Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    SSC CGL : భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మొత్తం 14,582 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోకండి!

    1 month ago

    SSC CGL 2025 Notification : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ మరో భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఎస్‌ఎస్‌సీ వరుస జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

    హైలైట్:

    • ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ నోటిఫికేషన్‌ 2025
    • మొత్తం 14,582 ఉద్యోగాల భర్తీకి ప్రకటన
    • జులై 4 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది

    SSC CGL Notification 2025 : ఉద్యోగార్థులకు భారీ గుడ్‌న్యూస్‌. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) ఎగ్జామ్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 14,582 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2025 పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను చెక్‌ చేసుకోవడానికి, అప్లయ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ చూడొచ్చు. అలాగే.. 437 ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

     

    భర్తీ చేయనున్న పోస్టులు :

    అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌, అసిస్టెంట్ - అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌, ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌స్పెక్టర్ - ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ - ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ - ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టులు, ఇన్‌స్పెక్టర్ (Inspector), సెక్షన్ హెడ్, అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (Executive Assistant), రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్- ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, ఆఫీస్ సూపరింటెండెంట్, ఆడిటర్ (Auditor), అకౌంటెంట్ (Accounting), అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సోర్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్‌లు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ (Tax Assistant), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.

     

    ఇతర ముఖ్యమైన సమాచారం :

    ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి ఉండాలి. అలాగే.. వయసు విషయానికొస్తే.. 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.29,200 నుంచి రూ.1,42,400 వరకు వేతనం ఉంటుంది.

    ముఖ్యమైన తేదీలు:

    • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం : జూన్‌ 9, 2025
    • దరఖాస్తులకు చివరితేది: జులై 4, 2025
    • ఫీజు చెల్లింపునకు చివరితేది : జులై 5, 2025
    • దరఖాస్తు సవరణ తేదీలు: జులై 9 నుంచి 11 వరకు
    • కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్షలు (సీబీటీ 1) : ఆగస్టు 13 నుంచి 30 వరకు
    • కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్షలు (సీబీటీ 2) : 2025 డిసెంబర్‌
    Click here to Read More
    Previous Article
    AP FBO : నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మొత్తం ఎన్ని ఉద్యోగాలంటే?
    Next Article
    Hyderabad: ఎన్‌ఎండీసీ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 995 ఉద్యోగాలు.. రూ.35,040 వరకు జీతం

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment