Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Hyderabad: ఎన్‌ఎండీసీ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 995 ఉద్యోగాలు.. రూ.35,040 వరకు జీతం

    1 month ago

    Jobs in Hyderabad : నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. త్వరలో ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. వివరాల్లోకెళ్తే..

    హైలైట్:

    • ఎన్‌ఎండీసీ రిక్రూట్‌మెంట్‌ 2025
    • 995 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
    • మే 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం
    • జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది
    • Hyderabad NMDC Recruitment 2025 : కొంత తాత్కాలిక విరామం తర్వాత నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఈక్రమంలో హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 995 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల బైలడిల ఐరన్‌ ఓర్‌ మైన్‌ కిరండూల్‌ కాంప్లెక్స్‌, బచేలీ కాంప్లేక్స్‌ దంతేవాడ, దోనిమలై ఐరైన్‌ ఓర్‌ మైన్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్‌ 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు తెలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.
    • మొత్తం ఖాళీల సంఖ్య: 995

      • బీఐఓఎం కిరండూల్‌ కాంప్లేక్స్‌లో ఖాళీలు: 389
      • బీఐఓఎం బచేలీ కాంప్లేక్స్‌లో ఖాళీలు : 356
      • డీఐఓఎం దోనీమలై కాంప్లేక్స్‌లో ఖాళీలు : 250

      భర్తీ చేయనున్న పోస్టులు:

      ఫీల్డ్‌ అడెండెంట్‌ (ట్రైనీ), మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌) ట్రైనీ, బ్లాస్టర్‌ గ్రూప్‌ 2 (ట్రైనీ), ఎలక్ట్రీషియన్‌ గ్రూప్‌ 2 (ట్రైనీ), ఎలక్ట్రానిక్స్‌ టెక్నీషియన్‌ గ్రూప్‌ 3 (ట్రైనీ), హెచ్‌ఈఎం మెకానిక్‌/ ఆపరేటర్‌ గ్రూప్‌ 3 (ట్రైనీ), ఎంసీఓ గ్రూప్‌ 3 (ట్రైనీ), క్యూసీఏ గ్రూప్‌ 3 (ట్రైనీ), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, ఆటో ఎలక్ట్రీషియన్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
    • ఇతర ముఖ్యమైన సమాచారం :

      • అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి పాసైన వాళ్లు, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
      • జీతం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ఫీల్డ్‌ అడెండెంట్‌కు రూ.31,850.. మెయింటనెన్స్‌ అసిస్టెంట్‌కు రూ.32,940.. ఇతర పోస్టులకు రూ.35,040 వేతనం ఉంటుంది.
      • వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి.
      • ఎంపిక విధానం: ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (CBT), ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. పోస్టులను బట్టి సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీపై ప్రశ్నలు ఉంటాయి. పోస్టులను బట్టి ఇందులో ప్రశ్నల సరళి మారుతూ ఉంటుంది.
      • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
      • దరఖాస్తులు ప్రారంభ తేది: మే 25, 2025
      • దరఖాస్తుకు చివరితేది : జూన్‌ 14, 2025
    Click here to Read More
    Previous Article
    SSC CGL : భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మొత్తం 14,582 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోకండి!
    Next Article
    SSC GD Result 2025 : ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ రిజల్ట్స్‌ విడుదలకు కసరత్తు.. ఏ క్షణమైనా ఫలితాలు విడుదల

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment