Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    SRO : బీటెక్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ అవకాశాలు.. 63 పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్‌ విడుదల

    1 month ago

    Indian Space Research Organisation : ఇస్రో సైంటిస్ట్‌ / ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమై.. కొనసాగుతోంది. పూర్తి వివరాల్లోకెళ్తే..

    హైలైట్:

    • ఇస్రో జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
    • 63 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
    • మే 19 దరఖాస్తులకు చివరితేది
    • ISRO Recruitment 2025 : ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు ఎదురుచూసే ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ( ISRO ) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా ఇస్రో సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలియమల, శ్రీహరికోట కేంద్రాల్లో పని చేసే అవకాశం కల్పిస్తారు.
    • ISRO (Indian Space Research Organisation)ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 63 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 22 పోస్టులు, మెకానికల్‌ విభాగంలో 33 పోస్టులు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 8 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు మే 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
    • వయసు- విద్యార్హతలు :

      ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్‌ (Electronics) అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్‌ డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 2024 లేదా 2025 గేట్‌ స్కోరు కూడా ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు చెందిన వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.
    • ఇక.. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇక ఎంపిక విషయానికొస్తే.. 2024/ 2025 గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతల ఆధారంగా 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.56,100 జీతంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, న్యూ పెన్షన్‌ స్కీమ్‌/ యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్, వ్యక్తిగత, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు, ఎల్‌టీఏ, గ్రూప్‌ ఇన్సూరెన్స్, హౌస్‌బిల్డింగ్‌ అడ్వాన్స్‌ వంటి ఇతర సదుపాయాలు సైతం కల్పిస్తారు.
    • ఇంటర్వ్యూ విధానం ఇలా..

      ఈ ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇందులో అకడమిక్‌ నాలెడ్జ్‌కు 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌కు 20 మార్కులు, ప్రజెంటేషన్‌, కమ్యూనికేషన్‌ స్కిల్‌కు 20 మార్కులు, కాంప్రహెన్షన్‌కు 10 మార్కులు, అకడమిక్‌ అచీవ్‌మెంట్స్‌కు 10 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో 60 శాతం కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే.. ఇంటర్వ్యూకు 50 శాతం, గేట్‌ స్కోరుకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది.
    Click here to Read More
    Previous Article
    SSC GD Result 2025 : ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ రిజల్ట్స్‌ విడుదలకు కసరత్తు.. ఏ క్షణమైనా ఫలితాలు విడుదల
    Next Article
    India Post GDS : తపాలాశాఖలో 21,413 ఉద్యోగాలు.. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ థర్డ్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment