Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    WPL 2026 మొదటి మ్యాచ్‌ నుంచే మజా! ముంబై ఇండియన్స్‌పై ఓడి గెలిచిన ఆర్సీబీ! చివరి 4 బంతుల్లో మ్యాజిక్ చేసిన నదీన్ డి క్లార్క్

    1 month ago

    MI vs RCB WPL 2026: ఉమెన్ ప్రీమియర్‌ లీగ్ మొదటి మ్యాచ్ నుంచే మజా వచ్చింది. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ విజయం లాక్కుంది.

    MI vs RCB Highlights: మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 4 (WPL 2026) మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. 155 పరుగులు లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి దిగిన స్మృతి మంధానా, గ్రేస్ హారిస్ దూకుడుగా ఆడారు. కానీ వరుసగా వికెట్లు పతనంతో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ వచ్చింది. ఆఖరి ఓవర్‌లో బెంగళూరు విజయం సాధించాలి అంటే 18 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని నదీన్ డి క్లర్క్ సునాయాసంగా కొట్టేసింది. ఆటను పూర్తిగా మార్చేసింది.

    అయితే, ఇది కేవలం 4 బంతుల కథ కాదు, నదీన్ డి క్లర్క్ మొత్తం మ్యాచ్‌లో బాగా బ్యాటింగ్ చేసి, విజయవంతమైన ఫోర్ కొట్టడానికి ముందు అర్ధ సెంచరీ పూర్తి చేసింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా, క్లర్క్ తెలివిగా ఆడుతూ జట్టును లక్ష్యానికి చేరువ చేసింది.

    చివరి ఓవర్లో ఏం జరిగింది?

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి 6 బంతుల్లో 18 పరుగులు కావాలి. ప్రేమా రావత్ నాన్ స్ట్రైక్‌లో ఉండగా, నదీన్ డి క్లర్క్ మొదటి 2 బంతుల్లో సింగిల్స్ తీసుకోలేదు. నటాలీ స్కీవర్-బ్రంట్ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి ఆమె అద్భుతమైన సిక్స్ కొట్టింది. నాల్గో బంతికి ఫోర్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసింది.

    నదీన్ ఐదో బంతికి కూడా సిక్స్ కొట్టింది, ఆ తర్వాత RCB చివరి బంతికి గెలవడానికి 2 పరుగులు కావాలి. ఆమె చివరి బంతికి ఫోర్ కొట్టి RCBని గెలిపించింది. ఆమె 44 బంతుల్లో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె 2 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టింది.

    Click here to Read More
    Previous Article
    Hyderabad Water Supply Update: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌: 36 గంటలపాటు కృష్ణా నీటి సరఫరా బంద్‌, మీ ప్రాంతం ఉందో లేదో చూసుకోండి
    Next Article
    Viral News: పాతికేళ్ల యువకుడికి 70 ఏళ్ల మెదడు! మెడికల్ హిస్టరీలోనే వింతైన కేసు!

    Related స్పోర్ట్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment