌ఎంను సంప్రదించండి.

    తల్లికి వందనం కొత్త వెరిఫికేషన్ గైడ్‌లైన్స్ విడుదల | Thalliki Vandanam Field Verification Module

    తల్లికి వందనం ఫీల్డ్ వెరిఫికేషన్ 2026: BM పోర్టల్ మ్యాపింగ్ సమస్యలు & అధికారిక పరిష్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam Scheme) పథకానికి సంబంధించి బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్ (BM Portal) ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ (Field Verification) నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు సిబ్బందికి (వెల్ఫేర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు) ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన స్పష్టమైన మార్గదర్శకాల (FAQs) పట్టిక కింద అందించబడింది. BM పోర్టల్ మ్యాపింగ్ సమస్యలు – అధికారిక పరిష్కారాలు (Official FAQ Solutions)   క్రమ సంఖ్య ఎదురవుతున్న సమస్య అధికారిక పరిష్కారం 1 స్కూల్ డేటాబేస్‌లో మదర్, ఫాదర్ ఆధార్ వివరాలు ఎంటర్ చేయకపోవడం వల్ల ‘NA’ అని చూపిస్తోంది. కానీ స్టూడెంట్, మదర్ ఒకే హౌస్‌హోల్డ్‌లో ఉంటే ఏ ఆప్షన్ ఎంచుకోవాలి? “Mother Aadhaar Wrong” ఆప్షన్ సెలెక్ట్ చేసి, సరైన మదర్ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. 2 గార్డియన్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ కావాలి. అన్ని రకాల వెరిఫికేషన్ సినారియోలలోనూ “Guardian Option” అందుబాటులో ఉంచబడింది. 3 స్కూల్ డేటాలో స్టూడెంట్, మదర్ కి ఒకే ఆధార్ (UID) ఉండి, ఫాదర్ UID ప్లేస్‌లో మదర్ UID ఎంటర్ చేసి ఉంటే అప్‌డేట్ కావడం లేదు. “The mentioned Aadhaar Belongs to” ఆప్షన్ ఎంచుకుని, అందులో “Student” సెలెక్ట్ చేయాలి. అప్పుడు సిస్టమ్ మదర్ ఆధార్ అడుగుతుంది, అక్కడ సరైన మదర్ ఆధార్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. 4 ఆధార్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు Recheck చేసుకోవడానికి వీలుగా పూర్తిగా కనిపించకుండా ఎందుకు ఉంటుంది? ఐటీ చట్టం (IT Act) నిబంధనల ప్రకారం సిస్టమ్ ఎంటర్ చేసిన ఆధార్‌ను HH డేటాతో వాలిడేట్ చేస్తుంది. మ్యాచ్ కాకపోతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. 5 స్టూడెంట్ కి సంబంధించిన SGSW (స్వర్ణ గ్రామం/వార్డు) కోడ్ తప్పుగా ఉంటే? “student not belong to this SGSW code” ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్‌మిట్ చేయాలి. అటువంటి కేసులు ఆటోమేటిక్‌గా చైల్డ్ HH ట్యాగ్ చేయబడిన సరైన SGSW కోడ్‌కు పంపబడతాయి. 6 చాలా మంది పిల్లల మదర్ ప్లేస్‌లో ఎవరో తెలియని వ్యక్తుల ఆధార్ నంబర్లు చూపిస్తున్నాయి, లేదా స్టూడెంట్ మరియు మదర్ ఆధార్ ఒకే నంబర్‌గా నమోదై ఉంటే ఏం చేయాలి? “The mentioned Aadhaar Belongs to” ఆప్షన్ ఎంచుకుని, అందులో “Student” సెలెక్ట్ చేయాలి. సిస్టమ్ మదర్ ఆధార్ అడిగినప్పుడు సరైన నంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. 7 విద్యార్థి హౌస్‌హోల్డ్ (HH) లో లేడు, కానీ తల్లి HH లో ఉంది. అలాగే మదర్ ప్లేస్‌లో ఫాదర్ ఆధార్, ఫాదర్ ప్లేస్‌లో మదర్ ఆధార్ నంబర్లు ఉంటే ఏం చేయాలి? ప్రస్తుతానికి విద్యార్థి (Student) ఆధార్ వివరాలను క్యాప్చర్ చేసి సబ్‌మిట్ చేయాలి. తదుపరి eKYC మాడ్యూల్‌లో సంబంధిత HH డేటా నుండి మదర్ ఆధార్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వబడుతుంది. 8 స్కూల్ ఎడ్యుకేషన్ డేటా వెరిఫికేషన్‌లో క్లస్టర్ 11 (Cluster 11) నందు ‘No Data Found’ అని చూపిస్తోంది. ఎటువంటి చర్య అవసరం లేదు (No action required). 9 NBM లాగిన్‌లో విద్యార్థుల ఫోన్ నంబర్లు కూడా కనిపించేలా ఇవ్వగలరా? ఐటీ చట్టం (IT Act) నిబంధనల ప్రకారం పోర్టల్‌లలో పౌరుల ఫోన్ నంబర్లు ప్రదర్శించబడవు. ఇటువంటి కేసుల కోసం eKYC మాడ్యూల్‌లో ఆప్షన్ ఇవ్వబడుతుంది. 10 విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ గల్ఫ్ (Gulf Parents) దేశాలలో ఉంటూ, విద్యార్థి ఇక్కడ గార్డియన్ వద్ద నివసిస్తుంటే ఏ ఆప్షన్ ఎంచుకోవాలి? ఇటువంటి కేసుల కోసం eKYC మాడ్యూల్‌లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంచబడుతుంది. 11 మా పరిధిలో స్టూడెంట్ ఎవరో తెలియదు, రాంగ్ మదర్‌కు మ్యాప్ చేసి ఉన్నారు, స్కూల్ డేటా కూడా తప్పే. మదర్ కూడా ఆ స్టూడెంట్ ఎవరో తెలియదంటున్నారు. “student not belong to this SGSW code” ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్‌మిట్ చేయాలి. అటువంటి కేసులు ఆటోమేటిక్‌గా చైల్డ్ HH ట్యాగ్ చేయబడిన సరైన SGSW కోడ్‌కు పంపబడతాయి. 12 ఫ్యామిలీ మ్యాపింగ్ అంతా కరెక్ట్‌గానే ఉంది కానీ స్కూల్ డేటాలో అసలు తల్లిదండ్రుల ఆధార్ కాకుండా వేరొకరి ఆధార్ నంబర్లు ఎంటర్ అయి ఉంటే ఎలా క్లోజ్ చేయాలి? “Mother Aadhaar Wrong” ఆప్షన్ సెలెక్ట్ చేసి, లబ్ధిదారురాలి అసలైన సరైన మదర్ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. 13 తల్లి మరణించి (Mother Died), తండ్రి కుటుంబంతో కలిసి ఉండకుండా, విద్యార్థి గార్డియన్ వద్ద ఉంటుంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి? “Parents died, Student living with Guardian” అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 14 మదర్/స్టూడెంట్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు కేవలం వెల్ఫేర్ లాగిన్ (BM Portal) లో మార్చితే సరిపోతుందా? లేక స్కూల్ చైల్డ్ ఇన్ఫో లాగిన్‌లో కూడా మార్చాలా? కేవలం బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్ (Beneficiary Management Portal) లో అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. 15 స్టూడెంట్ మరియు మదర్ వేర్వేరు హౌస్‌హోల్డ్‌లలో ఉంటే, కేవలం NBM వెల్ఫేర్ లాగిన్‌లో మైగ్రేషన్ (Migration) ఆప్షన్ ద్వారా చేస్తే సరిపోతుందా? కేవలం బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్ (Beneficiary Management Portal) లో అప్‌డేట్ చేయడం సరిపోతుంది.