Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    India Post GDS : తపాలాశాఖలో 21,413 ఉద్యోగాలు.. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ థర్డ్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

    1 month ago

    How To Download India Post GDS 3rd Merit List 2025 : ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన మూడో మెరిట్‌ జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది.

    • ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
    • 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ
    • తాజాగా జీడీఎస్‌ థర్డ్‌ మెరిట్‌ జాబితా విడుదల
    • India Post GDS 3rd Merit List 2025 : దేశవ్యాప్తంగా భారత తపాలా శాఖ ఆధ్వర్యంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak GDS) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అలర్ట్‌. తాజాగా ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి థర్డ్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. తొలుత మార్చి నెలలో మొదటి మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. అనంతరం కొద్దిరోజులకు ఏప్రిల్‌ నెలలో సెకండ్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. తాజాగా మూడో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. అభ్యర్థులు ఈ ఫలితాలను చెక్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఈ ఉద్యోగ నియామకాల్లో భాగంగా మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల మూడో జాబితాను తపాలా శాఖ అధికారులు విడుదల చేశారు.

    తాజాగా విడుదలైన మూడో జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో https://indiapostgdsonline.gov.in/ చూడొచ్చు. ఏపీ జీడీఎస్‌ మూడో జాబితా లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. తెలంగాణ జీడీఎస్‌ మూడో జాబితా లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. మొత్తం 21,413 జీడీఎస్‌ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ పరిధిలో 1215 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 519 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసిన మూడో జాబితాలో ఏపీ నుంచి 442 మంది.. తెలంగాణ నుంచి 77 షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. మూడో జాబితాకు ఎంపికైన అభ్యర్థులు జూన్‌ 3లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

     

    షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు సెల్ఫ్‌ అటెస్టెడ్‌ ఫొటో కాపీలను రెండు సెట్‌లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాలి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. కంప్యూటర్ (Computer) జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లను అధికారులు రూపొందిస్తారన్న విషయం తెలిసిందే.

     

    జీతభత్యాల విషయానికొస్తే..

    గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు బీపీఎం (BPM) పోస్టులకైతే రూ.12000 నుంచి రూ.29,380, ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10000 నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు ()కు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు.

    Click here to Read More
    Previous Article
    SRO : బీటెక్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ అవకాశాలు.. 63 పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్‌ విడుదల
    Next Article
    ఇంజినీరింగ్‌ పూర్తి చేశారా? అయితే అణుశక్తి సంస్థలో 400 ఉద్యోగాలు.. నెలకు రూ.56,100 జీతం

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment