Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    US Visa Interviews Rescheduled: భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన

    2 months ago

     

    భారత్‌లో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన నేపథ్యంలో హెచ్-1బీ వీసాదారులకు అక్కడి ఇమిగ్రేషన్‌ లాయర్లు

    కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాకు వెళితే వీసా స్టాంపింగ్ ఆలస్యమై చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

    US Visa Interviews Rescheduled: భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన

    ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో డిసెంబర్‌లో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాదికి అమెరికా వాయిదా

    వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్వ్యూలు ఉండొచ్చంటూ ఇటీవల అకస్మాత్తుగా

    లబ్ధిదారులకు సందేశాలు పంపించింది. దీంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. లబ్ధిదారుల సోషల్ మీడియా

    అకౌంట్స్ పరిశీలన నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. దీంతో,

    అమెరికాలోని హెచ్-1బీ వీసాదారులకు అక్కడి ఇమిగ్రేషన్ లాయర్లు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో

    వీసా స్టాంపింగ్‌ కోసం భారత్‌కు వెళ్లడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు (US Visa Interviews Rescheduled).

    హెచ్-1బీ వీసా కాలపరిమితి ఇంకా ముగియని వారు మాత్రమే తమ సొంత దేశాలకు వెళ్లి రావొచ్చని ఇమిగ్రేషన్ లాయర్స్

    చెబుతున్నారు. హెచ్-1బీ వీసాదారులు తిరిగి అమెరికా వెళ్లాలంటే తమ సొంత దేశాల్లోని యూఎస్ కాన్సులార్ కార్యాలయాల

    ఆమోదముద్ర తప్పనిసరి. కాబట్టి ఇంటర్వ్యూలు వాయిదా పడిన ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్-1బీ హోల్డర్స్ తమ సొంత దేశాల్లోనే

    ఉండిపోవాల్సి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చివరకు అమెరికా జాబ్‌లో పోగొట్టుకునే అవకాశం ఉందని కూడా అన్నారు.

     

    వలసల వ్యవహారాల న్యాయవాదుల ప్రకారం, హెచ్-1బీ ఉద్యోగాన్ని ఆరు నెలలకు మించి ఖాళీగా ఉంచే పరిస్థితి లేదు. ఈ కాలవ్యవధిని

    మించితే మరొకరితో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక అమెరికా సంస్థలు విదేశాల్లోని వారికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించేందుకూ

    పరిమితులు ఉన్నాయి.

    డిసెంబర్‌లో ఇంటర్వ్యూలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది హెచ్-1బీ వీసాదారులు భారత్‌కు వచ్చారు.

    కానీ ఆ ఇంటర్వ్యూలు వాయిదాపడ్డట్టు చివరి నిమిషంలో వాళ్లకు ఈమెయిల్స్ అందాయి. హెచ్-1బీ వీసాదారులు,

    వారి కుటుంబసభ్యుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా పరిశీలించనున్నామని విదేశాంగ శాఖ గత వారం తెలిపింది.

    ఈ క్రమంలోనే డిసెంబర్‌లో జరగాల్సిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి.

    Click here to Read More
    Previous Article
    AP Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ రిజెక్ట్.!
    Next Article
    Ind Vs SA 2nd T20: టాస్ గెలిచిన టీమిండియా

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment