Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్

    1 month ago

    Toxic Director Geetu Mohandas: 'టాక్సిక్' టీజర్ చూశాక 'ఫిమేల్ డైరెక్టర్ తీశారంటే నమ్మబుద్ది కావడం లేదు' అని పేర్కొన్న క్రిటిక్స్, సెలబ్రిటీస్ ఉన్నారు. అసలు ఎవరీ గీతూ మోహన్ దాస్? తెలుసుకోండి.

    Who Is Geetu Mohandas? Know Her Journey Into Acting and Direction: 'టాక్సిక్' టీజర్ చూసిన తర్వాత చాలా మంది నోటి నుంచి వచ్చిన మాట ఒక్కటే... 'ఫిమేల్ డైరెక్టర్ తీశారంటే నమ్మబుద్ధి కావడం లేదు' అని. రామ్ గోపాల్ వర్మ సైతం ''మేల్ డైరెక్టర్ ఎవరినీ ఈమెతో కంపేర్ చేయలేం. ఈ టీజర్ మహిళా తీసిందంటే నమ్మలేకపోతున్నా'' అని ట్వీట్ చేశారు. అసలు ఎవరీ గీతూ మోహన్ దాస్? ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఇంతకు ముందు ఏ సినిమాలకు దర్శకత్వం వహించారు? అనేది తెలుసుకోండి.

    అసలు పేరు గీతూ కాదు... గాయత్రి!
    Geetu Mohandas Original Name: గీతూ అసలు పేరు గాయత్రి. ఆమె తండ్రి పేరు మోహన్ దాస్. వాళ్ళది మలయాళీ కుటుంబం. కేరళలోని కొచ్చిలో జన్మించారు. మలయాళ చిత్రసీమలోకి తొలుత నటిగా అడుగు పెట్టారు. బాలనటిగా సినిమాలు చేశారు. తర్వాత కథానాయికగా మారారు. ఇప్పుడు దర్శకత్వం మీద దృష్టి పెట్టారు. 

    గీతూ ప్రయాణంలో మోహన్ లాల్ రోల్!
    గీతూ మోహన్ దాస్ ప్రయాణం బాలనటిగా మొదలైంది. 'ఒన్ను ముట్టల్ పూజ్యం వరే' బాలనటిగా ఆమె మొదటి సినిమా. ఆ చిత్రానికి మోహన్ లాల్ వాయిస్ ఓవర్ అందించడంతో పాటు చివరిలో అతిథి పాత్రలో తళుక్కుమని మెరిశారు. ఆ సినిమా చేసే సమయానికి ఆమె వయసు నాలుగేళ్లు. కుటుంబ సభ్యులు గాయత్రీని ముద్దుగా 'గీతూ' అని పిలిచేవారు. అదే స్క్రీన్ మీద పడేవారు.

    Also Read: ఎవరీ దీప్శిఖా చంద్రన్? కన్నడ 'మార్క్'తో సెన్సేషన్... నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ

    కథానాయికగానూ గీతూ మోహన్ దాస్ ప్రయాణం కూడా మోహన్ లాల్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో మొదలైంది. ఆ సినిమాలోని ఇద్దరు హీరోయిన్లలో ఆవిడ ఒకరు. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. అయితే 'Akale'లో గీతూ మోహన్ దాస్ నటనకు పేరు రావడమే కాదు... కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది.

    దర్శకురాలిగా 'లయర్స్ డైస్'తో అడుగు...
    మొదటి సినిమాతో భర్తకు నేషనల్ అవార్డు!
    ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ ప్రయాణం హిందీ సినిమా 'లయర్స్‌ డైస్' (Liar's Dice)తో మొదలైంది. దానికి ముందు షార్ట్ ఫిల్మ్ తీశారు. 'లయర్స్‌ డైస్' సినిమాకు గాను ఉత్తమ నటిగా గీతాంజలి థాపా, ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ రవి నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత మరొక సినిమా 'మూథోన్' చేశారు. ఆ చిత్ర నిర్మాతలలో అనురాగ్ కశ్యప్ ఒకరు. హిందీ డైలాగులు కూడా ఆయనే రాశారు.

    Click here to Read More
    Previous Article
    Traffic Challan Waived : ట్రాఫిక్ చలాన్ రద్దుకు అవకాశం! 10 జనవరి 2026న లోక్ అదాలత్! ప్రక్రియ ఏంటీ?
    Next Article
    Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment