Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Gaurav Tiwari: ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్!

    1 month ago

    హారర్ థ్రిల్లర్ సిరీస్ ల పట్ల ఓటీటీ (OTT) ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. (Gaurav Tiwari) ఇక యథార్థ సంఘటనలు ఆధారంగా అంటే ఆ సిరీస్ పై ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా అమెజాన్ ఎం ఎక్స్ ప్లేయర్ కి వచ్చిన ఒక హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆ సిరీస్ పేరే భయ్ ది గౌరవ్ తివారీ మిస్టరీ. ఇది పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా పేరుపొందిన గౌరవ్ తివారీ జీవితానికి సంబంధించిన కథ. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించగా, కరణ్ టాకర్ ప్రధానమైన పాత్రను పోషించాడు. 

    ఉత్కంఠభరిత 8 ఎపిసోడ్స్ తో కూడిన సిరీస్

    ‘పాట్నా’కు చెందిన గౌరవ్ తివారీ పైలట్ గా పని చేస్తూ ఉంటాడు. ఒకానొక సంఘటన కారణంగా ఆయన దృష్టి దెయ్యాలు భూతాల దిశగా వెళుతుంది. (Gaurav Tiwari) దాంతో వాటికి సంబంధించిన పరిశోధనలు చేస్తూ ముందుకు వెళతాడు. పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాడు. అలాంటి ఆయన ఊహించని విధంగా తన 32వ ఏట మరణిస్తాడు. ఆయన మరణం కూడా ఒక మిస్టరీగా మారిపోతుంది. 8 ఎపిసోడ్స్ తో కూడిన ఈ సిరీస్ కూడా ఆయన మరణంతోనే మొదలవుతుంది. గౌరవ్ తివారీకి దెయ్యాల పట్ల ఎలా ఆసక్తి కలిగింది? ఆయనకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆయన చనిపోవడానికి ముందు ఏం జరిగింది? అనే అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అక్కడక్కడా పలకరించే కొన్ని హారర్ సీన్స్ ను చూడాలంటే కాస్త గుండె ధైర్యం కావలసిందే. త్వరలోనే ఈ సిరీస్ కి తెలుగు ఆడియోను కూడా జోడించే అవకాశం ఉందనే చెప్పాలి.

    Click here to Read More
    Previous Article
    Andhra Pradesh politics : నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
    Next Article
    Nagrjuna: ఫిట్‌గా ఉండటానికి నాగార్జున పాటించే డైట్

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment