Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Karnataka: కర్ణాటక విజయపురలోని కార్ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం, దాదాపు 20 వాహనాలు దగ్ధం!

    6 days ago

    Karnataka: కర్నాటకలోని NH-50కు సమీపంలోని కార్ సర్వీస్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది.  దాదాపు 20 వాహనాలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. 

    Karnataka: కర్నాకటలోని విజయపురలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 50 వ నెంబర్ జాతీయ రహదారికి అనుకొని ఉన్న కార్ సర్వీస్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దాదాపు 20 కార్లు దగ్ధమయ్యాయి. భారీగా ఎగసి పడిన అగ్ని కీలలకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపు చేయడంతో సమీపంలోని భవనాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

    సిటీ గుండా వెళ్లే కీలకమైన రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. సర్వీస్ సెంటర్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రమాదం ధాటికి భయపడిపోయిన వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే వరకు వారంతా దూరంగానే ఉన్నారు.  

    మరో ఘటనలో విజయపుర జిల్లా చడ్చన్ తాలూకాలోని హవినాల్ గ్రామంలోని చక్కెర కర్మాగారంలో నిన్న సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

    Click here to Read More
    Previous Article
    Stomach Upset : కడుపు సమస్యలతో బాధపడుతున్నారా? కారణాలు ఇవే.. ఆ సమయంలో తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్
    Next Article
    Ice Cream History : ఐస్ క్రీం ఎలా పుట్టింది? వేయేళ్ల క్రితం మొదలైన స్వీట్ కథ.. మొదట్లో ఎలా ఉండేదంటే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment