Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Long Island City

    -0.79°C

    Stormy
    4.12 km/h
    60%
    0.2h

    Latest

    Muharram 2026 Date: మొహర్రం ఎప్పుడు? జూన్ 16 లేదా 17 ఎప్పుడు జరుపుకుంటారు?

    ముహర్రం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల , రంజాన్ తర్వాత ఇస్లాం రెండవ పవిత్ర మాసం. అల్లాహ్ యుద్ధాన్ని నిషేధించిన సమయాన్ని ముహర్రం సూచిస్తుందని అంటారు. ఈ సంవత్సరం ముహర్రం ఎప్పుడంటే.. Muharram 2026: చాలా మంది ముస్లింలు ఇస్లామిక్ నూతన సంవత్సర క్యాలెండర్ ప్రారంభాన్ని నిర్ణయించడానికి విభిన్న ప్రమాణాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఫిఖ్ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా (FCNA) తేదీని లెక్కించడానికి కొన్ని నియమాలను ఉపయోగిస్తుంది, అవి మక్కాలో సూర్యాస్తమయానికి ముందు చంద్రోదయం (అమావాస్య) ,సూర్యాస్తమయం తర్వాత చంద్రస్తమయం. మొహర్రం ఎప్పుడు  మొహర్రం ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లోని మొదటి నెల, దీనిని నాలుగు పవిత్ర మాసాలలో ఒకటిగా పరిగణిస్తారు. మొహర్రం పదవ రోజున వచ్చే ఆషూరాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం, మొహర్రం సుమారుగా జూన్ 16 లేదా 17, 2026న ప్రారంభమవుతుందని అంచనా. అయితే, చంద్ర దర్శనం తర్వాతే తుది తేదీని నిర్ణయిస్తారు. ఒకవేళ జూన్ 16న చంద్రుడు కనిపిస్తే, యోమ్-ఎ-ఆషూరా రోజు జూన్ 25న వస్తుంది. అయితే, జూన్ 16న చంద్రుడు కనిపించకపోతే, ఆషూరా జూన్ 26న రావచ్చు.  

    Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!

    Indian Seafarers Killed Oman:ఒమన్‌లో భారత నౌకలపై దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. Indian Seafarers Killed Oman:నీలి సముద్రం రక్తసిక్తమవుతోంది. పశ్చిమ ఆసియాలో రగులుతున్న ఉద్రిక్తతలు సామాన్య నావికుల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా ఒమన్ తీరంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై జరిగిన దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో, ఒమన్ తీరంలోని షినాస్‌ పోర్డు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో భారతీయ నావికులు లక్ష్యంగా దాడులు జరిగాయి. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టిబెల్లో వాణిజ్య నౌకపై ఒమన్ గల్ఫ్‌ గుండా వెళ్తుండగా దాడి జరిగింది ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  రెండో దాడి ఎంటీ జల్వీస్ నౌకపై జరిగింది. షినాస్ పోర్టు సమీపంలో ఈ నౌకపై దాడి జరిగింది. దీని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగడంతో నౌక సముద్రం మధ్యలో తగలబడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 20 మంది భారతీయులు ఉన్నారు.  ఈ దాడులు జూన్ 10-11 తేదీల్లో జరిగాయి. బుధవారం జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగింది. గురువారం జరిగిన ఘటనలో నౌక మంటల్లో చిక్కుకుంది. ఈ దాడుల ఫలితంగా భారత్‌కు చెందిన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పార్వర్డ్‌ సీమెన్‌ యూనియన్ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. వారు చెప్పిన వివరాలు పరిశీలిస్తే, ఒక చీఫ్ ఇంజనీర్‌, ఇద్దరు నావికులు ఈ దుర్ఘటనలో మరణించారు. మొత్తం 24 మంది సిబ్బందిలో 21 మందిని సురక్షితంగా రక్షించారు. ముగ్గురు గల్లంతయ్యారు. తర్వాత వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. ఇంకో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు.  ఇరాన్ ఓడరేవులను దిగ్బంధం చేయడానికి అమెరికా చేపట్టిన చర్యల ఫలితంగానే ఇది జరిగి ఉండవచ్చని, బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఎంప్రేర్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. దాడి జరిగే పక్షంలో, సిబ్బందిని ఓడ వెనుక భాగంలో కాకుండా ముందు భాగంలో ఉండాలని గతంలోనే హెచ్చరించారు. మూడు రోజుల్లో మూడు నౌకలపై దాడి  MT జల్వీర్‌పై దాడికి ముందు, గత రెండు రోజులుగా ఒమన్ తీరప్రాంతంపై దాడులు జరుగుతుండగా, నౌకపై ఇది వరుసగా మూడో దాడి. బుధవారం, సెటెబెలో ట్యాంకర్‌పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నిరసన తెలియజేయడానికి భారత్, అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించింది.  భారత్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ  ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్‌ నాయుడు, అమెరికా చార్జ్‌ డి అఫైర్స్‌ జాసన్ మిక్స్‌ను పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం చేశారు. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.    

    Reduce Blood Sugar Levels : మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు

    Easy Trick to Reduce Blood Sugar Spikes : రోజుకు కేవలం 15 నిమిషాల నడిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయా? డాక్టర్లు ఏమంటున్నారు.. నడకకు, మధుమేహానికి ఉన్న లింక్ ఏంటో చూసేద్దాం.  15 Minute Walk Can Help Reduce Blood Sugar : మధుమేహం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. షుగర్ ఉన్న చాలామంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులపై ఆధారపడుతుంటారు. అయితే లైఫ్​స్టైల్లోని కొన్ని మార్పులు కూడా షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో నడక ఒకటి. రోజుకు కేవలం 15 నిమిషాలు నడిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగానే తగ్గించుకోవచ్చని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ అరోరా వెల్లడించారు. అసలు నడకకు, మధుమేహానికి ఉన్న సంబంధం ఏంటి? షుగర్ ఎలా కంట్రోల్ అవుతుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  నడకతో షుగర్ ఎలా తగ్గుతుంది? నడక ప్రారంభించిన వెంటనే శరీరంలోని కండరాలు ఎక్కువ గ్లూకోజ్‌ను ఉపయోగించడం మొదలుపెడతాయి. రక్తంలో ఉన్న చక్కెరను కండరాలు స్పాంజ్‌లా గ్రహిస్తాయని డాక్టర్ అరోరా చెబుతున్నారు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సహజంగానే తగ్గుతాయి. ఒక వ్యక్తి 15 నిమిషాల నడకతో.. కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్ (CGM) డేటాలో గ్లూకోజ్ స్థాయిలు చెక్ చేసుకుంటే.. అది 107 mg/dL నుంచి 96 mg/dLకు తగ్గుతుందని ఆయన వెల్లడించారు. భోజనం తర్వాత నడిస్తే.. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల ఆ గ్లూకోజ్‌ను కండరాలు వినియోగించుకుంటాయి. దీంతో భోజనం తర్వాత వచ్చే షుగర్ స్పైక్స్‌ను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ప్రీడయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ అలవాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు నడక కేవలం షుగర్‌ను తగ్గించడమే కాదు.. శరీరంలోని ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా నడిస్తే.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క్రమంగా తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగై మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  ఎక్కువసేపు నడవాలా? మంచి ఫలితాలు రావాలంటే గంటల తరబడి నడవాలని అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజులో గంటలు నడవడం కంటే.. రోజూ 10 నుంచి 15 నిమిషాల నడకతో ప్రారంభించినా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెప్తున్నారు.  మొదట రోజుకు 10-15 నిమిషాలతో ప్రారంభించండి. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోండి. స్టెప్స్‌ను ట్రాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించండి. ఉదయం, లంచ్ బ్రేక్ లేదా సాయంత్రం వేళల్లో వాక్ చేయండి. రోజుకు 30 నిమిషాలు లేదా 10 వేల అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేయండి. నడకకు ముందు, తర్వాత స్ట్రెచింగ్ చేస్తే మంచిది. సౌకర్యవంతమైన షూలు వేసుకోండి. 

    FIFA World Cup 2026 Prize Money: ఫీఫా 2026 ప్రైజ్ మనీ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! టీ20 వరల్డ్ కప్ కంటే 60 రెట్లు ఎక్కువ!

    FIFA World Cup 2026 Prize Money: ఫీఫా 2026 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. FIFA World Cup 2026 Prize Money: ఫీఫా ప్రపంచ కప్‌ 2026 భారత్ కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి  ప్రారంభమవుతుంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. 2026 ఫీఫా ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు ప్రైజ్‌మనీ గురించి చర్చ జరుగుతోంది. దీనిపై ఫీఫా కీలక ప్రకటన చేసింది.   గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బహుమతి చాలా పెంచుతున్నట్టు ఫీపా ప్రకటించింది. 2022 ఫీఫా ప్రపంచ కప్ ఖతార్‌లో జరిగింది. 2022లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. 2022 ఫీఫా ప్రపంచ కప్ బహుమతి మొత్తంతో పోలిస్తే, 2026 బహుమతి మొత్తం సుమారు 50 శాతం పెరిగింది. 2026 ఫీఫా ప్రపంచ కప్ ప్రైజ్ మనీ మొత్తం $655 మిలియన్లు, ఇది భారత రూపాయలలో రూ. 6241 కోట్లకు సమానం. 2022 ఫీఫా ప్రపంచ కప్ బహుమతి మొత్తం $440 మిలియన్లు. 2026 టీ20 ప్రపంచ కప్ విజేత అయిన భారత జట్టు ప్రైజ్ మనీతో పోలిస్తే, 2026 ఫీఫా ప్రపంచ కప్ ప్రైజ్ మనీ సుమారుగా 60 రెట్లు ఎక్కువ. 2026 టీ20 ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది, ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవడంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా, స్వదేశంలో ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టు కూడా భారతే. 2026 టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ $11.25 మిలియన్లు కాగా, అందులో భారత్‌కు $2.63 మిలియన్లు లభించాయి. భారత రూపాయలలో దీని మొత్తం విలువ ₹24.28 కోట్లు. ఫీఫా ప్రపంచ కప్ 2026 బహుమతి డబ్బు పంపిణీ ఛాంపియన్ – రూ. 476 కోట్లు  రన్నరప్ – రూ. 314 కోట్లు మూడో స్థానం – రూ. 276 కోట్లు నాలుగో స్థానం – రూ. 257 కోట్లు క్వార్టర్-ఫైనల్స్ (5వ-8వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 181 కోట్లు రౌండ్ ఆఫ్ 16 (9వ-16వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 143 కోట్లు రౌండ్ ఆఫ్ 32 (17వ-32వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 105 కోట్లు  గ్రూప్ దశ నుంచి నిష్క్రమణ (33వ-48వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 86 కోట్లు

    Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!

    ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పట్లో కాని పనిలే అంటూ లైట్ తీసుకున్న ప్రతిపక్షాలకు, తాజాగా ఎఫ్‌సీడీఎ నిర్మాణం , అధునాత సౌకర్యాలు, భవిష్యత్ వ్యూహాలు చూస్తుంటే లైట్ తీసుకోవద్దు మిత్రమా అంటున్నారట. Bharat Future City Hyderabad:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీలో నిర్మాణం, అభివృద్ది ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దేశంలోనే అరుదైన గుర్తింపును సొంత చేసుకుంది ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్‌ అథారటీ బిల్డింగ్ (FCDA). పర్యావరణానికి ఏ మాత్రం హని కలిగించకుండా నిర్మించిన, అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసినందుకు గ్రీన్ బిల్డిండ్ ట్యాంగ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సిటీకి సచివాలయాన్ని కూడా తరలించే ప్రక్రియ జరుగుతోందని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఛాంబర్స్ రెడీ అయ్యాయని అంటున్నారు.  భారత్ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతోంది..? హైదరాబాద్ మహానగరం తన పరిధి విస్తరించడంతోపాటు, జీహెచ్‌ఎంసీని విభజించడంతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఎలా ఉన్నా, ఫ్యూచర్ సిటీ అభివృద్దిపైనే కోటి ఆశలు పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఏకంగా 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. భవిష్యత్‌లో 25 లక్షల నుంచి 30లక్షల జనాభా భారత్ ఫ్యూచర్ సిటీలో నివసించేలా మౌలిక సదుపాయాలు, అధునాతన వసతులు, విద్యా, ఉపాధి అవకాశాలు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ అంటే ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ అనేంతలా కనీవినీ ఎరుగని రీతిలో వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన FCDA బిల్డింగ్ ప్రత్యేకతలివే.. ఫ్యూచర్ సిటి అభివృద్దిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన తొలి అడుగే రికార్డ్ బద్దలు కొట్టింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ది, నిర్మాణ పనులు పర్యావేక్షణ, పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పర్యవేక్షించేందుకు ఫ్యూచర్ సిటిలో నిర్మించిన తొలి భారీ నిర్మాణం ఫ్యూచర్ సిటి డెవలప్‌మెంట్ అథారిటీ బిల్డింగ్. ఈ నిర్మాణంలో ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించే పదార్దాలు వినియోగించలేదు. పర్యావరణహిత నిర్మాణ ప్రమాణాలు పాటించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత తాజాగా గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు పొందింది దేశం దృష్టిని ఆకర్షించింది. వర్షపు నీటి సంరక్షణకు ఇక్కడ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, 15కిలోవాట్ల సౌరశక్తి సామర్ద్యంతో విత్ ప్లాంట్‌ను నిర్మాణం, ఫ్యూచర్ సిటీ విద్యుత్ అవసరాలకు కొంత భాగం సౌరశక్తిని వినియోగించేలా ప్రణాళికలు రూపొందించడం ఇలా ఒకటేమిటి ఫ్యూచర్ సిటీలో అన్నీ వినూత్న ప్రయోగాలే. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  విదేశీ ప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. FCDA పరిసరాల్లో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను వినియోగించేందుకు బయోడైజర్టర్ ప్లాంట్ ఏర్పాటు ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. బయోగ్యాస్‌తో పాటు సేంద్రియ ఎరువులను తయారు చేయడంతో, ఫ్యూచర్ సిటీ నూతన భవనం వ్యర్థాల నిర్వహణలో పర్యావరణహిత భవనంగా నిలిచింది. అందుకే ఫ్యూచర్ సిటికీ కేరాఫ్‌గా నిలిచే FCDA బిల్డింగ్ కాలుష్యరహిత నిర్మాణంగా నెట్ జీరో బిల్డింగ్ గా పేరు తెచ్చుకుంది.  

    Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ

    Vijay Deverakonda Nag Ashwin: నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటిలో విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన సినిమాలోనూ ఉన్నారు. దాంతో ఆయన లక్కీ ఛార్మ్ దేవరకొండ అంటున్నారు జనాలు. రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'తో నాగ్ అశ్విన్ (Nag Ashwin) పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరారు. అయితే... ఆయన దర్శకుడిగా పరిచయమైనది? నాని 'ఎవడే సుబ్రమణ్యం'తో. దర్శకుడిగా ఆయన పేరు తీసుకు వచ్చినది? సావిత్రి బయోపిక్ 'మహానటి'. నాగ్ అశ్విన్ మూడు సినిమాల్లో హీరోలు వేర్వేరు కావచ్చు. కానీ, ఆ మూడు సినిమాల్లో ఉన్నది మాత్రం యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్, రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). థియేటర్లలోకి వచ్చిన నాగ్ అశ్విన్ లేటెస్ట్ సినిమాలోనూ దేవరకొండ ఉన్నారు.      'సింగ్ గీతం'లో అతిథిగా విజయ్ దేవరకొండSing Geetham Movie Cast: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్ చేసిన లేటెస్ట్ సినిమా 'సింగ్ గీతం'. ఇందులో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రధారులు. ప్రీమియర్స్, ఫస్ట్ డే థియేటర్లకు వెళ్లిన తెలుగు ప్రేక్షకులు సినిమాలో స్టార్ హీరోని చూశారు. ఆయనే విజయ్ దేవరకొండ.

    Virat Kohli New Pastel Hairstyle: గాయంతో టీమ్‌కు దూరమైనా తగ్గేదేలే, సరికొత్త పేస్టెల్ హెయిర్ కలర్ లుక్‌లో కింగ్ కోహ్లీ.. ఫోటోలు వైరల్!

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ సరికొత్త పేస్టెల్ హెయిర్ కలర్ స్టైల్‌తో ట్రెండ్ అవుతున్నాడు. Virat Kohli Trendy Hair Look After Recent IPL Triumph: ఇండియన్ స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ సరికొత్త మేకోవర్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ఒక వైపు గాయం వల్ల క్రికెట్‌కు దూరమైనప్పటికీ, తన ట్రెండీ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ రషీద్ సల్మానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ వీడియోను షేర్ చేశాడు. ఈ సరికొత్త లుక్‌లో కోహ్లీ ఒక డిఫరెంట్ పేస్టెల్ హెయిర్ కలర్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఆర్‌సీబీ (RCB) ఐపిఎల్ టైటిల్ గెలిచిన ఒక వారం తర్వాత ఈ లుక్ బయటకు వచ్చింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఫైనల్లో కోహ్లీ 75 రన్స్‌తో అజేయంగా నిలిచి టీమ్‌ను గెలిపించాడు.

    Drink Too Much Tea : టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు

    Side Effects of Drinking Too Much Tea : సందర్భం ఏదైనా టీ తాగే అలవాటు మీకు ఉంటే.. ఈ విషయాలపై కచ్చితంగా ఫోకస్ చేయాలని వైద్యులు చెప్తున్నారు. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. Risks of Excess Tea Consumption : ఉదయం లేవగానే టీ, సాయంత్రం మరో కప్పు టీ.. ఇలా రోజులో చాలామందికి టీ తాగడం ఒక అలవాటుగా మారిపోయింది. పరిమితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు అందించినప్పటికీ.. అధికంగా తాగితే మాత్రం శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. శేషి కిరణ్ మాట్లాడుతూ.. టీని మితంగా తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని, కానీ రోజులో ఎక్కువ టీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. కెఫిన్ ఎక్కువైతే.. టీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. రోజులో ఎక్కువ మొత్తంలో టీ తాగితే శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆందోళన, అసహనం, చిరాకు, గుండె వేగంగా కొట్టుకోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఏకాగ్రత తగ్గడం, మూడ్ మార్పులు, రోగనిరోధ ఐరన్ శోషణపై ప్రభావం టీలో టానిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారంలో ఉండే ఐరన్ శరీరానికి సరిగా శోషించకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో ఉండే నాన్-హీమ్ ఐరన్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం ఉండే మహిళలు, ఇప్పటికే ఐరన్ లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే టీ తాగడం ఐరన్ శోషణను మరింత తగ్గిస్తుందని చెప్తున్నారు.  జీర్ణ సమస్యలు టీని అధికంగా తాగడం వల్ల కొందరిలో జీర్ణ సంబంధ సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం లేదా చాలా స్ట్రాంగ్ టీ తీసుకోవడం వల్ల వికారం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కెఫిన్‌కు సున్నితంగా స్పందించే వ్యక్తుల్లో తల తిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. గర్భిణులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? గర్భిణీ స్త్రీలు టీ తీసుకునే పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో కొన్ని సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల గర్భిణులు వైద్యుల సూచన మేరకు మాత్రమే టీ తీసుకోవడం మంచిదని డాక్టర్ కె. శేషి కిరణ్ సూచించారు. అలవాటు పడకండి రోజూ ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరం దానికి అలవాటు పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్కసారి అకస్మాత్తుగా టీ తాగడం తగ్గిస్తే లేదా పూర్తిగా మానేస్తే తలనొప్పి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  రోజులో ఎంత టీ తాగాలి? ఆరోగ్యవంతులైన పెద్దలు పరిమితంగా టీ తాగితే ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగాలి. అంతేకాకుండా టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. అయితే ఏదైనా ఎక్కువైతే సమస్యే. అందుకే రోజులో టీ పరిమాణాన్ని నియంత్రించడం, నిద్రకు ముందు టీ తాగకపోవడం, భోజనానికి ముందు లేదా వెంటనే తర్వాత టీ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు లేకుండా టీని ఆస్వాదించవచ్చు.క శక్తి బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు డాక్టర్ శేషి కిరణ్. 

    High Tension in Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!

    కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ‘వెన్నుపోటు’ నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదంటూ పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. Kethireddy Pedda Reddy News | తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైలైట్‌గా నిలిచే ప్రాంతాల్లో తాడిపత్రి ఒకటి. నేడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో చేపట్టిన ‘వెన్నుపోటు’ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నిలిపివేశారు. ఈ నిరసనకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో, పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఉద్రిక్తతల మధ్య పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది.  పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికక్కడే రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత చేయి దాటింది. దీంతో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసు వాహనంలో అనంతపురానికి తరలించారు. పెద్దారెడ్డి అరెస్ట్‌తో తాడిపత్రిలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణవ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ వర్గీయుల బైక్ ర్యాలీ.. మరోవైపు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు జరిగాయి. ఒకే రోజు అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు వైఎస్సార్‌సీపీ నిరసనను అడ్డుకున్నారు. తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ..  ఓవైపు తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ భారీ ఎత్తున జరగనుంది. 20 ఎకరాల్లో జర్మన్ షెడ్లతో, 30 వేల మంది కూర్చునేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్, NDA నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. రెండేళ్ల పాలనా ప్రగతిపై ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ నిరసనల్లో పాల్గొంటున్నారు.    కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా, డీఎస్సీ పోస్టుల పేరుతో అక్రమాలకు పాల్పడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రెండేళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసినా , కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. జగన్ చేతిలో పరశురాముడి గొడ్డలి ఉందని, 2029 ఎన్నికల్లో కూటమి అవినీతిని నరకబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సైన్స్ vs ఆధ్యాత్మికత : మంచోళ్లు త్వరగా చనిపోవడం వెనుక అసలు రహస్యం!

    Science vs Spirituality: మంచోళ్లే తొందరగా చనిపోతారు ఎందుకో అనే మాట చాలాకాలంగా వినే భావోద్వేగపూరితమైన నమ్మకం. ఇంతకీ ఇది నిజమేనా? మంచోళ్లే త్వరగా చనిపోతారా? అందుకు కారణం ఏంటి? Karma Scientific Reality: ఎవరైనా మంచి వ్యక్తి చిన్న వయసులో లేదా అకస్మాత్తుగా మరణిస్తే ఆ బాధ నుంచి పుట్టిన మాటే.. మంచోళ్లే ఎందుకు త్వరగా చనిపోతారో అని. ఇంతకీ ఈ మాట నిజమేనా? నిత్యం ఎంతోమంది చనిపోతుంటారు. ఓ సాధారణ వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి చనిపోయినప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. కానీ సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారో, సేవ చేసేవారో, అందరితో ప్రేమగా ఉండేవారో మరణిస్తే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఆ బాధ మనసులో బలంగా ముద్ర పడిపోతుంది. మంచివ్యక్తి కదా..ఇంకొంత కాలం బతికి ఉంటే బావుండును అనిపిస్తుంది. ఆ బాధ నుంచి వచ్చిన మాటే మంచోళ్లే ఎందుకు త్వరగా చనిపోతారో అని. పైగా మంచివారు..తమ స్వార్థం తాము చూసుకోరు, ఎదుటివారి బాగుకోసం తాపత్రయపడతారు, తనచుట్టూ ఉండేవారు బావుండాలని ఆలోచిస్తారు. ఈ తీవ్రమైన ఒత్తిడి వారి ఆరోగ్యంపై, గుండెపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.   ఏ రోజు తలస్నానం చేయకూడదు? జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య నియమాలు, నమ్మకాలు తెలుసుకోండి ! ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే.. వివిధ మతాలు, పురాణాల ప్రకారం దీనికి కొన్ని వివరణలున్నాయి. ముఖ్యంగా కర్మ సిద్ధాంతం గురించి చెబుతారు. హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతి జీవికి ఓ మిషన్ ఉంటుంది. మంచి వ్యక్తి తన కర్మలను ముగించి ఈ జన్మలో ఎక్కువ పుణ్యం సమకూర్చుకుంటే ఆత్మ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఈ భూమిపై తాము చేయాల్సిన మంచి పనులు ఎంత త్వరగా పూర్తైతే అంత త్వరగా మంచివారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారట. ఇంకా ఆచరించాల్సిన కర్మలు మిగిలిపోతే ...అవి తీరేవరకూ భూమ్మీద ఉండాల్సిందే. మంచి కర్మలు పూర్తిచేసేస్తే వారు ఈ లోకాన్ని వీడి ఉత్తమ లోకాలకు చేరుకుంటారని నమ్ముతారు. పాపాత్ములు కర్మలు ముగియకపోవడం వల్ల ఇక్కడే ఉండిపోతారు..ఇది శిక్ష కూడా కావొచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు శరీరం కేవలం దుస్తులు లాంటిది..ఆత్మ అమరమైనది.   బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు! రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సాధ్వి శారదా మాత లాంటి వారు చెప్పిన ప్రకారం.. భగవంతుడు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిని త్వరగా తనవద్దకు తీసుకుంటాడు. ఇది శిక్ష కాదు..ఆ ఆత్మపై ఉన్న అపారమైన ప్రేమ. మంచి వ్యక్తి ఈ లోకంలో కల్మషం, బాధలు ఎక్కువకాలం చూడకుండా రక్షణ పొందుతాడు. కొందరు మహానుభావులు తమ జీవితంలో ఓ సందేశం ఇచ్చి వెళతారు. వారి మరణం కూడా లోకాన్ని ఆలోచింపజేస్తుంది. స్వామి వివేకానంద 39ఏళ్లకే మరణించారు. రామకృష్ణ పరమహంస 49 ఏళ్లు, జ్ఞానేశ్వర్ మహారాజ్ 21 ఏళ్లు..ఇలా చిన్న వయసులోనే వెళ్లిపోయినా శాశ్వత ప్రభావం చూపించారు. వారి జీవితాలు పరిణానం కాదు నాణ్యతను చూపిస్తాయ్.   ఇందులో సైంటిఫిక్ రియాల్టీ ఏంటంటే.. మరణం అనేది ఓ వ్యక్తి మంచి, చెడుమీద ఆధారపడి ఉండదు. అది పూర్తిగా జన్యుపరమైన కారణాలు, ఆరోగ్య అలవాట్లు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటుంది. చెడ్డవారు కూడా తొందరగా మరణించిన వారున్నారు కానీ.. వారి మరణాన్ని గుర్తించం..ఎందుకంటే వారు చేసే కర్మలే అందుకు కారణం. వారి లేని లోటు తెలియకపోవడం మరో కారణం కావొచ్చు.  మంచివారు మనమధ్య లేకపోయినా వారు చేసిన మంచి పనులు, పంచిన ప్రేమ ఎప్పటికీ మిగిలే ఉంటుంది. అందుకే మంచి కర్మలే ఆచరించాలని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు బోధించాడు.

    Monsoon Skin Problems : వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి? లక్షణాలు, నివారణ చిట్కాలు చెప్పిన డెర్మటాలజిస్ట్

    Fungal Infections In Monsoon : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే వీటికి ప్రధాన కారణాలు ఏంటో.. వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Monsoon Fungal Infections Causes : వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అధిక తేమ, చెమట, తడి బట్టలు, గాలి సరిగా ఆడకపోవడం వంటి కారణాలు ఫంగస్ పెరుగుదలకు కారణం అవుతాయి.  హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ పద్మజ మాట్లాడుతూ.. శరీరంలోని తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ముఖ్యంగా తొడల మధ్య భాగం, చంకలు, కాలి వేళ్ల మధ్య, రొమ్ముల కింద భాగం, చర్మ మడతలు ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వానాకాలంలో రింగ్‌వార్మ్ (టినియా), అథ్లెట్స్ ఫుట్, జాక్ ఇచ్, కాండిడియాసిస్, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి లక్షణాలుగా నిరంతర దురద, ఎర్రటి లేదా పొలుసుల్లా కనిపించే మచ్చలు, మంట, చర్మం ఊడిపోవడం, పాదాల నుంచి దుర్వాసన రావడం, గోర్లు రంగు మారడం లేదా మందంగా మారడం వంటివి ఉండవచ్చు. మొదట్లో ఇవి చిన్న సమస్యల్లా అనిపించినా, చికిత్స తీసుకోకపోతే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ పద్మజా హెచ్చరించారు. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే వర్షాకాలంలో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంది. అదే తడిసిన తర్వాత కూడా తడి బట్టలు, సాక్స్ లేదా చెప్పులు గంటల తరబడి వేసుకునే ఉంటారు. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణమని డాక్టర్ పద్మజ తెలిపారు. ఫంగస్ వేడి, తేమ ఉన్న వాతావరణంలో వేగంగా పెరుగుతుంది. కొద్దిసేపు తేమ నిలిచినా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  ఎవరికి ప్రమాదం ఎక్కువ  మధుమేహం ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఎక్కువగా చెమట పట్టేవారు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. అలాగే జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, కామన్ చేంజింగ్ రూమ్‌లను తరచూ ఉపయోగించే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపించవచ్చు. ఎలా నివారించాలి? ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. చర్మాన్ని పొడిగా ఉంచడం మొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. వీలైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తడిసిన బట్టలు ఎక్కువసేపు వేసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత పాదాల మధ్య భాగాన్ని కూడా బాగా తుడిచి ఆరబెట్టాలి. అలాగే తువ్వాళ్లు, సాక్స్, చెప్పులు లేదా వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకండి. ఎక్కువగా చెమట పట్టే ప్రాంతాల్లో యాంటీ ఫంగల్ పౌడర్లను ఉపయోగించడం ద్వారా తేమను తగ్గించుకోవచ్చు. సొంత వైద్యం వద్దు దురద, ఎర్రటి మచ్చలు, చర్మం పొలుసుల్లా ఊడిపోవడం లేదా తరచూ రాషెస్ రావడం వంటి లక్షణాలు కొనసాగితే సొంత వైద్యం కాకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. మార్కెట్లో దొరికే కొన్ని క్రీములు, ముఖ్యంగా స్టెరాయిడ్లు కలిగిన క్రీములు తాత్కాలికంగా లక్షణాలను తగ్గించినా.. ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గి మళ్లీ రాకుండా ఉండాలంటే సరైన నిర్ధారణతో పాటు తగిన యాంటీ ఫంగల్ చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ పద్మజ సూచించారు.

    Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు

    Robotic Tele Surgery : డాక్టర్ చైనాలో ఉన్నారు.. రోగి హైదరాబాద్లో ఉన్నారు. అక్కడి నుంచే ఇక్కడ సర్జరీ నిర్వహించి చరిత్ర సృష్టించారు ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు. World First Tele Robotic Ureteric Reimplantation : భారత వైద్య రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. హైదరాబాద్‌లోని ఓ రోగికి.. చైనాలో ఉన్న సర్జన్ విజయవంతంగా రిమోట్ రోబోటిక్ సర్జరీ నిర్వహించారు. దాదాపు 3,900 కిలోమీటర్ల దూరం నుంచే ఈ శస్త్రచికిత్స జరగడంతో వైద్య రంగంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏమి సర్జరీ చేశారు.. దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.  ఈ అరుదైన టెలి-రోబోటిక్ సర్జరీని హైదరాబాద్‌కు చెందిన ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా టెలి-రోబోటిక్ యూరెటెరిక్ రీఇంప్లాంటేషన్ సర్జరీ చేయడం విశేషమని వైద్యులు చెప్తున్నారు.  రోగికి ఉన్న సమస్య ఇదే హైదరాబాద్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ లోయర్ యూరెటెరిక్ స్ట్రిక్చర్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో మూత్ర మార్గానికి పదేపదే అడ్డంకి ఏర్పడటంతో.. ముందుగా స్టెంట్ ద్వారా తాత్కాలిక ఉపశమనం కల్పించారు. కానీ సమస్య మళ్లీ తిరిగి రావడంతో.. టెస్ట్​లు చేశారు. దానిలో మూత్ర ప్రవాహానికి నిరంతర అడ్డంకి ఉన్నట్లు గుర్తించి.. యాంటీ-రిఫ్లక్స్ యూరెటెరిక్ రీఇంప్లాంటేషన్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ శస్త్రచికిత్స ద్వారానే మూత్రం సాధారణంగా ప్రవహించేలా చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఉన్నది చైనాలో.. సర్జరీ హైదరాబాద్‌లో AINUలో డైరెక్టర్ రోబోటిక్ అండ్ మినిమల్ యాక్సెస్ యూరాలజికల్ సర్జన్గా చేస్తున్న డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ ఘౌస్.. చైనాలోని వుహాన్ నగరంలో ఉంటూ.. హైదరాబాద్‌లోని రోగికి ఈ శస్త్రచికిత్స చేశారు. చైనాలోని టాంగ్జీ హాస్పిటల్‌తో కలిసి ఈ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు.  సర్జరీ ప్రత్యేకత ఇదే ఈ టెలిసర్జరీలో అత్యాధునిక రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ఉపయోగించారు. కేవలం 100 మిల్లీసెకండ్ల కంటే తక్కువ లేటెన్సీతో రియల్ టైమ్‌లో సర్జన్ రోబోటిక్ పరికరాలను నియంత్రించినట్లు తెలిపారు. రోగి నుంచి అనుమతి తీసుకుని.. దానికి సంబంధించిన నియంత్రణ సంస్థల ఆమోదంతోనే ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని AINU, చైనాలోని టాంగ్జీ హాస్పిటల్ రెండు చోట్లా ప్రత్యేక యూరో సర్జన్ల బృందాలు అందుబాటులో ఉండేలా చూసుకున్నామన్నారు.  వైద్యులు ఏమంటున్నారంటే.. AINU చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీ వల్ల సంక్లిష్టమైన ఆపరేషన్లు మరింత బాగా, సులభంగా చేయగలుగుతున్నామని తెలిపారు. 5G టెక్నాలజీతో టెలి-ప్రాక్టరింగ్‌, టెలిసర్జరీ వైద్య రంగ భవిష్యత్తుగా మారుతున్నాయన్నారు. అనుభవజ్ఞులైన సర్జన్లు ఎక్కడ ఉన్నా కీలక దశల్లో బృందాన్ని గైడ్ చేయవచ్చని తెలిపారు.   డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ ఘౌస్ మాట్లాడుతూ.. సాంకేతికత వల్ల శస్త్రచికిత్సల సరిహద్దులు పూర్తిగా మారుతున్నాయని తెలిపారు. అధిక వేగంతో కూడిన కనెక్టివిటీ, ఆధునిక రోబోటిక్ వ్యవస్థలతో దేశాల మధ్య దూరం ఉన్నా.. సర్జరీలు చేయగలుగుతున్నామన్నారు. అలాగే ఇప్పటివరకు AINUలో 1,400కు పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించినట్లు తెలిపారు.  టెలిసర్జరీ వల్ల లాభాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు టెలిసర్జరీ వల్ల మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. అలాగే పెద్ద నగరాలకు ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది. స్థానిక వైద్యుల నైపుణ్యం పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది.