Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Viral News: పాతికేళ్ల యువకుడికి 70 ఏళ్ల మెదడు! మెడికల్ హిస్టరీలోనే వింతైన కేసు!

    1 month ago

    Viral News:ప్రపంచంలో కొన్ని వ్యాధులు గురించి చదివినా లేదా విన్నా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి వ్యాధి గురించి తెలుసుకోండి.

    Brain Donation for Dementia Research: ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్‌లోని టెరెహామ్‌లో నివసిస్తున్న ఆండ్రీ యార్‌హామ్. అతనికి 24 ఏళ్లు. అయితే చిన్న వయసులోనే ఆ యువకుడి ప్రవర్తనలో చాలా వింత మార్పులు వచ్చాయి. వాటిని తల్లి సమంతా ఫెయిర్‌బర్న్ గమనించింది. తన కొడుకు చిన్న చిన్న విషయాలను మర్చిపోతున్నాడని, కొన్నిసార్లు అతని ప్రవర్తన వయస్సును మించి కనిపిస్తుందని ఆమె గమనించడం ప్రారంభించింది. అందువల్ల, ఆమె తన కొడుకును వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. డాక్టర్ చెప్పింది ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. 

    డాక్టర్ ఏ వ్యాధి అని చెప్పారు?

    పరీక్షల తర్వాత, వైద్యులు ఆండ్రీకి ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా ఉందని నిర్ధారించారు. ఇది మెదడులో ఒక నిర్దిష్ట ప్రోటీన్ మార్పు వల్ల కలిగే అరుదైన రకం డిమెన్షియా. ఈ వ్యాధి జ్ఞాపకశక్తి, ప్రవర్తన, ఆలోచన, మాటలపై త్వరగా ప్రభావితం చేస్తుంది. రోగ నిర్ధారణ తరువాత, మెదడు స్కానింగ్‌లో అసాధారణంగా మెదడు కుచించుకుపోయినట్టు  గుర్తించారు. తరువాత అతను కేంబ్రిడ్జ్‌లోని ఒక ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ అతనికి డిమెన్షియా నిర్దారితమైంది. 

    24 ఏళ్లకే మరణించాడు

    ఆండ్రీ యార్మన్ 24 సంవత్సరాల వయస్సులో ఈ వ్యాధితో మరణించాడు. ఈ వ్యాధి సాధారణంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. MRI స్కానింగ్ ద్వారా చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని మెదడు 70 ఏళ్ల వృద్ధుడి మెదడులా మారిందని తేలింది. BBCతో మాట్లాడుతూ, తన కొడుకు చిన్న వయస్సులోనే డిమెన్షియాతో బాధపడుతున్నాడని తెలుసుకుని చాలా బాధపడ్డానని ఆండ్రీ తల్లి అన్నారు. ఈ వ్యాధి వయస్సును గుర్తించదని, తన కొడుకు ఇలాంటి వ్యాధి సోకిన అతి పిన్నవయసు వ్యక్తుల్లో ఒకడు కావచ్చునని ఆమె వివరించారు.

    చూసుకోవడం కష్టం

    అతని వ్యాధి తీవ్రతరం కావడంతో, అతని కుటుంబ సభ్యులు అతన్ని చూసుకోవడం మరింత కష్టమైంది. సెప్టెంబర్‌లో, ఆండ్రీని ఒక నర్సింగ్ హోమ్‌కు మార్చారు. కొన్ని వారాల తరువాత, అతను వీల్‌చైర్‌కు పరిమితమయ్యాడు. మరణానికి ఒక నెల ముందు, అతను మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయి, శబ్దాలు మాత్రమే చేయగలిగాడు. అయినప్పటికీ, ఆండ్రీ నవ్వు, హాస్యం, వ్యక్తిత్వం కంటిన్యూ అయ్యింది. చివరి దశ వరకు ఉంది. డిసెంబర్ 27న అతను మరణించే వరకు అలాగే ఉన్నాయి. అతను చనిపోయే ముందు, ఆండ్రీ తన మెదడును పరిశోధన కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. భవిష్యత్తులో మెరుగైన చికిత్సలు, వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలనే ఆశతో. తన కొడుకు నిర్ణయం ఒక కుటుంబానికి తమ ప్రియమైన వారితో మరికొన్ని సంవత్సరాలు గడిపే అవకాశం కల్పిస్తే, అది విలువైనదేనని అతని తల్లి అన్నారు.

    Click here to Read More
    Previous Article
    WPL 2026 మొదటి మ్యాచ్‌ నుంచే మజా! ముంబై ఇండియన్స్‌పై ఓడి గెలిచిన ఆర్సీబీ! చివరి 4 బంతుల్లో మ్యాజిక్ చేసిన నదీన్ డి క్లార్క్
    Next Article
    The Raja Saab Box Office Collection Day 1: ప్రభాస్ టాప్ 5లో లేదు కానీ... 'ది రాజా సాబ్' ఫస్ట్ డే ఇండియా నెట్ ఎంతంటే?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment