Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP FBO : నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మొత్తం ఎన్ని ఉద్యోగాలంటే?

    1 month ago

    AP FBO Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈక్రమంలో అటవీశాఖలో ఖాళీల భర్తీకి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

    AP Forest Beat Officer Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌లో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటవీ శాఖకు సంబంధించి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (Forest Beat Officer), అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనున్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన కొత్త సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://portal-psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) కార్యదర్శి రాజబాబు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఏపీ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పరీక్షలు జూన్‌ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ముగిసిన విషయం తెలిసిందే.

    అయితే.. త్వరలో విడుదల కాబోతున్న నోటిఫికేషన్‌ ద్వారా సుమారు 791 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత మాత్రమే తెలుస్తాయి. అలాగే.. తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు కూడా విడుదలైన విషయం తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఇంటర్వ్యూకి ఎంపికైన వారి లిస్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు. అలాగే.. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలను కూడా ప్రకటించారు. త్వరలో ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రిజల్ట్స్‌ విడుదల కానున్నాయి.

    ఏపీపీఎస్సీ కీలక ప్రకటన

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తాజాగా ఏపీపీఎస్సీ (Andhra Pradesh Public Service Commission) కమిషన్‌ కీలక ప్రకటన చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలను 3 కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్‌ 3 కేటగిరీలుగా విభజించింది. ఇక ఈ కేటగిరీల విభజన 2025 ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని జీవో సైతం జారీ చేసింది. ఈ నేపథ్యంలో వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (OTP) ఉన్న షెడ్యూల్డ్‌ కులాలకు (ఎస్సీ, ఎస్టీ) చెందిన అభ్యర్థలు తమ షెడ్యూల్‌ కుల గ్రూప్‌ వివరాలను సరిచేసుకోవాలని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

    త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేయనున్న జాబ్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీపీ (OTP)లో ఆయా కులాలకు చెందిన అభ్యర్థుల గ్రూపు వివరాలు ఓటీపీలో ఎంటర్‌ చేయాలని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులందరూ తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అలాగే.. ఇప్పటికే వన్ టైం ప్రొఫైల్ (OTP) రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎస్సీ అభ్యర్థులు మరోసారి ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపుకు చెందుతుందో చెక్‌ చేసుకోవాలని పేర్కొంది. కొత్త వారయితే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.

    Click here to Read More
    Previous Article
    Vande Bharat Sleeper Train రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. త్వరలో ఈ రూట్లలో ప్రారంభం..
    Next Article
    SSC CGL : భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మొత్తం 14,582 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోకండి!

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment