Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు

    1 month ago

    Revanth Reddy comments: ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక భారీ కుట్ర దాగి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. దీనికి కార్పొరేట్ శక్తులే కారణమని అన్నారు.

    Revanth Reddy comments: దేశంలో బడాకంపెనీలకు మేలు చేసి ప్రజలతో వెట్టిచాకిరీ రోజులు తిరిగి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉపాధీ హామీ పేరు మార్పు వెనకాల కార్పొరేట్ కుట్ర దాగి ఉందని అన్నారు. కేంద్ర చేస్తున్నది వికసిత భారత్‌ కాదని సంక్షోభ భారత్‌ దిశగా నడిపిస్తోందని అన్నారు. బడా కంపెనీలకు మేలు చేసేలా చట్టంలో మార్పులు చేశారని అన్నారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, సీనియర్ నేతలు మాట్లాడారు. కేంద్రం విధానాలపై ఫైర్ అయ్యారు. 

    పేదలపై కక్షతో మహాత్మగాంధీ పేరు ఉన్న పథకానికి పేరు మార్చారని మండిపడ్డారు. రూల్స్ పేరుతో పథకానికి శాశ్వతంగా సమాధి కట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారం ఉందని మోదీ ఇష్టారీతిన పాలిస్తామంటే అంగీకరించేది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మెజార్టీ ఉంది కదా అని పేదలను అణచివేస్తామంటూ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోబోదని వార్నింగ్ ఇచ్చారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత ఎన్నికల్లో  బీజేపీ నేతలు ప్రచారం చేసినట్టుగా 400 సీట్లు వచ్చి ఉంటే మాత్రం ఈపాటికి రాజ్యాంగాన్ని మార్చేసేవారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి పేదలకు అన్యాయం చేస్తున్నారని దీన్ని గమనించే బీజేపీకి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని చెప్పారు. రాష్ట్రాల్లో ఓడిపోతామని గ్రహించి ప్రతిపక్షాల ఓట్లు తొలగించే కుట్రకు కూడా వెనుకాడటం లేదని అన్నారు. 

    దేశంలో బడా కంపెనీలకు మేలు చేసి ప్రజలతో వెట్టిచాకిరీ రోజులు తిరిగి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉపాధీ హామీ పేరు మార్పు వెనుకలా కార్పొరేట్ కుట్ర దాగి ఉందని అన్నారు. కేంద్ర చేస్తున్నది వికసిత భారత్‌ కాదని సంక్షోభ భారత్‌ దిశగా నడిపిస్తోందని అన్నారు. బడా కంపెనీలకు మేలు చేసేలా చట్టంలో మార్పులు చేశారని అన్నారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, సీనియర్ నేతలు మాట్లాడారు. కేంద్రం విధానాలపై ఫైర్ అయ్యారు. 

    గ్రామీణ ప్రజలకు మరణ శాసనం రాసేలా మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం నుంచి మహాత్మ గాంధీ పేరు తీసేయడమే కాకుండా పని హక్కులు, నిధులు కుదించారని అన్నారు. ప్రజలకు పని కల్పించే పథకంలో పని మాయమైందని, ప్రజలకు సేవ చేసే అధికారులను కూడా తొలగించారని, ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల్లో కూడా కోత పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రాలపై భారం మోపి ప్రజల ఉపాధికి గండి కొడుతున్నారని అన్నారు. అందుకే కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వేల గ్రామాల్లో తీర్మానాలు చేశారని వాటిని రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. 

    Click here to Read More
    Previous Article
    Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
    Next Article
    రాయలసీమ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు తెలుగు దేశం పార్టీ

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment