Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Andhra Pradesh politics : నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

    1 month ago

    Andhra Pradesh politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేధింపులు హద్దులు దాటిపోయాయని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ లీగల్ సెల్ నేతలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

    వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేకే పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇంతకంటే నియంత పాలనకు మరో నిదర్శనం ఉండదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పూర్తిగా హద్దులు దాటుతూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
    కూటమి ప్రభుత్వానికి వంత (Andhra Pradesh politics) పాడుతున్న పోలీసు వ్యవస్థ చర్యలను చట్టపరంగా ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. చట్టాన్ని అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్న అధికారులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయాలని సూచించారు. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న పార్టీ లీగల్ సెల్‌ను ఆయన అభినందించారు.

    చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు పొట్టేళ్ల తలలతో హారం వేసిన ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని సజ్జల ప్రశ్నించారు. ఇటీవల ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన కమ్యూనిస్టు నాయకుడిపై పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

    వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత పట్టుదలతో పార్టీని నడుపుతూ ప్రతి ప్రజా సమస్యపై ముందుండి పోరాడుతున్నారని సజ్జల తెలిపారు. కూటమి ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొనేందుకు వైసీపీ శ్రేణులు పోరాట పటిమతో ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

    Click here to Read More
    Previous Article
    China Manja : యమపాశంలా మారిన చైనా మాంజాలు, గొంతులు కోసే ప్రమాదం పెరుగుతోంది
    Next Article
    Gaurav Tiwari: ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment