Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

    1 month ago

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బ్రహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల బ్రహ్ములకు పదివేల ఆర్థిక సాయం, డ్వాక్రా సంఘాలకు ఆన్‌లైన్‌లోనే రుణాలు పొందే సౌకర్యం తీసుకొస్తోంది.

    Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు వారి ఖాతాల్లో వేస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. పేద బ్రహ్మణుల కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా నిలవాలని భావిస్తోంది. పేద బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం చేసే గరుడ పథకం పేరుతో దీన్ని త్వరలోనే ప్రారంభించాలని చూస్తోంది. దీని సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైందని మంత్రి సవిత ప్రకటించారు. సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌ బుచ్చిరాంప్రసాద్‌తో సమావేశమై గరుడ పథకం విధి విధానాలను చర్చించారు. అర్హుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

    మరోవైపు ఇదే రోజు డ్వాక్రా సంఘాలకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదని ఆన్‌లైన్‌లోనే తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. గుంటూరు శివారులో ఏర్పాటు చేసిన సరస్‌ మేళాలో పాల్గొన్న చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. వారు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌ జరుగుతున్న తీరు, అమ్ముకుంటున్న విధానం గురించి ఆరా తీశారు. ఈ సరస్‌మేళా పది రోజుల పాటు సాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు150కిపైగా స్టాల్స్ పెట్టారు. స్టాళ్లతోపాటు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.  

    ఈ స్టాల్స్‌ను సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళా సంఘాలను అభినందించారు. తన మాటకు గౌరవించి డ్వాక్రా సంఘాల్లో చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాల్లో చేరిన మహిళలు చాలా మంది ఆర్థికంగా పురోగతి సాధించారని కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అందుకే వారిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తోందని వివరించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని, కార్పొరేట్ సంస్థలతో వారికి శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ నైపుణ్యాలు నేర్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.13 కోట్ల మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారని చంద్రబాబు వివరించారు. వీరి కోసం పాతికవేల కోట్లకుపైగా నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఐదు వేల కోట్లతో కార్పస్ ఫండ్ సిద్ధం చేశామని తెలిపారు. వారు వేసి ప్రతి అడుగులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వినూత్నంగా ఆలోచించి వ్యాపారాన్ని అభివద్ధి చేసుకొని రాష్ట్రానికే పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు చంద్రబాబు. 

     

    Click here to Read More
    Previous Article
    CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
    Next Article
    Best Indian City for Women: మహిళ భద్రతలో టాప్‌ ఇండియన్‌ సిటీ ఇదే!అవతార్ నివేదికలో హైదరాబాద్ స్థానం ఏంటీ?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment