Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు

    1 month ago

    CM Chandra Babu :టీడీపీ మంత్రుల పనితీరుప మరింత మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవుపలికారు. అర్జీల పరిష్కారంలో ఇంకా చాలా మంది వెనుకబడి ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.

    CM Chandra Babu : క్యాబినెట్ సమావేశం తర్వాత టీడీపీ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇంకా శ్రద్ధ పెట్టాలని సూచించారు. నెలకు రెండు, మూడు సార్లు తానే స్వయంగా పార్టీ కార్యాలయానికి రావాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు. వినతులు మాత్రం తగ్గటం లేదని చెప్పారు. పార్టీ కోసం ఐదు సంవత్సరాల కష్టపడ్డ వాళ్ల పేర్లు ఇవ్వాలని చాలా అడిగినా ఇంత వరకు ఎవరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా తానే పూర్తి చేశానని అన్నారు.  దీని బట్టి పార్లమెంటులో అధ్యక్షులు, ఆ జిల్లా మంత్రులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తలంటారు. 

    మంత్రి లోకేష్ కూడా మంత్రులకు కొన్ని సూచనలు చేశారు. సీఎంప క్యాంపు కార్యాలయంలో టీడీపీ మంత్రులతో ప్రత్యేంగా బేటీ అయ్యారు. వైసీపీ, జగన్ మాదిరిగా బెదిరింపులు, దౌర్జాలు చేయడం టీడీపీకి అలవాటు లేదని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందివ్వాలని సూచించారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామని అయినా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. వాటిని సమర్థంగా తిప్పి కొట్టాలని సూచించారు. జిల్లా నేతలంతా ఒకే మాటపై ఉంటూ వైసీపీ నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని చెప్పుకొచ్చారు. ప్రజావేదిక వద్దకు ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు సకాలంలో పరిష్కకారం అయ్యేలా చూడాలని హితవుపలికారు.  

    అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో మంత్రుల పని తీరును ప్రశంసించారు. గతేడాది అంతా ఐకమత్యంగా పని చేసి పెట్టుబడులు వచ్చేలా చేశారని ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం చేయాలని సూచించారు. మంత్రులతో, అధికారులు కూడా కష్టపడి పని చేశారన్నారు. వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దారుణంగా దెబ్బతిందని, రెండేళ్లలో బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకే సరిపోయిందన్నారు. అందుకే వివిధ ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని అన్నారు.       

    అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలకు సంక్షేమ పాలన అందివ్వడంలో కూడా టీమ్‌ వర్క్ బాగుందని కితాబు ఇచ్చారు. క్రమం తప్పకుండా పథకాలు అందివ్వడమే కాకుండా, విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించినట్టు పేర్కొన్నారు.  

    Click here to Read More
    Previous Article
    The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
    Next Article
    Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment