Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    NTPC NGEL Engineer Recruitment 2025 : నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) 182 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

    1 month ago

    NTPC NGEL Engineer Recruitment 2025 : నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) 182 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

    • ఎన్‌టీపీసీ ఎన్‌జీఈఎల్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
    • 182 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
    • ఏప్రిల్‌ 11 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
    • మే 1వ తేదీ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది

    NTPC Green Energy Recruitment 2025 : ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ ( NTPC NGEL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఖాళీగా ఉన్న 182 ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నోటిఫికేషన్లు చూడటానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

    NTPC ఇంజినీర్‌ ఖాళీలు - 182

     

    • ఇంజినీర్‌ (ఆర్‌ఈ-సివిల్‌): 40
    • ఇంజినీర్‌ (ఆర్‌ఈ- ఎలక్ట్రికల్): 80
    • ఇంజినీర్‌ (ఆర్‌ఈ- మెకానికల్): 15
    • ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ- హ్యూమన్‌ రీసోర్స్‌): 07
    • ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ-ఫైనాన్స్‌): 26
    • ఇంజినీర్‌ (ఆర్‌ఈ-ఐటీ): 04
    • ఇంజినీర్‌ (ఆర్‌ఈ-కాంట్రాక్ట్‌ మెటీరియల్‌): 10

     

    ఇతర ముఖ్యమైన సమాచారం :

     

    • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఐటీ), ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
    • వయోపరిమితి: 30 ఏళ్లు నిండి ఉండాలి.
    • జీతం: సంత్సరానికి రూ. 11,00,000 ఉంటుంది.
    • దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.
    • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
    • ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
    • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది : ఏప్రిల్‌ 11, 2025
    • దరఖాస్తులకు చివరి తేది: మే 1, 2025

     

    HPCL జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఏడాదికి రూ.10.58 లక్షల జీతం


    HPCL Recruitment 2025 : ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (JE) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనుంది. డిప్లొమా ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 26 నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 30 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.

    Click here to Read More
    Previous Article
    ఇంజినీరింగ్‌ పూర్తి చేశారా? అయితే అణుశక్తి సంస్థలో 400 ఉద్యోగాలు.. నెలకు రూ.56,100 జీతం
    Next Article
    ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం: ఎవరెవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment