Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    త్వరలోనే ప్రధాని మోదీతో నెతన్యాహు సమావేశం: ఇజ్రాయెల్ పీఎంఓ

    2 months ago

    భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ ద్వారా ఆత్మీయ సంభాషణ జరిపారు. ఈ చర్చల అనంతరం ఇరు నేతలు "త్వరలో సమావేశం కావాలని అంగీకరించినట్లు" ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వంటి కీలక వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల మంత్రులు ఇప్పటికే పర్యటనలు జరిపి పురోగతి సాధించిన నేపథ్యంలో.. ఈ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

    PM Modi Benjamin Netanyahu Meet Soon

    PM Modi Benjamin Netanyahu Meet Soon : భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ ఇద్దరు అగ్రనేతలు "త్వరలో సమావేశం కావాలని అంగీకరించినట్లు" ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం (PMO) సోషల్ మీడియా పోస్టులో అధికారికంగా వెల్లడించింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా సాగినట్లు తెలిపింది.

    నెతన్యాహు పర్యటన కోసం ఇజ్రాయెల్ అధికారులు ప్రస్తుతం భారత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. గతంలో ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల నెతన్యాహు పర్యటన వాయిదా పడిందనే వార్తలను ఇజ్రాయెల్ వర్గాలు ఖండించాయి. భారత భద్రతా వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. నెతన్యాహు పర్యటనకు ముందు.. ఇరు దేశాల మధ్య పలువురు మంత్రుల అత్యున్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్ పర్యాటక శాఖ మంత్రి హైమ్ కాట్జ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్‌ బర్కట్, వ్యవసాయ శాఖ మంత్రి అవి డిచ్టర్, ఆర్థిక శాఖ మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ భారతదేశాన్ని సందర్శించారు.

    Click here to Read More
    Next Article
    AP Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ రిజెక్ట్.!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment