Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    ఇంజినీరింగ్‌ పూర్తి చేశారా? అయితే అణుశక్తి సంస్థలో 400 ఉద్యోగాలు.. నెలకు రూ.56,100 జీతం

    1 month ago

    Nuclear Power Corporation of India : ఇంజినీరింగ్‌ (బీఈ, బీటెక్‌) ఉత్తీర్ణులై ఉద్యోగాన్వేషణలో ఉన్న ఉద్యోగార్థులకు న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సువర్ణావకాశం కల్పించింది. వివరాల్లోకెళ్తే.

    హైలైట్:

    • ఎన్‌పీసీఐఎల్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
    • 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ
    • ఏప్రిల్‌ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం
    • ఏప్రిల్‌ 30 దరఖాస్తులకు చివరితేది

    NPCIL Executive Trainee Recruitment 2025 : ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( NPCIL ).. జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా పలు విభాగాల్లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనుంది. ఇందులో ప్రస్తుతం 396 ఖాళీలు ఉన్నాయి. మరో 4 ఖాళీలు బ్యాక్‌లాగ్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయననున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

    ఈ ప్రకటనకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ ( Engineering ) విభాగంలో బీఈ , బీటెక్‌ , బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. పూర్తి వివరాలను, నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే.. మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

    ఇతర ముఖ్యమైన సమాచారం:

    • ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు : 400
    • విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలును భర్తీ చేయనున్నారు.
    • అర్హత: పోస్టులను బట్టి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
    • వయో పరిమితి: 30.04.2025 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ వారికి మూడేళ్లు.. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.


    జీతం- ఎంపిక ప్రక్రియ :

    • ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100 ఉంటుంది.
    • ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ విషయానికొస్తే.. గేట్ 2023/ 2024/ 2025 స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
    • దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
    • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


    ముఖ్యమైన తేదీలు :

    • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: ఏప్రిల్‌ 10, 2025
    • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2025.
    Click here to Read More
    Previous Article
    India Post GDS : తపాలాశాఖలో 21,413 ఉద్యోగాలు.. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ థర్డ్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల
    Next Article
    NTPC NGEL Engineer Recruitment 2025 : నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) 182 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment