Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం

    1 month ago

    Hyderabad Crime News: భాగ్యనగరంలో సంక్రాంతి పండగ వేళ ఆకాశంలో పతంగుల సందడి మొదలవుతుంది. అయితే ఈ సందడి వేళ ప్రాణాంతకమైన చైనా మాంజాపై పోలీసులు యుద్ధం ప్రకటించారు. నగర వ్యాప్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో సుమారు 1.24 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్షులు, జంతువులతోపాటు మనుషుల ప్రాణాలకు కూడా ఈ దారం తీవ్ర ముప్పుగా మారుతున్న వేళ హైదరాబాద్ పోలీసులు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు నగరంలోని పలు గొదాములు, నిల్వ కేంద్రాలై మెరుపు దాడులు చేశారు. భారీ మొత్తంలో ఈ మృత్యు పాశాన్ని పట్టుకున్నారు. 

    పోలీసుల వేట; జోన్ల వారీగా రికార్డు స్థాయిలో కేసులు 

    నగరంలోని చైనా మాంజా విక్రయాలపై పోలీసులు జరిపిన దాడులు సంచలనం సృష్టించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 103కేసులు నమోదు కాగా, 143 మందిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. దాడుల్లో భాగంగా మొత్తం 5, 226 మాంజా బాబిన్లను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

    నగరంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 

    • సౌత్‌ వెస్ట్‌జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు అయ్యాయి. 
    • సౌత్‌ జోన్‌లో 27 కేసులు నమోదు కాగా, ఈస్ట్ జోన్‌లో 18 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 
    • సౌత్‌ ఈస్ట్ జోన్‌లో 9 కేసులు , సెంట్రల్, నార్త్ , వెస్ట్ జోన్‌లలో కలిపి 15 కేసులు నమోదు అయ్యాయి. 

    ఈ భారీ ఆపరేషన్‌లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. కేవలం టాస్క్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో 67 కేసులు నమోదు కాగా, 87 మందిని అరెస్టు చేసి రూ. 6.78 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. 

    సీపీ సజ్జనార్ హెచ్చరిక

    జనవరి 8న నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఘాటున స్పందించారు. సంక్రాంతి అనేది ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగని, అయితే ఈ వేడుక మరొకరి ప్రాణానికి ముప్పుగా పరిణమించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. పర్యావరణానికి, జీవరాశికి హాని కలిగించే ఈ సింథటిక్ ధారంపై ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణ నిషేధం విధించినట్టు ఆయన గుర్తు చేశారు. 

    నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ, కొందరు వ్యాపారులు రహస్యంగా ఈ మాంజాను విక్రయించడంపై ఆయన ఆగ్రం వ్యక్తం చేశారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా లేదా గోదాముల్లో నిల్వ చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెడుతున్నా సరే చైనా మాంజా వినియోగం ఆగకపోవడంతో పోలీసులు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైనా మాంజా దారాన్ని అమ్మినా, కొన్నా సరే కేసులు పెడతామన్నారు. అలాంటి దారాలతో పతంగులు ఎగరేసినా శిక్షార్హులని అన్నారు. వాళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగించే విషయాన్ని చర్చిస్తున్నామని పేర్కొన్నారు 

    ఆన్‌లైన్‌ నిఘా- సైబర్ స్పేస్‌లో తనిఖీలు 

    దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం కావడంతో, కొందరు అక్రమ వ్యాపారులు ఇప్పుడు ఆన్‌లైన్‌ వేదికలను వాడుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌, సోషల్ మీడియా వేదికల ద్వారా సాగే క్రయవిక్రయాలను అడ్డుకోవడానికి 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు కమిషన్ తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా మాంజాను కొనుగోలు చేసినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

    తల్లిదండ్రులకు సూచనలు- పిల్లల భద్రతే ముఖ్యం 

    చైనా మాంజా తయారీలో ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉపయోగిస్తారు. ఈ లోహపు పూత వల్ల పతంగులు ఎగురవేసే సమయంలో విద్యుత్‌ తీగలకు దారం తగిలితే పిల్లకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తల్లిదండ్రులు బాద్యతగా వ్యవహరించి, పిల్లలకు ప్రమాదకరమైన చైనా మాంజాకు బదులుగా మన సంప్రదాయ నూలు దారాలనే అందించాలని ఆయన సూచించారు. 

    పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన 

    ఈ అక్రమ విక్రయాలను అరికట్టడంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే డయల్‌ 100కు లేదా 9490616555నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. 

    Click here to Read More
    Previous Article
    Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
    Next Article
    Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment